)
Bigg Boss 9 Nominations Telugu: బిగ్‌బాస్ సీజన్ 9 తెలుగు రియాలిటీ షోలో హౌస్ అంతా ఒక్కసారిగా హీటెక్కింది. తొలి వారం కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ ఎలిమినేషన్ పూర్తవ్వగానే.. రెండో వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. ఈ ప్రక్రియలో భాగంగా ఇంటి సభ్యులలోని ఇద్దర్ని నామినేషన్ చేసే అవకాశం బిగ్‌బాస్ కల్పించారు. ప్రతి ఇంటి సభ్యుడు బిగ్‌బాస్ ఇంట్లో ఉండటానికి అర్హత లేని ఇద్దరి పేర్లను నామినేషన్లో చెప్పాల్సి ఉంటుంది. అయితే సంజన ఈ వారం కెప్టెన్ కావడం వల్ల ఆమెను నామినేషన్స్ నుంచి బిగ్‌బాస్ తప్పించారు. నామినేట్ చేసే సభ్యులు ఇద్దరి పేర్లను తగు కారణాలతో చెప్పి.. వారి ముఖంపై ఎర్రరంగు పూయాల్సి ఉంటుంది.
రెండో వారం నామినేషన్ ప్రక్రియను తనూజ ప్రారంభించారు. తొలుత హరిత హరీష్‌ను ఆమె నామినేట్ చేస్తూ.. గతవారం అతని ప్రవర్తన నచ్చని కారణంగా హరీష్‌ను నామినేట్ చేస్తున్నట్లు చెప్పింది. పనులు చెప్పే విషయంలో తనతో ఆయన ప్రవర్తించిన తీరు బాగోలేదని తనూజ ఆరోపించారు. అందుకే ఆయన్ని నామినేట్ చేస్తున్నట్లు ఆమె చెప్పుకొచ్చారు. కానీ, ఈ నామినేషన్ ను హరీష్ తీవ్రంగా డిఫెండ్ చేసుకున్నారు. తన నుంచి వచ్చే పరిస్థితులను ఆయన వివరించారు. వారిద్దరు ఎవరి కారణాలు వారు చెప్పుకొని నామినేషన్ ముగించారు.
తనూజ తన రెండో నామినేషన్‌గా ఫ్లోరా షైనీ (లక్స్ పాప)ని నామినేట్ చేసింది. ఆమె చేసిన షాంపూ కండీషనర్ పనితో పాటు తాను కొన్ని చేసే పనులు కావాలని చేస్తున్నట్లు ఆమె ఆరోపించింది. ఇలాంటి కారణం చేత ఫ్లోరాను తనూజ నామినేట్ చేసింది. అయితే వీరిద్దరి మధ్య పెద్దగా వాగ్వాదం జరగలేదు.
నామినేట్ చేసేందుకు రెండో వ్యక్తిగా మర్యాద మనీష్ వచ్చారు. ఆయన తొలి నామినేషన్ గా పర్మనెంట్ హౌస్ మేట్ భరణిని ఎంచుకున్నారు. మొదటి వారంలో గుడ్డు విషయంలో జరిగిన వివాదాన్ని ఆయన టీ అని చెప్పి మాయ చేసే ప్రయత్నం చేశాడని మనీష్ ఆరోపించారు. కొందర్ని కావాలని మాన్యుపులేట్ చేస్తున్నట్లు అనిపించినట్లు మనీష్ చెప్పుకొచ్చారు. అయితే దీని స్పందించిన ధరణి.. కొన్నిసార్లు ఏమి మాట్లాడలేని సమయంలో వాదించడం అనవసరం. అందుకే ఏమి మాట్లాడకుండా తప్పుకుంటా అని భరణి అన్నారు. ఏది ఏమైనా నాకు రైట్ అనిపించినట్లు నేను చేశానని ధరణి చెప్పుకొచ్చారు.
మర్యాద మనీష్ తన రెండో నామినేషన్ గా రీతూ చౌదరి పేరును ప్రస్తావించారు. అయితే వీరిద్దరి మధ్య హీట్ ఆఫ్ ది డిస్కషన్ జరిగింది. మనీష్ చెప్పిన కారణాలు ఆమె తిరస్కరించింది. అందుకు తోడుగా డిమోన్ పవన్ తో సాక్ష్యం చెప్పమని చెప్పింది. డిమోన్ పవన్ కూడా ఆమెకు అనుగుణంగా మాట్లాడినట్లు అనిపిస్తుంది. అయితే ఈ నామినేషన్ కంటే ముందు రీతూ చౌదరి, డిమోన్ పవన్ కలిసి వ్యవహరించిన తీరు కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే నామినేషన్ సమయంలో రీతూ చౌదరి డిఫెండ్ చేసుకోవాల్సిన తరుణంలో డిమోన్ పవన్ చాలాసార్లు కల్పించుకొని మాట్లాడారు. అయితే వీరిద్దర్ని మనీష్ తదేకంగా చూస్తూ అలానే ఉండిపోయాడు. ఈ నామినేషన్ ను రీతూ చౌదరి ఒప్పకోని కారణంగా.. బిగ్‌బాస్ స్పందింస్తూ.. నామినేషన్ అంగీకరించాల్సిందేనని చెప్పాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook