Bigg Boss 9 : వామ్మో బిగ్ బాస్.. ఛీ అంటూనే.. ఏంటీ దరిద్రం..

Bigg Boss 9 Telugu:  బిగ్ బాస్...ఆడేదెవరు..ఆడించేదెవరు...కొందరికి వినోదం...ఇంకొందరికి ఆనందం...మరికొందరికి రోత... పేరు ఏదైన..ఆదరణ మాత్రం అపుడపుడు దక్కుతూనే ఉంది. గత తొమ్మిది సీజన్లుగా జనాన్ని....ఎంటర్ టైన్ చేస్తూ.. ఎన్నో వివాదల మధ్య వీకెండ్ లో  ఓ మోస్తరు రేటింగ్ లో దూసుకెళ్తోంది. చీ ఇదేం షో అంటూనే...దాన్నే చూస్తున్నారు. 

Written by - TA Kiran Kumar | Last Updated : Dec 8, 2025, 08:05 AM IST
Bigg Boss 9 : వామ్మో బిగ్ బాస్.. ఛీ అంటూనే.. ఏంటీ  దరిద్రం..

జీవితం వేరు… ఆట వేరు...ఇలా ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. మనలోనూ.. మన పరిసరాల్లోనూ విచిత్ర మనస్తత్వం కలిగిన వారు ఎంతో మంది ఉంటారు. వాస్తవాలను గుర్తించాలని వినోదంతో విజ్ఞానాన్ని పెంపొందించాలనే ప్రయత్నంలో పుట్టుకొచ్చిన రియాల్టీ షో.. బిగ్ బాస్… వినోదాన్ని పంచి.. టీవీలకు అతుక్కుపోయే విధంగా ప్రేక్షకులను అట్రాక్ట్ చేయడానికి చేయని ఎత్తులు ఉండవు.  ఎత్తుగడ. బిగ్ బాస్ రియాల్టీషో ఇప్పటిదాకా 8 సీజన్లను పూర్తి చేసుకుంది. ఇపుడు 9 సీజన్ నడుస్తోంది. ఒకప్పట్లో సెలబ్రిటీలతోనే సందడి సందడిగా కనిపించిన ఈ రియాల్టీ షో.. సీజన్లు మారేకొద్ధీ..... ట్రెండ్‌కు తగ్గట్టుగా మారుతోంది.  సోషల్ మీడియాలో పాపులారిటీ తెచ్చుకున్నవారికి ఇందులో పెద్దపీట వేస్తోంది. తెరపై చూపించి రూరల్ ఆడియన్స్‌కు బిగ్ బాస్ షో దగ్గర అయ్యే విధంగా చేసిన ప్రయత్నం ఓ మోస్తరు ఫలితాన్నే ఇస్తుందనే చెప్పాలి.  దీంతో తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ రియాల్టీషోపై గ్రామీణ ప్రాంతాలు.. పట్టణ ప్రాంత ఆడియన్స్‌లో  గతంలో మాదిరి కాకుండా ఓ మోస్తరుగా ఆసక్తిరేకిస్తోంది.  సీజన్లు మారేకొద్దీ రోత పుట్టిస్తుందన్న అభిప్రాయం కూడా పెరిగింది. 

Add Zee News as a Preferred Source

బిగ్ బాస్ కంటెస్టెంట్లుగా సినిమాలు, టీవీలు, సోషల్ మీడియాలో పాపులారిటీ తెప్పించుకున్న వారిని పోటీదారులుగా ఎంచుకుని హౌస్ లోకి ఎంట్రీ కల్పించారు. సీజన్ ప్రారంభంలో ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్లతోపాటు, మధ్యమధ్యలో క్యూరియాసిటీని క్రియేట్ చేసేందుకు, వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో కొత్తవారిని హౌస్ లోకి దింపి రక్తికట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. బిగ్ బాస్ షో ద్వారా చూసేవారికి వినోదం పంచుతున్నారా?... వివాహేతర సంబంధాల మంచివే అన్న అభిప్రాయాన్ని క్రియేట్ చేస్తున్నారా అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  బిగ్ బాస్ పరిచయంతో కంటెస్టెంట్లు హౌస్‌లో స్వేచ్ఛ దొరికిందని హగ్గులు.. ఆపై శృతిమించిని శృంగారం.. ముద్దులు ముచ్చట్లు చిరాకు తెప్పిస్తున్నాయని ఆడియన్స్ విసిగివేసారి పోయారు. నానాటికీ బూతుసన్నివేశాలతో రోతపుట్టిస్తోందనే భావన వీక్షకుల్లో వ్యక్తమవుతోంది.

బిగ్ బాస్ హౌస్‌లో వారం వారం జరిగే ఎలిమినేట్ ప్రాసెస్‌లో హౌస్ మేట్లలో ఎవరు తమకు అనుకూలంగా ఉంటారు. ఎవరు వెన్నపోటు దారులనే అవతలి వాళ్లకు తెలిసిపోతుంది. అక్కినేని నాగార్జున ఎంత గొప్పగా హోస్ట్ చేసినా.. బిగ్ బాస్ వాళ్లు ఎంత హంగామా చేసినా.. గొప్ప గొప్ప టాస్క్‌లు పెట్టినా... స్మాల్ స్క్రీన్  వీక్షకుల్ని మెప్పించలేకపోతున్నారు.   

Read more:  Chiranjeevi: పాయే.. మరోసారి చిరంజీవి పరువు పాయే..

Read more:  నాగార్జున ‘శివ’ 4K రీ రిలీజ్ టోటల్ కలెక్షన్స్.. సీనియర్ హీరోల్లో నాగార్జున సరికొత్త రికార్డు.. 

బిగ్‌బాస్ హౌస్‌లో వీకెండ్ వచ్చిందంటే చాలు మిగతా రోజుల కంటే ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్కువ దొరుకుతుంది. ఎందుకంటే హోస్ట్ నాగార్జున ఒక్కొక్కరిని పేరుపెట్టి పలుకరించడం...ఆ వారంలో ఎవరెవరు ఎలాంటి తప్పులు చేశారనే విషయాన్ని వివరిస్తున్నారు.  గొడవలపై ఆయా కంటెస్టెంట్స్‌కి తనదైన స్టైల్లో వార్నింగ్ ఇవ్వటం మాత్రమే బాగుంది.  తాజాగా బిగ్ బాస్ లోని సన్ని వేశాలు...టీన్ ఏజ్ పై ప్రభావం చూపిస్తున్నాయి. 

ఇక అప్పట్లో  సోషల్ మీడియా స్టార్ దివ్వెల మాధురికి నాగార్జున గట్టిగానే క్లాస్ పీకడం ఆశ్యర్యమనిపించింది. అసలు ఆమెను ఎందుకు తీసుకున్నారో ఎందుకు ఎలిమినేషన్ చేసారో తెలియడం లేదు. సామాజిక మాధ్యమాల్లో  వివాదాలతో ఆందరిని అట్రాక్ట్ చేసిన  మాధురితో పాటు పచ్చళ్ల పాప...బిగ్ బాస్ హౌజ్ లో మాత్రం  తేలిపోయారు. మొత్తంమీద బిగ్‌బాస్ రియాల్టీషో మరీ విసుగు తెప్పిస్తోందని వీక్షకులు పెదవి విరుస్తున్నారు. సినిమా రంగం, టీవీరంగాల్లో వినోద కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు ఏవైనా సరే సమాజంపై తీవ్రంగా ప్రభావితం చేస్తాయి.అందులో అనుమానమేలేదని ఎన్నో సందర్భాలు సంకేతంగా నిలిచాయి. మరో వారం పది రోజుల్లో ఈ షోకు ఎండ్ కార్డ్ పడనుంది.  సమాజాన్ని ప్రభావితం చేసేమాధ్యమాల్లో మంచిని పెంచి మనుషుల్ని మార్చే కంటే.. టీవీషోల ద్వారా కక్షలు కార్పణ్యాలు, ఈర్ష్యద్వేషాలు, తి గొడవలు, పనికిమాలిన ప్రేమలు, రొమాన్స్‌ సన్నివేశాలతో సమాజానికి ఎలాంటి సందేశాన్నిస్తారనే ప్రశ్నలకు సమాధానమిచ్చేదెవరని వీక్షకులు ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తున్నారు.

Read more:​  సమంత బాటలో దర్శకులను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..

Read more:​ సమంత కంటే ముందు రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..! పూర్తి లిస్ట్ ఇదే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News