)
Monthly Salary Hike: తెలుగు సినీ పరిశ్రమలో రెక్కలు వంచి కష్టపడుతున్న కార్మికులకు భారీ శుభవార్త. తమ వేతనాలు పెంచాలనే డిమాండ్‌తో చేపట్టిన నిరవధిక సమ్మెకు ఎట్టకేలకు ప్రభుత్వం, సినీ నిర్మాతలు, సినీ సంఘాలు దిగివచ్చాయి. 18 రోజులుగా షూటింగ్‌లు బంద్ చేసి కొనసాగుతున్న సమ్మెకు స్పందించిన ప్రభుత్వం, సినీ పెద్దలు కార్మికుల డిమాండ్లకు అంగీకారం తెలిపాయి. వేతనాలు 30 శాతం పెంచుతామని సినీ పెద్దలు ప్రకటించారు. ప్రభుత్వం చొరవతో సయోధ్య కుదరడంతో రేపటి నుంచి యథావిధిగా షూటింగ్‌లు పునఃప్రారంభం కానున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
సినీ కార్మికుల పరిష్కారానికి ప్రభుత్వం, కార్మిక శాఖ చొరవ తీసుకుంటుందని నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్మాతలు, ఫిల్మ్ ఫెడరేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్మికుల సమస్యలు పరిష్కరించుకుని సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. ఆ దిశగా తమ ప్రయత్నం ఉంటుందని.. ప్రభుత్వం ఆదేశాలతో ముందుకు వెళ్తామని దిల్ రాజు వెల్లడించారు.
లేబర్ కమిషనర్ గంగాధర్ మాట్లాడుతూ.. 'కార్మికులకు 30 శాతం పెరుగుదల అనేది జరుగుతుంది. మూడు, నాలుగు కండిషన్స్ మీద ప్రధానంగా చర్చలు జరిపాం. సుదీర్ఘంగా జరిగిన చర్చల్లో కార్మికుల వేతనాల పెంపుపై నిర్ణయం తీసుకున్నాం. మొత్తంగా 22.5 శాతం వేతనాల పెంపు ఉంటుంది' అని (వేతనాల రేషియోను బట్టి మార్పు) వెల్లడించారు. ప్రినిసిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేస్తున్నామని.. మిగతా చిన్న చిన్న సమస్యల కోసం ఈ కమిటీ పని చేస్తుందని ప్రకటించారు. నెల రోజుల్లో కమిటీ నివేదిక ఇస్తుందని తెలిపారు.
సమ్మె లేదు ఇక రేపటి నుంచి షూటింగ్స్ కొనసాగుతాయని ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని ప్రకటించారు. 'కార్మిక శాఖ చొరవ తీసుకుని పని చేసింది. ఎప్పుడు మాలో మేమే చర్చలు చేసుకుని సమ్మె ముగిస్తాం. ఈ సారి కార్మిక శాఖ చొరవ తీసుకుంది. మొత్తం 22.5 శాతం వేతనాల పెంపు చేయగా.. వాటిలో మొదటి ఏడాది 15 శాతం, రెండో ఏడాది 2.5 శాతం, మూడో ఏడాది 5 శాతం ఉంటుంది' అని వెల్లడించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.