)
Bigg Boss Celebrities vs commoners: బుల్లితెరపై ప్రేక్షకులను ఆకట్టుకునే బిగ్‌బాస్ తెలుగులో సరికొత్త సీజన్ ప్రారంభమైంది. 9వ సీజన్ ఆదివారం ప్రారంభమవగా.. ఈసారి కొత్త కొత్త ఆటలు.. ట్విస్ట్‌లతో బిగ్‌బాస్ కొత్త సీజన్ మొదలైపోయింది. ఇప్పటివరకు 8 సీజన్లు విజయవంతం కాగా 9వ సీజన్ ఎంతో ఉత్సాహంగా షురూవైంది. తొలిసారి సామాన్యులకు అవకాశం ఇచ్చిన బిగ్‌బాస్ వారిని అగ్నిపరీక్ష పేరుతో పోటీలు పెట్టి అందులో విజేతలుగా నిలిచిన వారిని హౌస్‌లోకి పంపించారు. మరోసారి అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తుండగా.. కంటెస్టెంట్లు ఎవరో తెలుసుకుందాం.
బిగ్‌బాస్ 9వ సీజన్లోకి మొత్తం 15 మంది కంటెస్టెంట్లుగా అడుగుపెట్టారు. ఇమ్మాన్యుయేల్, రీతూ చౌదరి, తనూజ, సుమన్ శెట్టి, రాము రాథోడ్ సెలబ్రిటీస్‌గా ఎంట్రీ ఇవ్వగా.. సామాన్యుల కేటగిరిలో అగ్నిపరీక్ష పోటీలో గెలిచిన 13 మందిలో ఆరుగురు హౌస్మెట్లుగా ఎంపికయ్యారు. వారిలో పవన్ కల్యాణ్ పడాల, హరీశ్, డీమాన్ పవన్, మర్యాద మనీష్, శ్రీజ దమ్ము, ప్రియ ఉన్నారు. అగ్నిపరీక్ష పోటీలో జ్యూరీ మెంబర్ నవదీప్ శ్రీజ దమ్మును ఎంపికచేవాడు. ప్రేక్షకుల ఓటింగ్ ఆధారంగా ముందంజలో నిలిచిన ప్రియ బిగ్‌బాస్ హౌసులోకి అడుగుపెట్టింది. అగ్నిపరీక్షలో పోటీ పడిన మర్యాద మనీశ్‌ను యాంకర్ శ్రీముఖి ఎంపిక చేశారు. అగ్నిపరీక్షలో గెలిచి వచ్చిన వాళ్లందరూ లోపల ఉంటారని, సెలబ్రిటీలు ఔట్ హౌసులో ఉంటారని హోస్ట్ నాగార్జున చెప్పారు.
సుమన్ శెట్టి
ఎన్నో పాత్రలు చేసి నవ్వించిన హాస్య నటుడు సుమన్ శెట్టి బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టారు. చిన్నప్పటి నుంచి యాక్టింగ్ చేయాలని పిచ్చి ఉన్న సుమన్ శెట్టి ఓ మ్యాగజైన్లో చూసి సినిమా అవకాశం కోసం హైదరాబాద్ వచ్చి ఇబ్బందులు పడ్డాడు. దర్శకుడు తేజ తీసిన 'జయం' సినిమాతో తొలిసారిగా నటుడిగా పరిచయమయ్యాడు. స్టేజీపై తన భార్య, కొడుకు, కూతురిని పరిచయం చేశాడు. తనకు తొలి అవకాశం తేజ ఇస్తే.. ఇప్పుడు రెండో ఇన్నింగ్స్ ఛాన్స్ బిగ్‌బాస్‌తో వచ్చిందని సుమన్ శెట్టి చెప్పాడు.
రాము రాథోడ్
మహబూబ్‌నగర్ ప్రాంతానికి చెందిన రాము రాథోడ్ 'రాను బొంబాయికి రాను' పాటతో విశేష గుర్తింపు పొందాడు. ఆ పాటలో నర్తించి, పాడిన రాము రాథోడ్ బిగ్‌బాస్ హౌసులోకి అడుగుపెట్టాడు. చిన్నప్పటి నుంచి పాడుతూ డ్యాన్స్ చేసే తాను తానే ఒక పాట పాడి ఎందుకు డ్యాన్స్ చేయకూడనని భావించి ముందుడుగు వేసినట్లు రాము తెలిపాడు. కరోనా లాక్డౌన్లో పాటలతో కెరీర్ ప్రారంభించానని.. ప్రత్యేకించి ఎలాంటి సంగీత శిక్షణ తీసుకోలేదని చెప్పాడు. రాను బొంబాయికి రాను పాటతో యూట్యూబ్‌లో రాము రాథోడ్ సంచలనం సృష్టించాడు.
ఇమ్మాన్యుయేల్
జబర్దస్త్ షోతో గుర్తింపు పొందిన ఇమ్మాన్యుయేల్ హౌస్‌లోకి వచ్చాడు. జబర్దస్త్ షో చేస్తూనే విరూపాక్ష, గంగం గణేశా, కొరమీను తదితర చిత్రాల్లో ఇమ్మాన్యుయేల్ నటించిన విషయం తెలిసందే. వినోదం ప్రధానంగా హౌస్‌లో ఇమ్మాన్యుయేల్ నవ్వులు పూయించే అవకాశం ఉంది. కొందరు సెలబ్రిటీల్లా మిమిక్రీ చేసి చూపించాడు.
శ్రష్ఠి వర్మ
ఎన్నో వివాదాలు, మలుపులు తిరిగిన జానీ మాస్టర్ కేసులో బాధితురాలిగా ఉన్న శ్రష్ఠి వర్మ హౌస్‌లోకి వచ్చింది. జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన ఆమె ఇటీవల జానీ మాస్టర్ తనని లైంగికంగా వేధించారని పోలీసు కేసు పెట్టడం తెలిసిందే. ఈ వ్యవహారంలో జానీ మాస్టర్ అరెస్ట్ కూడా అయ్యాడు. 'పుష్ప 2' సినిమాకు శ్రష్టి కొరియోగ్రాఫర్‌గానూ పనిచేసింది.
హీరోయిన్ సంజనా గల్రానీ
బుజ్జిగాడ్ సినిమా హీరోయిన్ సంజన గల్రానీ అలియాస్ అర్చన బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చారు. జాన్ అబ్రహంతో చేసిన యాడ్ చూసి పూరీ జగన్నాథ్ బుజ్జిగాడు సినిమాలో ఆమెకు అవకాశం ఇచ్చారు.
కంటెస్టెంట్లు వీరే..
సామాన్యుల కేటగిరి
దమ్ము శ్రీజ
పవన్ కల్యాణ్ పడాల
హరీశ్
డీమాన్ పవన్
మర్యాద మనీష్
ప్రియ
నటీనటుల కేటగిరి
రాము రాథోడ్
సంజన
రీతూ చౌదరి
ఇమ్మాన్యుయేల్
సుమన్ శెట్టి
భరణి శంకర్
శ్రష్ఠి వర్మ
తనూజ
ఆశా సైనీ
సంజనా గల్రానీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.