Allu Arjun Sritej: ఆస్పత్రి నుంచి శ్రీతేజ్‌ డిశ్చార్జ్‌.. ఊపిరి పీల్చుకున్న అల్లు అర్జున్‌

Big Relief To Allu Arjun Sritej Discharged From Hospital: సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌కు భారీ ఊరట లభించింది. ఘటనలో గాయపడిన బాలుడు కొంత కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ కావడం విశేషం. అయితే బాలుడు సాధారణ స్థితికి రావడానికి మరికొంతకాలం పట్టే అవకాశం ఉంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 29, 2025, 09:49 PM IST
Allu Arjun Sritej: ఆస్పత్రి నుంచి శ్రీతేజ్‌ డిశ్చార్జ్‌.. ఊపిరి పీల్చుకున్న అల్లు అర్జున్‌

Sritej Discharge: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కు భారీ ఊరట లభించింది. సంధ్య థియేటర్‌ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న అతడి అభిమాని శ్రీతేజ్‌ కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యాడు. కిమ్స్‌ ఆస్పత్రి నుంచి శ్రీతేజ్‌ డిశ్చార్జయినా కూడా ఇంటికి వెళ్లకపోవడం గమనార్హం. అయితే అతడి ఆరోగ్య పరిస్థితి ఇంకా మెరుగు కాలేదని తెలుస్తోంది. ఈ మేరకు కిమ్స్‌ ఆస్పత్రి వైద్యులు కీలక ప్రకటన చేశారు. మరికొన్నాళ్లు ఇంటి వద్ద కొనసాగాలని వైద్యులు తెలిపారు.

Add Zee News as a Preferred Source

Also Read: Indian Army: రెండు, మూడు రోజుల్లో పాకిస్థాన్‌పై యుద్ధం? సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన ప్రధాని మోదీ

ఇంకా మెరుగు కావాలి
గత డిసెంబర్‌ 4వ తేదీన పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌ రోడ్డులోని సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట చోటుచేసుకుంది. తొక్కిసలాటలో వివాహిత రేవతి మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్ర గాయాలతో సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి మెరుగవడంతో వైద్యులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారు. రిహాబిలిటేషన్‌ కేంద్రానికి తరలించాలని వైద్యులు చెప్పారు. 15 రోజుల పాటు శ్రీతేజ్‌కు ఫిజియోథెరపీ వంటివి సపర్యలు చేయాల్సి ఉందని వైద్యులు డిశ్చార్జ్‌ షీట్‌లో రాశారు. అయితే బాలుడు సాధారణ స్థితికి రావడానికి మాత్రం మరికొంతకాలం పట్టే అవకాశం ఉంది. ఘటన జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు శ్రీతేజ్‌ మొత్తం 4 నెలల 5 రోజులు ఆస్పత్రిలో చికిత్స పొందాడు. అయితే శ్రీతేజ్‌ చికిత్సకు అయిన ఖర్చు మొత్తం అల్లు అర్జున్‌తోపాటు పుష్ప 2 సినిమా నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్‌ భరించింది.

Also Read: Pawan Kalyan: 'ప్రధాని నరేంద్ర మోదీ ముందు పవన్‌ కల్యాణ్‌ డ్యాన్స్‌లు చేసుకో..!'

'మమ్మల్ని గుర్తు పట్టడం లేదు'
తన కుమారుడు శ్రీతేజ్‌ డిశ్చార్జ్‌ అంశంపై బాలుడి తండ్రి భాస్కర్‌ కీలక వివరాలు వెల్లడించారు. '15 రోజుల నుంచి ఐసీయూ నుంచి సాధారణ రూమ్‌కు పంపారు. ఇన్ఫెక్షన్లు లేకుండా శ్రీతేజ్‌ పరిస్థితి బాగా ఉంది. రిహాబిలిటేషన్‌ కేంద్రానికి పంపించిన అనంతరం ఇంటికి తీసుకెళ్లాలని వైద్యులు చెప్పారు. శ్రీతేజ్‌ ఇప్పుడు కళ్లు తెరచి చూస్తున్నా మమ్మల్ని గుర్తు పట్టడం లేదు' అని భాస్కర్‌ భావోద్వేగానికి లోనయ్యారు. 'శ్రీతేజ్‌ బ్రెయిన్‌ రికవరీ కాలేదు. కేవలం ద్రవ పదార్థాలు మాత్రమే పైపు ద్వారా అందిస్తున్నాం' అని చెప్పారు. తన కొడుకు విషయంలో అల్లు అర్జున్‌, పుష్ప 2 చిత్రబృందం మద్దతుగా నిలిచారని.. ఆస్పత్రిలో రూపాయి కూడా చెల్లించలేదని బాలుడి తండ్రి భాస్కర్‌ వివరించారు.

పూర్తి అండగా అల్లు అర్జున్‌
ఈ ఘటనతో బాలుడి కుటుంబానికి అల్లు అర్జున్‌ పూర్తిగా అండగా నిలిచారు. బాలుడి తండ్రి భాస్కర్‌కు సినీ పరిశ్రమలో ఒక ఉపాధి లేదా ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. బాలుడి పరిస్థితి మెరుగయ్యాక శ్రీతేజ్‌ కుటుంబాన్ని అల్లు అర్జున్‌ స్వయంగా పరామర్శించే అవకాశం ఉంది. కాగా ఈ తొక్కిసలాట సంఘటనలో అల్లు అర్జున్‌ ఒక రోజు జైలుకు వెళ్లి రావడం తీవ్ర రాజకీయ దుమారం రేపడమే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. రేవంత్‌ రెడ్డి కక్షపూరితంగా అల్లు అర్జున్‌ను జైలుకు పంపించారని ఇప్పటికీ చర్చ జరుగుతోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News