Akkineni Nagarjuna: పట్టించుకోని రేవంత్‌ రెడ్డి.. హీరో నాగార్జునకు ఘోర అవమానం

Revanth Reddy Insults To Akkineni Nagarjuna In Miss World Event: సినీ నటుడు అక్కినేని నాగార్జునకు ఘోర అవమానం జరిగిందనే వార్త సినీ పరిశ్రమలో కలకలం రేపుతోంది. ఓ ఈవెంట్‌కు హాజరైన నాగ్‌ను రేవంత్ రెడ్డి పట్టించుకోలేదనే వార్త సంచలనంగా మారింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Ravi Kumar Sargam | Last Updated : May 13, 2025, 11:24 PM IST
Akkineni Nagarjuna: పట్టించుకోని రేవంత్‌ రెడ్డి.. హీరో నాగార్జునకు ఘోర అవమానం

Nagarjuna Insult By Revanth Reddy: సినీ పరిశ్రమతోపాటు తెలంగాణలో ఓ వార్త తీవ్ర దుమారం రేపుతోంది. ఓ ఈవెంట్‌లో హాజరైన సినీ నటుడు అక్కినేని నాగార్జునను రేవంత్ రెడ్డి అవమానించారనే వార్త సంచలనంగా మారింది. ఒకే ఈవెంట్‌కు హాజరైన వీరిద్దర పరస్పరం పలకరించుకోలేదని.. కనీసం హాయ్‌ అని కూడా చెప్పుకోలేదని సమాచారం. గతంలో ఏర్పడిన వివాదాలతో తాజాగా నాగార్జున వ్యవహారంలో రేవంత్‌ రెడ్డి వ్యవహరించారని చర్చ జరుగుతోంది. కాకతాళీయమో.. ఉద్దేశపూర్వకమో తెలియదు కానీ ఈ సంఘటన మాత్రం ఆసక్తికరంగా మారింది.

Also Read: Army Soldiers Salary: భారత సైనికుడి జీతం ఎంతో తెలుసా? ఏమేం బెనిఫిట్స్‌ ఉంటాయి?

తెలంగాణలో మిస్‌ వలర్డ్‌ 2025 పోటీలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రారంభమైన ఈవెంట్‌లో రోజుకో కార్యక్రమం జరుగుతోంది. అందాల పోటీలకు విచ్చేసిన వివిధ దేశాల భామలు చార్మినార్‌ను సందర్శించిన అనంతరం చౌమహల్లా ప్యాలెస్‌లో నిర్వహించిన విందుకు హాజరయ్యారు. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంటున్న సుందరీమణులకు ఇచ్చిన డిన్నర్‌కు రేవంత్‌ రెడ్డి తన సతీమణి గీతతో కలిసి హాజరయ్యారు. వారితోపాటు హీరో అక్కినేని నాగార్జున కూడా వచ్చారు.

Also Read: Nandamuri Family: జూ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ డుమ్మా.. 'నందమూరి' కుటుంబంలో తీవ్ర విబేధాలు

టేబుల్‌ వద్దకు చేరుకున్న వీరు పరస్పరం పలకరించుకోలేదు. నాగార్జున నమస్కరిస్తూ షేక్‌ హ్యాండ్‌ ఇవ్వబోగా రేవంత్‌ రెడ్డి స్పందించలేదు. పక్కనే ఉన్న అతడి సతీమణి గీత పలకరించారు. నాగార్జునతో పలకరించకుండా అక్కడకు హాజరైన మిగతా వారితో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఆ తర్వాత కొన్ని నిమిషాల పాటు రేవంత్‌, నాగార్జున ఒకే టేబుల్‌ వద్ద కూర్చున్నా కూడా పరస్పరం పలకరించుకోలేదు. అతడు పలకరించకపోవడంతో నాగార్జున ఇటు తిరిగి కూర్చున్నారు. కార్యక్రమం ఆసాంతం వీక్షించారు. ఈ వ్యవహారమంతా కెమెరా కంటికి చిక్కింది. ఆ వీడియో వైరల్‌గా మారింది.

వివాదం ఇక్కడ
ఈ స్థాయిలో వివాదం కావడం వెనుక కొన్ని నెలల కిందట జరిగిన పరిణామాలు కారణంగా తెలుస్తున్నాయి. నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ను గతంలో హైడ్రా కూల్చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నాగార్జున కుమారుడు హీరో నాగచైతన్య విడాకుల అంశంలో కొండా సురేఖ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి. వరుస పరిణామాలతో నాగార్జున కుటుంబం రేవంత్‌ రెడ్డిపై ఆగ్రహంతో ఉందని తెలుస్తోంది. గతంలో కూడా రేవంత్‌ రెడ్డి, నాగార్జున ఎదురుపడినా ఇదే సీన్ కనిపించింది. సినీ ప్రముఖులతో భేటీ సందర్భంగా నాగార్జున పాల్గొన్నా రేవంత్‌రెడ్డి పట్టించుకోలేదు. రేవంత్‌ రెడ్డి తీరు చూస్తుంటే సినీ పరిశ్రమతో సఖ్యత ఉండడం లేదని తెలుస్తోంది. తనకు వ్యతిరేకంగా వెళ్లే వారిని పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. అందులో భాగంగానే పాన్‌ ఇండియా స్టార్‌ను ఒక రోజు జైలుకు పంపించిన వైనాన్ని గుర్తుచేసుకుంటున్నారు. సినీ పరిశ్రమతో ప్రభుత్వ వైరం సరికాదని పలువురు చెబుతున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. FacebookTwitter

Trending News