
Bigg Boss Telugu9 Shrasti Verma Emotional: బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ స్టార్ట్ అయి అప్పుడే వారం పూర్తయ్యింది. అయితే.. ఈ సీజన్ లో కామనర్స్, సెలబ్రీటీస్ అంటూ బిగ్ బాస్ హౌస్ లోకి మొత్తంగా 15 మందిని తీసుకున్నారు.అయితే.. కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ కూడా టైటిల్ ఫెవరెట్‌గా హౌస్ లోకి ఎంట్రీఇచ్చారు.
కానీ అనుకున్నంత బెటర్‌గా హౌస్ లో పర్ఫామెన్స్ ఇవ్వకపోవడంవల్ల ఇటు హౌస్ మెంట్స్ తో పాటు, అటు సోషల్ మీడియా ఓటింగ్ లో కూడా శ్రష్టివర్మకు నెగెటివ్ మార్కులు వచ్చాయి. దీంతో శ్రష్టివర్మ తొలిరౌండ్ లోనే బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినెట్ చేశారు. అయితే.. శ్రష్టి వర్మ బైటకు వస్తు హౌస్ మెంట్స్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంది.
అంతే కాకుండా.. చాలా ఎమోషన్ గా కూడా మాట్లాడింది. ముఖ్యంగా భరణిని తాను అన్న అని పిలిచానని కానీ అది ఆయన నిలబెట్టుకొలేదని వాపోయింది. నమ్మకం ఒకసారి పోతే తిరిగి రాదని, లైఫ్ లో నమ్మకం మాత్రం ఎవరి దగ్గర పొగొట్టుకొవద్దని ఎమోషనల్ అయ్యింది.
హౌజ్‌లో జెన్యూన్ పర్సన్స్ అంటే రాము రాథోడ్, మర్యాద మనీష్, హరిత హరీష్ వీరంతా నిజాయితీగా ఉంటారని చెప్పింది. అలాగే ఫ్లోరా సైనీది మంచి మనసని చెప్పుకొచ్చింది. అదే విధంగా.. రీతూ చౌదరి కెమెరా ముందు ఒకలా, వెనక మరోలా ఉంటుందని బండారం బైటపెట్టింది. తనూజ కూడా నమ్మకాన్ని బ్రేక్ చేసిందని శ్రష్టివర్మ కంటెస్టెంట్ల అసలు రంగును బైటపెట్టింది.
మరోవైపు నాగార్జున ఓపెనింగ్ రోజున తనకు సాంగ్ కొరియోగ్రఫీ చేయాలని చెప్పారు. దానికి పక్కా అని తొందరలోనే చెద్దామని హోస్ లోకివెళ్లిన శ్రష్టివర్మ.. ఇంత తొందరగా బైటకు రావడం అందర్ని ఆశ్చర్యంకు గురిచేస్తుంది. ఇక శ్రష్టి వర్మకు వారంరోజుల పాటు హౌస్ లో ఉన్నందుకు.. 2 లక్షలు రెమ్యునరేషన్ అందినట్లుసమాచారం.