Hari Hara Veera Mallu:తెలుగు చిత్ర పరిశ్రమలో పవన్ కళ్యాణ్ అంటే ఒక బ్రాండ్. పవన్ కళ్యాణ్ అంటే ఒక ప్రభంజనం. ఆయన చిత్రం రిలీజ్ అవుతుందంటే తెలుగు రాష్ట్రాల్లో ఓ రకమైన పండుగ వాతావరణమే. అలాంటిది పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక చిత్రం 'హరి హర వీరమల్లు'కి బయ్యర్లు దొరకట్లేదంటే అసలు నమ్మశక్యంగా లేని మాటలను కొంత మంది పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారని చిత్ర యూనిట్ ఓ ప్రకటన విడుదల చేసింది. అంతేకాదు హరి హర వీరమల్లు సినిమాపై కొంత మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దీని వెనక ఎవరి ప్రయోజనాలున్నాయో అని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ లో యాక్ట్ చేసిన ఫస్ట్ పాన్ ఇండియా మూవీ 'హరి హర వీరమల్లు'. పైగా ఆయన తొలిసారి చారిత్రక యోధుడిగా నటించిన ఫస్ట్ మూవీ. మునుపెన్నడూ చూడని విధంగా సరికొత్తగా ఈ సినిమా కోసం కనిపిస్తున్నారు. అద్భుతమైన సెట్లు, గ్రాఫిక్స్ తో ఎక్కడా రాజీ పడకుండా మెగా సూర్య ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించింది. 2020 సెకాండాఫ్ లో మొదలై, 2022 జనవరిలో విడుదల కావాల్సింది ఈ సినిమా.. పవన్ కళ్యాణ్ బిజీ షెడ్యూల్.. రాజకీయాలతో పాటు ఇతర నటుల డేట్స్ అడ్జస్ట్ వంటి పలు కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. హరి హర వీరమల్లు ప్రకటించిన తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో అనే మూడు సినిమాలు వచ్చాయంటే.. ఈ చిత్రం ఎంత ఆలస్యమైందో అర్థం చేసుకోవచ్చు.
ఐదేళ్ల సుదీర్ఘ ప్రయాణం ఈ చిత్రానిది. అసలే భారీ బడ్జెట్ పీరియాడిక్ ఫిల్మ్. దానికి తోడు షూటింగ్ ఆలస్యమైంది. దాంతో సహజంగానే భారీగా బడ్జెట్ పెరిగిపోయింది.మామూలుగానే పవన్ కళ్యాణ్ సినిమాలు తెలుగునాట భారీ బిజినెస్ చేస్తుంటాయి. అలాంటిది ఆయన కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చారిత్రాత్మక ప్యాన్ ఇండియా తొలి చిత్రమిది. మరి ఈ సినిమా, ఏ స్థాయి బిజినెస్ చేయాలి. దానిని దృష్టిలో పెట్టుకునే నిర్మాతలు గత చిత్రాలకు మించి అధిక ధరలు చెబుతున్నారు. పలువురు బయ్యర్లు ఈ భారీ సినిమా హక్కులను సొంతం చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. నిర్మాతలతో చర్చలు కూడా జరుపుతున్నారు. ఒక రూపాయి అటో ఇటో తమ సినిమాకి పెట్టిన ఖర్చుకి తగ్గట్టుగా నిర్మాతలు సినిమా హక్కులను అమ్మేస్తారు.
ఇది ప్రతి సినిమాకి జరిగే వ్యవహారమే. హరి హర వీరమల్లుకి బయ్యర్లు లేరు అనేది పూర్తిగా సత్యదూరం. చాలా మంది బయ్యర్లు సిద్ధంగా ఉన్నారు.. సరైన డీల్స్ కోసం నిర్మాతలు చర్చలు జరుపుతున్నారనది వాస్తవం. కానీ, కొందరు మాత్రం హరి హర వీరమల్లుకి బయ్యర్లు లేరంటూ పని గట్టుకొని ప్రచారం చేస్తున్నారు.
కొన్ని చిత్రాలు తెలుగు సినిమా స్థాయిని పెంచేలా ఉంటాయి. బాహుబలి చిత్రం రెండు భాగాలకు కలిపి నాలుగైదేళ్లు పట్టింది. ఆ చిత్రం.. తెలుగు సినిమాని ఏ స్థాయికి తీసుకెళ్లిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హరి హర వీరమల్లు కూడా అలాంటి చిత్రమే. కొన్ని కారణాల వల్ల ఒక్క భాగానికే ఐదేళ్లు పట్టింది. కానీ తెలుగులో అత్యంత అరుదుగా వచ్చే చారిత్రాత్మక సినిమా ఇది. ఇలాంటి సినిమాలకు భుజానికెత్తుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. హరి హర వీరమల్లు లాంటి సినిమాలను ఆదరిస్తే.. తెలుగు సినిమా స్థాయి మరింత పెరుగుతంది.
"బయ్యర్లు లేరు, బజ్ లేదనేది కొంత మంది వాదన. పైగా ఈ చిత్రానికి ఆర్ధిక సమస్యలు చుట్టుముట్టాయి. డబ్బులు వెనక్కి తిరిగి ఇచ్చారు" అంటూ.. 'హరి హర వీరమల్లు' స్థాయిని, పవన్ కళ్యాణ్ స్థాయిని తగ్గించి చూపే ప్రయత్నం కొంత మంది పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తెలిసో తెలియక మీడియా, సోషల్ మీడియాలో కొందరు ఆ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.
సినిమా అనేది ఒక వ్యక్తికి సంబంధించినది కాదు. దాని వెనుక వందల కోట్ల ఖర్చు, వంద మంది కష్టం ఉంటుంది. ఒక్క సినిమా మీద వేలాది కుటుంబాటు ఆధారపడి ఉంటారు. ఇవన్నీ పట్టించుకోకుండా.. ఎవరో ఏదో చెప్పారని గుడ్డిగా ప్రచారం చేసేయకూడదని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ లాంటి తిరుగులేని హీరో సినిమాకి బయ్యర్లు లేరంటే.. కొంచెం కూడా ముందు వెనుక ఆలోచించకుండా తప్పుడు ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్ళకూడదనేది వాదన.
నిజానికి 'హరి హర వీరమల్లు' సినిమాకి పవన్ కళ్యాణ్ గత చిత్రాలను మించిన బజ్ ఉంది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా.. ఇతర భాషల్లో కూడా ఈ సినిమా హక్కుల కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. ఆలస్యంగా వచ్చినా.. అందరికీ సరైన సమాధానం చెప్పే సినిమా 'హరి హర వీరమల్లు'. ఇందులో ఎటువంటి డౌట్స్ లేదు. కుదిరితే మంచి సినిమాకి మద్దతు తెలపాలి. లేదంటే, మౌనంగా ఉండాలి. అంతేకాని, ఒక గొప్ప సినిమా స్థాయిని తగ్గించే ప్రయత్నం మాత్రం చేయకూడదన్నారు.
Also Read: Nandamuri Heroes: నందమూరి మూడు తరాల హీరోలు కలిసి నటించిన ఈ సినిమా తెలుసా
Also Read: NTR Sensational Record: తెలుగులో మరే ఇతర హీరోలు బ్రేక్ చేయని రికార్డు సాధించిన అన్న ఎన్టీఆర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









