)
Sumathi Satakam Movie: సీరియల్స్‌తో బుల్లితెరపై తనకంటూ క్రేజ్ సొంతం చేసుకున్న అమర్దీప్ చౌదరి.. బిగ్‌బాస్ షో ద్వారా మరింత పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఇప్పుడు హీరోగా వరుస ప్రాజెక్ట్‌లను పట్టాలెక్కిస్తున్నాడు. హీరోగా ఇప్పటికే రెండు సినిమాలు చేస్తుండగా.. ఇటీవల మరో సినిమా 'సుమతీ శతకం'ను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ ఓపెనింగ్ కార్యక్రమం అమరావతిలో గ్రాండ్‌గా జరిగింది. మందిర మూవీతో విజయాన్ని అందుకున్న విజన్ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ద్వారా ఎం.ఎం.నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సైలీ చౌదరి హీరోయిన్గా యాక్ట్ చేస్తోంది.
యూత్‌ఫుల్, ఎంగేజింగ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అమరావతిలోని వైకుంటపురం విలేజ్ టెంపుల్లో గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ముహూర్తం షాట్‌కు పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ క్లాప్ కొట్టారు.
వెన్నా సాంబశివారెడ్డి కెమెరా స్విచాన్ చేయగా.. కథను బండారు నాయుడు అందించారు. ఈ సినిమాకు సుభాష్ ఆనంద్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్‌గా హాల్‌స్వామి, ఎడిటర్‌గా సురేష్ విన్నకోట వ్యవహరిస్తున్నారు.
టెక్నికల్ టీమ్:
==> బ్యానర్: విజన్ మూవీ మేకర్స్
==> ప్రొడ్యూసర్: కొమ్మాలపాటి సాయి సుధాకర్
==> డైరెక్టర్: M.M. నాయుడు
==> మ్యూజిక్: సుభాష్ ఆనంద్
==> DOP: హాల్‌స్వామి ఎస్
==> ఎడిటర్: సురేష్ విన్నకోట
==> రచయిత: బండారు నాయుడు
==> PRO: సాయి సతీష్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe