Manchu Lakshmi Video: మంచు ఫ్యామిలీకి మరో బిగ్ షాక్.. మంచు లక్ష్మి అరెస్ట్ తప్పదా..?.. వైరల్‌గా మారిన వీడియో..

Betting app controversy: బెట్టింగ్ యాప్ వివాదం ప్రస్తుతం హాట్  టాపిక్ గా మారింది. తాజాగా.. ఈ వివాదంలో మంచు లక్ష్మి కూడా చిక్కుకున్నారు. ఆమె గతంలో బెట్టింగ్ యాప్ లకు ప్రమోషన్స్ చేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Mar 18, 2025, 05:45 PM IST
  • మరో వివాదంలో మంచు కుటుంబం..
  • చర్యలు తీసుకొవాలని నెటిజన్ల డిమాండ్ లు..
Manchu Lakshmi Video: మంచు ఫ్యామిలీకి మరో బిగ్ షాక్.. మంచు లక్ష్మి అరెస్ట్ తప్పదా..?.. వైరల్‌గా మారిన వీడియో..

Manchu Lakshmi in Betting app promotion controversy: మంచు కుటుంబాన్ని వివాదాలు మాత్రం అస్సలు వదలడం లేదని చెప్పుకొవచ్చు. గతేడాది మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ ల మధ్య ఆస్తివివాదాలు చెలరేగిన విషయం తెలిసిందే.ఈ ఘటన ఇండస్ట్రీతో పాటు, రెండు తెలుగు రాష్ట్రాల్లోను సంచలనంగా మారింది. మొత్తంగా మోహన్ బాబు, మంచు మనోజ్ ల మధ్య రచ్చ ప్రతిరోజు ఏదో అంశంతో వార్తలలో నిలిచింది. మరోవైపు మోహన్ బాబు రిపోర్టర్ పై దాడిచేయడం, జల్ పల్లిలోని గొడవలు కూడా తెగ చర్చకు దారితీశాయి. మంచు మోహన్ బాబు కుటుంబ తగాదాలు ప్రతిరోజు కూడా సినిమాలకు మించి ట్విస్ట్ లుగా మారాయి.  

Add Zee News as a Preferred Source

మంచు మనోజ్ .. మోహన్ బాబు యూనివర్సీటీ దగ్గరకు కూడా వెళ్లి గొడవలు చేయడం కూడా వార్తలలో నిలిచింది. ఇదంతా ఒకవైపు అయితే.. ఇటీవల సౌందర్య హత్యకు ప్లాన్ చేసిందీ.. మోహన్ బాబు అని ఖమ్మంకు చెందిన ఒక వ్యక్తి కలెక్టర్ కు , పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. జల్ పల్లిలోని ఆరుఎకరాల భూమిని మోహన్ బాబు అక్రమంగా అనుభవిస్తున్నాడని కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది కాస్త రచ్చగా మారడంతో సౌందర్య భర్త రంగంలోకి దిగి దీనిపై క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది.

 

ఈ నేపథ్యంలో..  తాజాగా.. మంచు లక్ష్మి వివాదంలో కొత్తగా వివాదంలో చిక్కుకుంది. ఇప్పటికే బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసిన వారిపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఈ క్రమంలో మంచు లక్ష్మి గతంలో బెట్టింగ్ యాప్ లకు ప్రమోషన్స్ చేసిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. వెంటనే మంచు లక్ష్మిపై కూడా పోలీసులు కేసులను నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Read more: Nidhi Agerwal Video: ఛీ.. ఛీ.. ఇంత రచ్చ జరుగుతున్న మళ్లీ పాడు పనిచేసిన నిధి అగర్వాల్.. వీడియో వైరల్..

ఈ క్రమంలో ఇప్పటి వరకు మంచు కుటుంబంలో దాదాపు అందరు వివాదంలో చిక్కుకుని వార్తలలో నిలిచారు. ఇప్పుడు మంచు లక్ష్మి కూడా బెట్టింగ్ యాప్ లను ప్రమోషన్స్ చేయడం వల్ల కాంట్రవర్సీలో చిక్కుకుంది. మొత్తంగా మంచు లక్ష్మిపై పోలీసులు కేసును నమోదు చేస్తారని, అరెస్ట్ చేసిన కూడా ఆశ్చర్య పోవాల్సిన అవసరంలేదని నెటిజన్ లు కామెంట్లు చేస్తున్నారు. మొత్తంగా ప్రస్తుతం బెట్టింగ్ యాప్ ల అంశం మాత్రం తెగ వార్తలలో ఉంటుంది. గతంలొ బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసిన వారంత ప్రస్తుతం బిక్కు బిక్కు మంటూ కాలం గడుపుతున్నారంట.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News