Mohan Babu: పెదరాయుడు తరహాలో ఫామ్ హౌస్ లో మోహన్ బాబు తీర్పు.. అన్నదమ్ముల బౌన్సర్ల మధ్య గొడవలు..!

Mohan Babu Viral Photo: జల్ పల్లి లో ఉన్న మోహన్ బాబు ఫామ్ హౌస్ లో కొంతమంది కొట్టుకోవడం ఇప్పుడు వైరల్ గా మారింది. మోహన్ బాబు కుటుంబంలో వ్యక్తుల మధ్య గొడవలు రోజురోజుకు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ ఘటన నుండి వీడియో బయటపడడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Dec 10, 2024, 02:27 PM IST
Mohan Babu: పెదరాయుడు తరహాలో ఫామ్ హౌస్ లో మోహన్ బాబు తీర్పు.. అన్నదమ్ముల బౌన్సర్ల మధ్య గొడవలు..!

Mohan Babu Viral Video: గత రెండు మూడు రోజుల నుంచి మంచు కుటుంబానికి సంబంధించి గొడవలు జరుగుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా జల్ పల్లి ఫామ్ హౌస్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఎక్కువగా వినిపిస్తోంది.. చిన్న కొడుకు మంచు మనోజ్, అతని భార్య మౌనిక ఇంటి నుంచి వెళ్లగొట్టిన కొన్ని నిమిషాలలోనే ఒక వీడియోని సైతం లీక్ చేయడం జరిగింది.. 

జల్ పల్లి ఫామ్ హౌస్ లో ఇప్పుడు ఏం జరుగుతోంది అనే విషయం పైన ఇప్పుడు ఒక స్పష్టత అనేది వచ్చేసింది. అసలు ఈ వీడియో ఎవరు తీశారు? కొట్టింది ఎవరు..? మోహన్ బాబు కళ్ళేదుటే జరుగుతున్న ఈ విషయాలు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. 

అసలు విషయంలోకి వెళ్తే.. ఈ వీడియో విషయానికి వస్తే ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మోహన్ బాబు సమక్షంలో కొడుతున్న ఆ వ్యక్తి ప్రైవేట్ సెక్యూరిటీకి చెందిన వ్యక్తి అని సమాచారం. మోహన్ బాబు ముందే ఇద్దరి పైన ఆ వ్యక్తి దాడి చేసి చెంప చెల్లుమనిపించేలా చేయడమే కాకుండా వారి దగ్గర ఉండే మొబైల్స్ కూడా లాక్కున్నట్లు కనిపిస్తోంది . మోహన్ బాబు కుర్చీలో కూర్చొని కూడా చూస్తూ ఉండడం మనం గమనించవచ్చు. 

 

జల్ పల్లి ఫామ్ హౌస్ లో బయట మోహన్ బాబు కుర్చీ వేసుకొని కూర్చున్నప్పటికీ చుట్టూ చాలామంది ఉన్నట్టుగా కనిపిస్తోంది.. ఒక నల్ల షర్టు వేసుకున్న వ్యక్తి బౌన్సర్ లా ఉన్నారు..పెదరాయుడు తరహాలో మోహన్ బాబు కూర్చుని ఉంటే నల్ల చొక్కా వేసుకున్న వ్యక్తి ఓ ఇద్దరిని కొట్టడం ఈ వీడియోలో మరింత స్పష్టంగా కనిపిస్తోంది. అయితే చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు. కొడుతున్న వ్యక్తిని కూడా ఎవరు ఆపేందుకు ప్రయత్నం చేయలేదు. 

అయితే మోహన్ బాబు ఎలాంటి తీర్పు చెప్పారు కొట్టిన వాళ్లు ఎవరు ..? కొట్టించుకున్న వారు ఎవరు? అనే విషయం పై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. మొత్తానికి ఫామ్ హౌస్ లో జరుగుతున్న ఈ ఘటన వీడియో తీసింది ఎవరు? అనే విషయం కూడా తెలియడం లేదు.మొత్తానికి సోషల్ మీడియాలో మాత్రం  ఈ వీడియో హాట్ టాపిక్ గా మారుతున్నది.

Read more: Free Bus Scheme: ఏపీ మహిళలు ఎగిరి గంతేసే వార్త.. ఉచిత బస్సు ప్రయాణంకు మూహూర్తం ఫిక్స్.. కీలక ప్రకటన..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News