)
Bigg Boss 9 Contestants Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రియాలిటీ షో ఈరోజు (సెప్టెంబరు 7) ప్రారంభం కానుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో బిగ్‌బాస్ ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే ప్రోమో అలరిస్తూ ఉండగా.. ఈసారి పోటీదారులు ఎవరనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ ఆదిరెడ్డి ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఈ సారి బిగ్‌బాస్‌లో పాల్గొనే పోటీదారులు వీళ్లే అంటూ చెప్పుకొచ్చాడు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ లాంఛ్ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యి.. తొలి ఎపిసోడ్ షూటింగ్ కూడా పూర్తయ్యింది. గ్రాండ్ లాంఛింగ్ షూటింగ్ ఇప్పటికే పూర్తవగా.. ఇందులో ఎవరెవరూ.. బిగ్‌బాస్ హోస్‌లోకి వెళ్లారు అనే దానిపై ఆసక్తి నెలకొంది. ఓపెనింగ్ ఎపిసోడ్లో హీరోయిన్ అనుష్క నటించిన 'ఘాటీ' చిత్రబృందం పాల్గొననుందని సమాచారం. హీరోయిన్ అనుష్క కూడా సందడి చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ సినిమా ఇటీవలే థియేటర్లలో విడుదల అయ్యింది.
ఈ క్రమంలో హౌస్‌లో అడుగుపెట్టే పోటీదారులు ఎవరో అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. వీరిపై సోషల్ మీడియాలో చాలా పేర్లు వినిపిస్తున్నాయి. బిగ్‌బాస్ గ్రాండ్ లాంఛింగ్‌కు ముందే ఈ షోలో పాల్గొనేది ఎవరు అనే దానిపై బిగ్‌బాస్ మాజీ పోటీదారు ఆదిరెడ్డి పోటీదారుల లిస్టు పేర్లు లీక్ చేశాడు. గతంలో కూడా అతను చెప్పినట్లే జరగడం వల్ల అతడిపై సోషల్ మీడియాలో నెటిజన్లు నమ్ముతున్నారు. అతని అంచనాలే గతంలోనూ నిజం కావడం గమనార్హం.
ఆదిరెడ్డి విడుదల చేసిన వీడియో ప్రకారం.. ఈసారి బిగ్‌బాస్‌లో జబర్దస్త్ ఇమ్మాన్యూయెల్, జబర్దస్త్ రీతూ చౌదరి, 'రాను బొంబాయి రాను' ఫేమ్ రాము రాథోడ్, లక్స్ పాప ఆషా షైనీ, సీరియల్ నటి తనూజా గౌడ, సీరియల్ నటుడు భరణి శంకర్, కొరియో గ్రాఫర్ శ్రష్టి వర్మ, నటుడు సుమన్ శెట్టి, సంజనా గల్రానీ వంటి సెలబ్రిటీలు హౌస్ లోకి అడుగుపెడతారని తెలుస్తోంది.
సెలబ్రిటీలతో పాటు ఈసారి కామన్ మ్యాన్ ఎంట్రీలో ఐదు లేదా ఆరుగురు పోటీదారులు రావొచ్చని ఆదిరెడ్డి అభిప్రాయపడ్డారు. వారిలో మాస్క్ మ్యాన్ హరీష్, శ్రీజ, మర్యాద మనీష్, ఆర్మీ పవన్ కల్యాణ్, ప్రియా, పవన్ బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే వీరిలో ఎంతమంది బిగ్‌బాస్ హోస్లో కనిపిస్తారో తెలియాల్సి ఉంది. అది తెలియాంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook