Allu Arjun Released Video Viral: సంధ్య థియేటర్ తొక్కిస్లాట ఘటనలో అరెస్టు అయిన హీరో అల్లు అర్జున్ నేడు ఉదయం చంచలగూడ జైలు నుంచి విడుదలయ్యారు. మద్యంతర బేయిల్‌  పత్రాలను పరిశీలించిన అధికారులు ఆయన జైలు వెనుక గేట్ నుంచి పంపించేశారు. అల్లు అరవింద్ కూడా ఉదయమే జైలు వద్దకు చేరుకున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనను మహిళా చనిపోవడంతో అల్లు అర్జున్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.. అనంతరం నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే హైకోర్టు ను ఆశ్రయించగా మధ్యంతర బేయిల్ లభించింది..ఈరోజు ఉదయం 6:30 గంటల సమయంలో ఎస్కార్ట్‌ ఇచ్చి బన్నీని బ్యాక్‌ గేట్‌ నుంచి పంపించిన పోలీసు అధికారులు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదీ చదవండి: రేవంత్‌ రెడ్డి ఫ్లాప్‌ యాక్టర్‌.. అల్లు అర్జున్‌ సూపర్‌ స్టార్‌: అర్నబ్‌ గోస్వామి  


జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల కానున్న నేపథ్యంలో అక్కడ భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. అల్లు అరవింద్‌ లాయర్లు ఉదయమే జైలుకు చేరుకున్నారు. అయితే అల్లు అర్జున్ విడుదల నేపథ్యంలో ఎక్కువ మంది ఫాన్స్, జైలు వద్దకు చేరుకునే నేపథ్యంలో మళ్లీ తొక్కిసలాట ఘటన కూడా చోటు చేసుకోవచ్చని ముందస్తుగానే పోలీసులు ఊహించి భారీ భద్రత మొహరించారు. ఈ ఉదయమే ఆయన్ను విడుదల చేశారు అయితే బన్నీ రాత్రంతా జైల్లో ఉన్న విషయం తెలిసిందే.



 


చంచల్‌ గూడ జైలులో అండర్ ట్రయల్‌ ఖైదీగా ఆయనకు 7697 నంబర్‌తో మంజీరా బ్యారక్ లో ఉంచారు. రాత్రి 10 గంటల వరకు రిసెప్షన్లో ఉన్న అల్లు అర్జున్ డైరెక్టర్ లోని క్లాస్1 రూంకు తరలించినట్టు తెలుస్తుంది.. అందులో బన్నీ తో పాటు ఈ కేసు విచారణలో ఉన్న ఇతర ఖైదీలు కూడా ఉన్నట్లు సమాచారం.


సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ అయిన బన్నీ నేడు ఉదయం విడుదలయ్యారు.. ఈ కేసులో అల్లు అర్జున్ ఏ లెవెల్ గా ఉండగా థియేటర్ పార్టనర్ రామ్ రెడ్డి ఏ 1 అలా మొత్తంగా 18 మందిని పోలీసులు నిందితులుగా చేర్చారు. అయితే రాత్రంతా జైల్లో ఉన్న అల్లు అర్జున్ తరలించారు.. జైలు అధికారులు ఫోటో ఆఫర్ చేసిన బన్ని తీసుకోలేదని సమాచారం 14 రోజుల రిమాండ్ విధించిన న్యాయాధికారులు ఆయనను ప్రత్యేక ఖైదీగా పరిగణించాలని ఆదేశించారు. నేపథ్యంలో బన్నీకి కొత్త దుప్పటి ఇచ్చినా ఆయన తీసుకోలేదని సాధారణ ఖైది లాగే నేల మీద పడుకున్నట్లు తెలుస్తోంది...


ఇదీ చదవండి: జులూస్‌కు పర్మిషన్‌ తీసుకోలేదుగా.. అందుకే తొక్కిసలాట జరిగింది: పీపీ  


ఈ కేసులో న్యాయపోరాటం చేస్తామని అల్లు అర్జున్‌ తరఫున లాయర్ చెప్పారు. డిసెంబర్ 4వ తేదీ పుష్పా2 బెనిఫిట్ షోలో జరిగిన తొక్కిసలాట ఘటనలో బన్నీని శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. ఈరోజు ఉదయం మధ్యంతర బెయిల్ తో విడుదల చేశారు. అంతకు ముందు 14 రోజుల రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.