Case On Bigg Boss 9 Telugu: బుల్లితెరపై ప్రస్తుతం బిగ్‌బాస్ సందడి నెలకొంది. సెప్టెంబరు రెండో వారం నుంచి మొదలైన ఈ షోలో తాజాగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ జరిగాయి. దివ్వెల మాధురి, శ్రీనివాస్ సాయి, ఆయేషా జీనత్, రమ్య మోక్ష, గౌరవ్ గుప్తా, నిఖిల్ నాయర్ లు బిగ్‌బాస్ హోస్‌లోకి చేరాడు. అయితే వీరంతా శ్రుతిమించి ప్రవర్తిస్తున్నారని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దివ్వెల మాధురి, ఆయేషా జీనత్ మరింతగా రెచ్చిపోతున్నారని కొందరు పోలీసులను ఆశ్రయించారు.
గతవారం బిగ్‌బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు పోటీదారులు ఎంటర్ అయిన తర్వాత ఆట మరింత రసవత్తరంగా తయారయ్యిందని అంతా అనుకుంటున్నారు. అయితే తాజాగా ఈ రియాలిటీ షో పై పోలీసు కేసు నమోదయ్యింది. మా టీవీలో ప్రసారం అవుతున్న బిగ్‌బాస్ షో పై హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కొందరు కేసు పెట్టారు. తెలంగాణలోని గజ్వేల్ కు చెందిన రవీందర్ రెడ్డి, కమ్మరి శ్రీనివాస్, సుకుమార్ రెడ్డి, శ్రీనివాస్, చంద్రశేఖర్ ఈ బిగ్‌బాస్ షో పై పోలీసులను ఆశ్రయించి కేసు పెట్టారు. సమాజాన్ని తప్పుదోవ పట్టించే స్థితికి ఈ బిగ్‌బాస్ షో దిగజారిందని వారు ఆరోపించారు.
బిగ్‌బాస్ రియాలిటీ షో పై గజ్వేల్‌కు చెందిన యువకులు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు చేరారు. సదరు కార్యక్రమంపై కేసు పెట్టి తగిన చర్యలు తీసుకోవాలని వారు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. వారి ఇచ్చిన ఫిర్యాదులో బిగ్‌బాస్ షో మేనేజ్‌మెంట్ ప్రేక్షకులను తప్పుదోవ పట్టిస్తున్నారని వారు అన్నారు. అయితే ఆ షో లో పాల్గొన్న కొందరు కుటుంబ విలువలు పాటించని వాళ్లను హౌస్‌లోకి తీసుకొచ్చారని బిగ్‌బాస్ యాజమాన్యంపై ఫిర్యాదు చేశారు. ఇలాంటి వాళ్లను ఆ రియాలిటీషో లో ఉంచడం వల్ల సమాజం సిగ్గు పడే విధంగా నిర్వాహకులు చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కారణంగా బిగ్‌బాస్ షో ను వెంటనే నిలిపేయాలని వారు డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రభుత్వం తక్షణమే బిగ్‌బాస్ రియాలిటీ షో ను నిలిపేయాలని.. కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేదంటే ప్రజా, మహిళా సంఘాలతో కలిసి బిగ్‌బాస్ హోస్ ను ముట్టడిస్తామని వారు వార్నింగ్ ఇచ్చారు. కర్ణాటకలో షో ను నిలిపేసిన విధంగా ఇక్కడ కూడా ఈ బిగ్‌బాస్ షో ను బ్యాన్ చేయాలని వారు పోలీసులను కోరుతున్నారు. హీరో అక్కినేని నాగార్జున కూడా ఈ రియాలిటీ షోను వదిలేసి సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని వారు సూచించారు. ఈ బిగ్‌బాస్ హోస్‌లోకి దివ్వెల మాధురి, రీతూ చౌదరి లాంటి వాళ్లను పంపి సమాజానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారని గజ్వేల్‌కు చెందిన బృందం ఆగ్రహం వ్యక్తం చేశారు.
ALso Read: Snake Catcher: పింక్ శారీ కట్టి పాములతో ఆటాడిన పోరీ..ఆమె అందం చూసి పాములే షాక్ అయ్యాయి!
Also Read: Upendra Dwivedi: ప్రపంచపటం నుంచి పాకిస్థాన్‌ను లేపేస్తాం..ఇండియన్ ఆర్మీ చీఫ్ వార్నింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









