Allu Arjun Bail: సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట కేసులో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కు భారీ ఊరట లభించింది. నాంపల్లి కోర్టు రిమాండ్‌ విధించగా.. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు మాత్రం మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో బన్నీ చంచల్‌గూడ జైలుకు వెళ్లాల్సి ఉండగా.. కొద్దిలో తప్పించుకున్నారు. హైకోర్టు మధ్యంతర తీర్పుతో అల్లు అర్జున్‌ అభిమానులు, చిరంజీవి, అల్లు కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. వ్యక్తిగత పూచీకత్తు మీద న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడంతో అల్లు అభిమానులు సంబరాల్లో మునిగారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Allu Arjun Arrest: అల్లు అర్జున్‌ కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. మృతురాలు రేవతి భర్త కేసు వెనక్కి?


సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట చోటుచేసుకుని రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఇద్దరు పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న చిక్కడపల్లి పోలీసులు ఏడుగురిని అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో ఏ11గా ఉన్న ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ను అరెస్ట్‌ చేశారు. వైద్య పరీక్షల అనంతరం చంచల్‌గూడ జైలులో విచారణ చేపట్టారు. ఆ కోర్టు 14 రోజుల రిమాండ్‌ ఇవ్వడంతో అభిమానులు షాకయ్యారు.


Also Read: Allu Arjun: పోలీసుల అత్యుత్సాహం.. బెడ్రూమ్‌లోకి రావడంపై అల్లు అర్జున్ ఆగ్రహం


అయితే తన అరెస్ట్‌పై అల్లు అర్జున్‌ తరఫున న్యాయవాదులు క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. మధ్యాహ్నం తొలి దశలో విచారణ చేపట్టిన న్యాయస్థానం సాయంత్రం మరోసారి వాదనలు చేసింది. ఈ సందర్భంగా వాడీవేడిగా ధర్మాసనంలో వాదనలు కొనసాగాయి. 'థియేటర్‌కు వెళ్లడానికి  ఆయన సినిమా నటుడు అనుమతి తీసుకున్నాడు కదా. అనుమతి తీసుకున్నప్పటికీ హీరో హీరోయిన్‌లను థియేటర్‌కు పిలవద్దని పోలీసులు థియేటర్ యాజమాన్యానికి లేఖ రాశారు. మరి థియేటర్ యాజమాన్యం హీరోకు ఈ విషయం చెప్పారా? ఒకవేళ చెబితే ఎలా చెప్పారు?' అంటూ హైకోర్టు ప్రశ్నలు వేసింది.


తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లు క్వాష్‌ చేయాలని అల్లు అర్జున్‌ వేసిన పిటిషన్‌పై తీవ్ర చర్చ జరిగింది. ఇప్పటివరకు ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. అల్లు అర్జున్‌కు బెయిల్ ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రీమియర్‌ షోకు అనుమతి తీసుకోలేదన్న పోలీసులు తెలపగా.. డిసెంబర్‌ 2వ తేదీన పోలీసులకు లేఖ రాశామని అల్లు అర్జున్‌ న్యాయవాది తెలిపారు. 'అకనాలెడ్జ్‌మెంట్ తీసుకున్నారా?' అని న్యాయస్థానం ప్రశ్నించడంతో చిక్కడపల్లి ఏసీపీ సంతకం చేసిన కాపీని అల్లు అర్జున్‌ న్యాయవాది కోర్టుకు సమర్పించారు.


వాదనలు విన్న అనంతరం తెలంగాణ హైకోర్టు వ్యక్తిగత పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. జైలు సూపరింటెండెంట్‌కు షూరిటీలు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. అర్ణాబ్ గోస్వామి తీర్పు ఆధారంగా అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు తీర్పుతో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు విధించిన 14 రోజుల  రిమాండ్ వృథా అయిపోయింది. చంచల్‌గూడా జైలుకి తరలింపు ఆగిపోయింది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter