Telugu Heroine Vasanthika Macha Missing: తెలుగు సినిమా ఇండస్ట్రీలో రెండు సూపర్ హిట్ సినిమాలలో నటించిన నటి మిస్ అవ్వడం ప్రస్తుతం సంచలనానికి గురిచేస్తుంది.. శివాజీ ప్రధాన పాత్రలో ఈటీవీలో విడుదలైన సినిమా 90’s. ఈ చిత్రం డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మంచి విజయం సాధించింది. శివాజితో పాటు ఈ సిరీస్ లో వాసుకి కూడా నటించారు.
ఈ వెబ్ సిరీస్ లో నటించిన వారిలో మౌళి , వాసంతిక, రోషన్ రాయ్ కీలక పాత్రలో కనిపించారు. ఇందులో కనిపించిన మౌళి ఇప్పటికే లిటిల్ హాట్ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇక పెద్దకూతురుగా కనిపించిన.. వాసంతిక తన చిన్నప్పుడు నాని హీరోగా వచ్చిన .. కృష్ణగాడి వీరప్రేమగాధ సినిమాలో కూడా చిన్నపిల్లగా.. ముఖ్య పాత్రలో కనిపించింది.
అయితే ఇప్పుడు ఈ నటి మిస్సయింది అంటూ.. తన లాస్ట్ వీడియో ఇదే అంటూ ఒక వీడియో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోని ఇంస్టాగ్రామ్ లో చాలామంది షేర్ చేస్తున్నారు.
అయితే ఈ వీడియోలో ఆమె ఒక టేబుల్ పక్కన నడుస్తూ కనిపించింది. ఇక అదే తన లాస్ట్ వీడియో అని.. ఆ తర్వాత నుంచి ఆమె ఎక్కడా కూడా కనిపించలేదు అంటూ ఈ వీడియోలో క్యాప్షన్ ఉంది. ఇక ఇదంతా కూడా.. ఒక రూమ్ లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యి ఉంది. ఈ సీసీ కెమెరా ఫుటేజ్ ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం కూడా ట్రెండ్ అవుతోంది. దీంతో.. అసలు ఈ హీరోయిన్ కి ఏమయింది అంటూ కంగారుపడుతూ చాలామంది కామెంట్ పెడుతున్నారు.
మరి కొంతమంది మాత్రం ఇదేదో తన రాబోయే సినిమా పబ్లిసిటీ అంటూ అంటున్నారు.. మౌళి లాగానే.. వాసంతిక కూడా త్వరగా ఒక సినిమాలో హీరోయిన్గా చేస్తోంది అన్న వార్త గట్టిగా వినిపిస్తున్న తరుణంలో.. ఆ సినిమా షూటింగ్ సిసి ఫుటేజ్ .. వైరల్ చేస్తూ ఈమె మిస్ అయింది అని సోషల్ మీడియాలో పెడుతున్నారు అని వార్త కూడా తెగ వినిపిస్తోంది. మరోపక్క ఈమె మిస్సింగ్ గురించి ఎటువంటి అధికారిక ప్రకటన లేదు.
Also Read: IMF: అమెరికా టారిఫ్స్ భారత్‌ను ఏం పీకలేవు.. ట్రంప్‌నకు ఇచ్చి పడేసిన ఐఎంఎఫ్..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









