Kannappa Movie: అభిమానులకు షాక్ ఇచ్చిన మంచు విష్ణు.. కన్నప్ప సినిమా వాయిదా

Kannappa Movie Release Postponed Know Reason Here: ప్రతిష్టాత్మకంగా మంచు కుటుంబం తెరకెక్కిస్తున్న కన్నప్ప సినిమా వాయిదా పడింది. ఈ మేరకు మంచు విష్ణు సంచలన ప్రకటన విడుదల చేశాడు. ఎందుకు వాయిదా? ఏమైంది? అనే వివరాలు తెలుసుకుందాం.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 29, 2025, 05:11 PM IST
Kannappa Movie: అభిమానులకు షాక్ ఇచ్చిన మంచు విష్ణు.. కన్నప్ప సినిమా వాయిదా

Manchu Vishnu: తెలుగు సినీ పరిశ్రమలో శివభక్తిపై రూపొందించిన భక్త కన్నప్పను సరికొత్తగా మంచు కుటుంబం తెరకెక్కిస్తోంది. భారీ బడ్జెట్‌తో.. అన్ని హంగులతో విడుదల చేయాలనుకున్న కన్నప్ప సినిమాకు భారీ షాక్‌ తగిలింది. సినిమా విడుదల తాత్కాలికంగా ఆగిపోయింది. సినిమాను వాయిదా వేస్తున్నట్లు మంచు విష్ణు ప్రకటించాడు. ఈ సందర్భంగా అభిమానులు, ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పాడు. ఇంతకు ఏం జరిగింది? ఎందుకు వాయిదా అనేది తెలుసుకుందాం.

Add Zee News as a Preferred Source

Also Read: Mega Hero: ఏకంగా 100 స్క్రిప్టులను రిజెక్ట్ చేసిన మెగా హీరో.. ఎవరంటే..?

శివ భక్తుడు కన్నప్ప జీవితం నేపథ్యంలో తెరకెక్కిస్తున్న చిత్రం 'కన్నప్ప'. మంచు విష్ణు, మోహన్‌ బాబు, కాజల్‌ అగర్వాల్‌ ప్రధాన పాత్రధారులుగా ముకేశ్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కన్నప్ప చిత్రానికి ఆదిలోనే హంసపాదు అన్నట్టు చిత్ర వాయిదా ఆగిపోయింది. ఏప్రిల్‌ 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని షెడ్యూల్‌ విడుదల చేసుకోగా.. తాజాగా ఆ సినిమాను వాయిదా వేస్తున్నట్లు మంచు విష్ణు ప్రకటించాడు. ఈ సినిమాలోని పాటలు.. పోస్టర్లతో హైప్‌ తీసుకువస్తున్న మంచు కుటుంబం తాజాగా వాయిదా వేయడం చర్చనీయాంశంగా మారింది.
 

ఇదీ చదవండి: Madhuri Dixit Love Affair: ప్రముఖ క్రికెటర్ తో మాధురి దీక్షిత్ లవ్ ఎఫైర్.. ఎందుకు బ్రేకప్ అయిందంటే..!

అభిమానులకు క్షమాపణలు చెబుతూ మంచు విష్ణు ఓ కీలక లేఖను విడుదల చేశాడు. అత్యున్నత ప్రమాణాలతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి పంచేలా సినిమా తీసుకురావడానికి తాము ప్రయత్నిస్తున్నట్లు.. అయితే సినిమా తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు లేఖలో విష్ణు తెలిపాడు. కొన్ని కీలకమైన సన్నివేశాలకు వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ పూర్తి చేయడానికి మరింత సమయం పడుతుండడంతో అనివార్య కారణాలతో ఈ వాయిదాను వేసినట్లు మంచు విష్ణు వివరించాడు. మళ్లీ సినిమా విడుదల ఎప్పుడో త్వరలోనే చెబుతామని మంచు విష్ణు చెప్పాడు. ఈ సినిమాలో ప్రభాస్‌, అక్షయ్‌ కుమార్‌, మోహన్‌ లాల్‌, కాజల్‌ అగర్వాల్‌, ప్రీతి ముకుందన్‌ తదితరులు ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే కన్నప్ప టీజర్‌.. కొన్ని పాటలు విడుదల చేయడంతో చిత్రానికి భారీ హైప్‌ వచ్చింది. అయితే మంచు విష్ణు ప్రకటనకు నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. 'నీకు కావాల్సినంత సమయం తీసుకో. పదేళ్లయినా పర్లేదు మేం వెయిట్‌ చేస్తాం' అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సినిమాలో పాత్రధారులపై కీలక చర్చ జరుగుతోంది. అంతేకాకుండా ఈ సినిమాలో లవ్‌ సాంగ్‌ పెట్టడం వివాదాస్పదంగా మారింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News