Bindu Madhavi: ‘దండోరా’ మూవీ తెలుగులో సామాజిక సృహ తో తెరకెక్కుతోన్న సినిమా. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం సినిమా సెకండ్ షెడ్యూల్ శరవేగంగా సాగుతోంది. 25రోజుల పాటు కంటిన్యూగా జరగనున్న ఈ షెడ్యూల్‌లో విలక్షణ పాత్రలతో హీరోయిన్‌గా, నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న బిందు మాధవి ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో బిందు మాధవి వేశ్య పాత్రలో నటిస్తున్నారు. ఎమోషనల్ టచ్‌తో ఆమె పాత్ర ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే ఈ షెడ్యూల్‌లో విలక్షణ నటుడు శివాజీ పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు బిందు మాధవి కూడా ఈ మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యారు.
ఫస్ట్ బీట్ వీడియోతో అంచనాలు పెంచుకున్న ‘దండోరా’ సినిమా సామాజిక స్పృహను కలిగించే అంశంతో తెరకెక్కుతోంది. అగ్ర వర్ణాలకు చెందిన అమ్మాయిల ప్రేమించి పెళ్లి చేసుకున్నా.. అగ్ర వర్ణాలకు ఎదురు తిరిగినా ఎలాంటి దౌర్జన్యకాండ జరుగుతున్నాయనే అంశాన్ని ఆధారంగా చేసుకుని ‘దండోరా’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు 95 శాతం దాకా తగ్గాయి. కానీ అక్కడక్కడ ఇలాంటి పరువు హత్యలు జరుగుతూనే ఉన్నాయి.
ఇలాంటి కథాంశంతో తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో మన పురాతన ఆచారాలు, సాంప్రదాయాలను ఆవిష్కరిస్తూనే వ్యంగ్యం, చక్కటి హాస్యం, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాల కలయికగా దండోరా సినిమాను తెరకెక్కిస్తున్నారు. విలక్షణ నటుడు శివాజీతో పాటు నవదీప్, నందు, బిందు మాధవి, రవి కృష్ణ, మణిక, అనూష, రాధ్య తదితరులు..ఈ సినిమాలో ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.
ప్రముఖ సంగీత దర్శకుడు మార్క్ కె.రాబిన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. వెంకట్ ఆర్.శాఖమూరి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సృజన అడుసుమిల్లి ఎడిటింగ్, క్రాంతి ప్రియమ్ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. రేఖ బొగ్గారపు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి మరిన్ని వివరాలను మేకర్స్ తెలియజేయనున్నారు.
READ ALSO: Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..
READ ALSO: Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









