Bigg Boss 9 Telugu: పోటీదారులకు బిగ్‌బాస్ ఊహించని షాక్..అర్ధరాత్రి మిడ్-వీక్ ఎలిమినేషన్..టాప్-5 లిస్టు ఇదే!

Bigg Boss 9 Mid Week Elimination: తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 9 ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. తెలుగు బిగ్‌బాస్ చరిత్రలో ఈ సీజన్‌ వీకెస్ట్ రేటింగ్ అంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఇప్పుడు నిర్వాహకులు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. రేపు అనగా డిసెంబరు 11న మిడ్ వీక్ ఎలిమినేషన్ జరగనుందని సమాచారం.

Written by - Harish Darla | Last Updated : Dec 10, 2025, 04:21 PM IST
Bigg Boss 9 Telugu: పోటీదారులకు బిగ్‌బాస్ ఊహించని షాక్..అర్ధరాత్రి మిడ్-వీక్ ఎలిమినేషన్..టాప్-5 లిస్టు ఇదే!

Bigg Boss 9 Mid Week Elimination: తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 9 ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. తెలుగు బిగ్‌బాస్ చరిత్రలో ఈ సీజన్‌ వీకెస్ట్ రేటింగ్ అంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఇప్పుడు నిర్వాహకులు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. రేపు అనగా డిసెంబరు 11న మిడ్ వీక్ ఎలిమినేషన్ జరగనుందని సమాచారం. అయితే ఈ వారం ఎవరు వెళ్తారనే దానిపై రకరకాలైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

Add Zee News as a Preferred Source

సెప్టెంబరులో ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఈరోజుకు నిర్విరామంగా కొనసాగుతుంది. ఇన్ని రోజులు టాస్క్‌లు ఉత్సాహాంగా సాగుతున్న సమయంలో పోటీ దారులకు ఇప్పుడు బిగ్‌బాస్ పెద్ద షాక్ ఇవ్వనున్నాడు. వచ్చే వారం డిసెంబరు 16 - 22 ఫినాలే వీక్ కానుంది.  ఈ క్రమంలో ఇప్పుడు బిగ్‌బాస్ హౌస్‌లో ఏడుగురు ఉన్న కారణంగా ఫైనల్ వీక్ కోసం 5 మందే ఉంటారు. దీంతో ఈ వారం ఇద్దర్ని ఇంటి నుంచి పంపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆదివారం వరకు వేచి చూడకుండా ఇప్పుడు మిడ్ వీక్ ఎలిమినేషన్ కోసం బిగ్‌బాస్ నిర్వాహకులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 

ఇప్పటికీ వచ్చిన ఓటింగ్ ప్రకారం ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యేది ఎవరనే విషయం ఇప్పుడు స్పష్టంగా బిగ్‌బాస్ నిర్వాహకులకు తెలిసిపోయింది. దీంతో చివరిగా తక్కువ ఓట్లు ఉన్న వారిని ఈ వారం ఇంటి నుంచి పంపించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. టాప్-5లో కల్యాణ్, ఇమ్మాన్యుయేల్, తనూజ, భరణి, సుమన్ శెట్టి ఉంటారట. ఈ వారం డిమోన్ పవన్, సంజన ఎలిమినేట్ కానున్నారని సమాచారం. కానీ, సోషల్ మీడియాలో మాత్రం సుమన్ శెట్టి, ఇమ్మాన్యుయేల్ తక్కువ ఓటింగ్ కారణంగా ఎలిమినేట్ అవుతారని అంటున్నారు.  

ప్రస్తుత బిగ్‌బాస్ సీజన్ కోసం ఇప్పటికే తొలి ఫైనలిస్టుగా పవన్ కల్యాణ్ నిలవగా.. అతనే విజేతగా నిలుస్తాడని అతని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. మరో వైపు ఇమ్మాన్యుయేల్, తనూజ కూడా విజేతలు అయ్యే అవకాశం స్పష్టంగా ఉందని కొందరు చెబుతున్నారు. ఏది ఏమైనా మిడ్ వీక్ ఎలిమినేషన్‌తో కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 

సాధారణంగా బిగ్‌బాస్ హౌస్‌లో మిడ్ వీక్ ఎలిమినేషన్స్ అన్నీ అర్ధరాత్రి జరుగుతాయి. పోటీదారులు గాఢనిద్రలో ఉన్న సమయంలో బిగ్‌బాస్ ఈ పిడుగులాంటి వార్తను బయటపెట్టే అవకాశం ఉంది. అయితే ఈ పరిస్థితుల్లో మిడ్-వీక్ ఎలిమినేషన్‌‌లో భాగంగా ఇంటి నుంచి బయటకి వెళ్లేది ఎవరో మరికొద్ది గంటల్లో తెలుస్తోంది.

Also Read: Hardik Pandya Girlfriend: హార్దిక్ పాండ్యా కాబోయే భార్య ఈమెనే..టీ20 మ్యాచ్ తర్వాత ఇలా..పబ్లిక్‌గా బయటపడ్డారు!

Also Read: Risky Childbirth: రూపాయి బ్లేడ్‌తో ప్రసవం చేసిన మహిళ..బాణాలు, వెదురు కర్రలతో బిడ్డకు కాన్పు..దారుణమైన సంఘటన వెలుగులోకి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

About the Author

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్ డిజిటల్ మీడియాలో జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు.  గత 7 ఏళ్ల అనుభవంతో ఇక్కడ 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

...Read More

Trending News