Bigg Boss Telugu 4: బిగ్‌బాస్ భామ Divi Vadthya క్యాబ్ స్టోరీస్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Cab Stories Release Date Latest News : కోవిడ్19 కారణంగా ప్రస్తుతం అంతా ఓటీటీ మీద ఫోకస్ చేస్తున్నారు. ఏ ఇబ్బంది లేకుండా, కరోనా బారిన పడకూడదంటే ఓటీటీనే ప్రేక్షకులకు ప్రత్యామ్నాయమని నిరూపించుకుంటుంది. కొందరు అగ్ర దర్శకులు, నిర్మాతలు మాత్రం థియేటర్లలో సినిమాలు విడుదల చేస్తేనే లాభాలు వస్తాయని భావిస్తున్నారు.

Written by - Shankar Dukanam | Last Updated : May 18, 2021, 12:14 PM IST
Bigg Boss Telugu 4: బిగ్‌బాస్ భామ Divi Vadthya క్యాబ్ స్టోరీస్ రిలీజ్ డేట్ వచ్చేసింది

కరోనా వైరస్ ఒక్క రంగంపై కాదు దాదాపు అన్ని రంగాల వారిని కష్టాలుపాలు చేసింది. సినిమా ఇండస్ట్రీ రంగుల ప్రపంచం సైతం కరోనా మహమ్మారి దెబ్బకు విలవిల్లాడిపోయింది. కరోనాతో ఏకంగా టాలీవుడ్ ముఖచిత్రమే మారిపోయింది. కోవిడ్19 కారణంగా ప్రస్తుతం అంతా ఓటీటీ మీద ఫోకస్ చేస్తున్నారు. ఏ ఇబ్బంది లేకుండా, కరోనా బారిన పడకూడదంటే ఓటీటీనే ప్రేక్షకులకు ప్రత్యామ్నాయమని నిరూపించుకుంటుంది.

బిగ్‌బాస్ తెలుగు 4 ఫేమ్ దివి ప్రధాన పాత్రలో తెరకెక్కిన వెబ్ సిరీస్ క్యాబ్ స్టోరీస్. బిగ్‌బాస్‌ బ్యూటీ, నటి దివి(Divi Vadhya), శ్రీహాన్‌ నటించిన వెబ్‌ సిరీస్‌ సైతం ఓటీటీ వేదికగా విడుదలకు సిద్ధంగా ఉంది. మే 20వ తేదీన స్పార్క్‌ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో క్యాబ్‌ స్టోరీస్‌ ప్రసారం కానుంది. ఈ విషయాన్ని టాలీవుడ్ ప్రముఖ పీఆర్వో బీఏ రాజు తెలిపారు. ఈ మేరకు క్యాబ్ స్టోరీస్ తొలి భాగం విడుదల తేదీ, ఓటీటీ వేదిక గురించి ట్వీట్ చేశారు.

Also Read: Ariana Grande Wedding: లవ్ మ్యారేజ్ చేసుకున్న పాప్ స్టార్ అరియానా గ్రాండే, హాలీవుడ్‌లో ట్రెండింగ్

కరోనా ఫస్ట్ వేవ్‌లో సినిమాలకు ప్రత్యామ్నాయంగా ఓటీటీ తెరమీకదకు వచ్చింది. ప్రస్తుతం కోవిడ్19 సెకండ్ వేవ్‌ దెబ్బకు థియేటర్లకు, మల్టీప్లెక్సులు తాత్కాలికంగా మూసివేశారు. దాంతో సినీ ప్రేక్షకులకు ఓటీటీ వినోదాన్ని అందిస్తుంది. పారిశ్రామికవేత్త సాగర్ మాచనూరు స్పార్క్ ఓటీటీ (Spark OTT)ని మే 14 అర్థరాత్రి లాంచ్ చేశారు. కొందరు అగ్ర దర్శకులు, టాలీవుడ్ (Tollywood) నిర్మాతలు మాత్రం థియేటర్లలో సినిమాలు విడుదల చేస్తేనే లాభాలు వస్తాయని భావిస్తున్నారు.

Also Read: Bigg Boss Telugu 4: దివి ఎలిమినేషన్.. ప్లాన్ ప్రకారం జరిగిందా? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

More Stories

Trending News