Bigg Boss Vasanthi Kiss to Arjun Kalyan బిగ్ బాస్ ఆరో సీజన్ కంటెస్టెంట్ల విషయంలో ఇప్పుడు అందరి భావన మారింది. సీజన్ స్టార్టింగ్‌లో ఏ ఒక్కరి గురించి అంతగా తెలియదు. కానీ బిగ్ బాస్ ఆరో సీజన్ నుంచి ఎలిమినేట్ అయి బయటకు వచ్చే సమయంలో మాత్రం అంతో ఇంతో క్రేజ్‌తోనే బయటకు వచ్చారు. కొందరు మాత్రం నెగెటివ్ ఇమేజ్‌తో బయటకు వస్తే.. ఇంకొందరు మాత్రం ఫుల్ పాజిటివ్ ఇమేజ్‌తో బయటకు వచ్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గీతూ, ఫైమా వంటి వారు ఫుల్ నెగెటివ్ ఇమేజ్‌తో బయటకు వచ్చారు. బాలాదిత్య, అర్జున్ కళ్యాణ్, వాసంతి వంటి వారు మాత్రం ఫుల్ పాజిటివ్‌తో బయటకు వచ్చేశారు. అర్జున్ కళ్యాణ్ అయితే సత్య వెనకాల పడి పడి జనాల దృష్టిలో సానుభూతిని సంపాదించుకున్నాడు. అర్జున్ కళ్యాణ్‌ ప్రేమను జనాలు అర్థం చేసుకున్నారు. కానీ సత్య ప్రవర్తన పట్ల మాత్రం జనాల అభిప్రాయం మారింది. ఒకప్పుడు ఉన్న సత్యకు.. ఇప్పుడున్న సత్యకు ఎంతో తేడా ఉందంటూ ట్రోల్స్ చేస్తుంటారు.


బిగ్ బాస్ టీఆర్పీల కోసం వాసంతి మాత్రం కాంట్రవర్సీలు క్రియేట్ చేసేందుకు ఏనాడూ ప్రయత్నించలేదు. తను ఎలా ఉంటుందో.. అలానే ఉంటూ వచ్చింది. తన అందంతో నెట్టుకొచ్చింది. బిగ్ బాస్ ఇంటికి గ్లామర్‌గా వాసంతి నిలిచింది. బిగ్ బాస్ ఇంటి నుంచి ఫుల్ పాజిటివ్ ఇమేజ్‌తో బయటకు వచ్చిన కంటెస్టెంట్లలో వాసంతి ఉంటుంది. ఇక ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్లతో శ్రీముఖి ఆట ఆడించింది.




ఆదివారం విత్ స్టార్ మా పరివారం అంటూ శ్రీముఖి సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్‌లో బిగ్ బాస్ కంటెస్టెంట్లువచ్చారు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో అర్జున్ కళ్యాణ్, వాసంతిలు రెచ్చిపోయారు. సత్య కోసం నువ్ ఏమైనా చేస్తావ్‌? నాకోసం ఎందుకు చేస్తావ్‌? అని వాసంతి అడిగింది. ఆ తరువాత వాసంతి కోసం కాకరకాయ జ్యూస్ తాగిన అర్జున్‌కు అదిరిపోయే గిఫ్ట్ వచ్చింది. వాసంతి గట్టిగా అర్జున్ బుగ్గ మీద ముద్దు పెట్టేసింది.


Also Read : Trivikram Mahesh Babu : SSMB 28 అప్డేట్.. అన్నీ మార్చినా పూజా హెగ్డేను మాత్రం మార్చని గురూజీ


Also Read : Jabardasth Sri Satya : పొట్టి డ్రెస్సులో జబర్దస్త్ బ్యూటీ.. కొత్త లుక్కులో సత్య శ్రీ అదుర్స్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook