ప్రధాని నరేంద్ర మోదీపై `భరత్ అనే నేను` డైరెక్టర్ సెటైర్ !
ప్రధాని నరేంద్ర మోదీకి భరత్ అనే నేను సినిమా డైరెక్టర్ కొరటాల శివ సూటి ప్రశ్న !!
ప్రజాప్రతినిధులు ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి. అందుకోసం ఎంత సాహసమైనా చేయాలి అనే సందేశాన్ని ఇస్తూ భరత్ అనే నేను సినిమాతో త్వరలోనే ఆడియెన్స్ ముందుకొస్తున్న డైరెక్టర్ కొరటాల శివ తాజాగా ప్రధాని నరేంద్ర మోదీపై నేరుగానే సెటైర్ వేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌కి ఇచ్చిన మాటను గుర్తు చేసి ఆయనను మనిషిని చేద్దాం అంటూ కొరటాల చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది. "అసలు తెలుగు రాష్ట్రాలు రెండూ భారత్‌లో వున్నాయని మీరు భావిస్తున్నారా" అని కొరటాల సూటిగా అడిగిన తీరు చర్చనియాంశంగా మారింది.
మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ లాంటి గత మూడు చిత్రాల ద్వారా సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చిన డైరెక్టర్ కొరటాల శివ త్వరలోనే భరత్ అనే నేను సినిమాతోనూ మరో బలమైన సందేశంతో అభిమానుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే ఇటీవల రిలీజైన ఈ సినిమా టీజర్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుండగా తాజాగా కొరటాల శివ చేసిన ఈ ట్వీట్ సమాజం పట్ల అతడికి వున్న సామాజిక బాధ్యతకు అద్దం పట్టింది.