)
Bigg Boss Rithu Chowdary Love Track: బిగ్‌బాస్ సీజన్ 9 తెలుగులో ఇప్పటికే గ్రాండ్ లాంఛ్ అయ్యింది. ఇప్పటికే ఈ లాంఛింగ్ ఎపిసోడ్ కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. దీంతో పాటు తొలిరోజు బిగ్‌బాస్ హౌస్‌లో మంట రాచుకుంది. తొలిరోజే హౌస్ ఓనర్స్, టెనెట్స్ మధ్య మెల్లగా చిచ్చు పెట్టినట్లు అయ్యింది. తాజాగా రెండో రోజు ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇందులో జబర్దస్త్ రీతూ చౌదరి లవ్ ట్రాక్ మొదలెట్టినట్లు తెలుస్తోంది.
ప్రతిసీజన్ లో మాదిరిగానే ఈసారి కూడా బిగ్‌బాస్ షోలో లవ్ ట్రాక్ మొదలైనట్లు కనిపిస్తుంది. సోల్జర్ పవన్ కల్యాణ్, జబర్దస్త్ రీతూ చౌదరి మధ్య ఈ లవ్ ట్రాక్ నడపనున్నట్లు తెలుస్తోంది. అందుకు సాక్ష్యం తాజాగా వదిలిన ప్రోమోనే. తాజాగా రిలీజ్ చేసిన రెండో రోజు ప్రోమోలో జబర్దస్త్ రీతూ చౌదరి, పవన్ కల్యాణ్ పడాల మధ్య లవ్ ట్రాక్ సిద్దం చేశారని తెలుస్తోంది. ఇప్పుడా ప్రోమో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.
గత కొన్ని సీజన్లతో పాలిస్తే.. బిగ్‌బాస్ హౌస్ లో పోటీదారుల మధ్య కొన్ని వారాలు గడిచిన తర్వాత లవ్ ట్రాక్ అంటూ బలవంతంగా చొప్పించే వారు. కానీ, బిగ్‌బాస్ సీజన్ 9లో మాత్రం ఇది ముందుగానే స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు హౌస్ ఓనర్స్ మధ్య రోజురోజుకు హీట్ పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హరీష్, జబర్దస్త్ ఇమాన్యుయల్ మధ్య వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే.
తాజాగా రెండో రోజుకు సంబంధించిన ప్రోమోలో కూడా హోస్ ఓనర్స్, టెనెట్స్ మధ్య ఏదో విషయం గురించి చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ వారు ఎందుకు వాగ్వివాదం చేసుకుంటున్నారు. హరీష్ మరోసారి తనూజతో ఏదో మంట పెట్టుకున్నట్లు వీడియో చూస్తే తెలుస్తోంది. అయితే వారిద్దరి మధ్య ఆ గొడవకు కారణం ఏంటి? పవన్ కల్యాణ్, రీతూ చౌదరి మధ్య లవ్ ట్రాక్ ఎక్కడి వరకు వచ్చిందో తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్ చూడాల్సిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook