Salman Khan: హిందీ అగ్ర నటుడు సల్లూ భాయి ఇంటికి మరోసారి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఆయన ప్రయాణించే కారులో బాంబు పెట్టినట్లు ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేయడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.అయితే.. సదురు వ్యక్తి సల్మాన్ కారులో ఈ బాంబు పెట్టినట్టు వాట్సప్ మెసేజ్ పంపాడు. దీనిపై పోలీసులకు సమాచారవివ్వగా ముంబైలోని వర్లీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ బెదిరింపు కాల్ ఎవరు చేసారు.. ? ఎందుకు చేసారనే దానిపై పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇదంత లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కు చెందిన వాళ్ల పనే అయివుంటుందని చెబుతున్నారు. అప్పట్లో 1998 లో హమ్ సాత్ సాత్ హై’ షూటింగ్ సమయంలో కృష్ణ జింకలను వేటాడటంతో ఆయనపై అప్పట్లో పోలీసులు వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసారు. ఆ తర్వాత ఈ కేసులో కోర్టు సల్మాన్ ఖాన్ కు జైలు శిక్ష విధించింది. ఈ కేసులో సల్మాన్ ఖాన్ బెయిల్ పై బయట ఉన్నారు. మన దేశంలో చట్టం డబ్బున్నవాళ్లకు ఓ రకంగా.. డబ్బు లేని మరో రకంగా ఉంటుందనే దానికి సల్మాన్ ఖాన్ ఉదంతాన్ని ఓ ఉదాహరణగా చెబుతుంటారు.
మరోవైపు బిష్ణోయ్ తెగ వాళ్లు సల్మాన్ ఖాన్.. తాను తప్పు చేసినట్టు ఒప్పుకుంటే.. ఒదిలేస్తామని చెబుతున్నారు. కానీ సల్మాన్ ఖాన్ తన అహంకారంతో సారీ చెప్పనంటే చెప్పనంటున్నారు. దీంతో అటవి సంరక్షులకుగా చెప్పుకునే బిష్ణోయ్ తెగ చెందిన వారు సల్మాన్ ఖాన్ పై పగపట్టారు. అంతేకాదు తాము ఎంతగానే ఆరాధించే కృష్ణ జింకను హత మార్చిన అతన్ని కడతేర్చే వరకు విశ్రమించబోమని చెబుతున్నారు. సల్మాన్ ఖాన్ విషయానికొస్తే.. గత కొన్నేళ్లుగా ఈయన నటించిన సినిమాలేవి పెద్దగా ఇరగదీసిందేమి లేవు. రీసెంట్ గా ‘సికందర్’ మూవీ తో పలకరించారు. ఈద్ సందర్బంగా విడుదల చేసారు కాబట్టి ఈ చిత్రానికి ఆ కాసిన్ని డబ్బులు వచ్చాయి. లేకపోతే ఈ సినిమా ఆ కలెక్షన్స్ కూడా వచ్చేవి కావంటున్నారు సినీ విశ్లేషకులు. ఈ సినిమా టోటల్ గా మన దేశంలో రూ. 100 కోట్ల నెట్ వసూల్లతో విడుదలైన వారం రోజుల్లోనే చాప చుట్టేసింది.
READ ALSO: Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..
READ ALSO: Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









