Trailer: బ్లాక్ వైట్ అండ్ గ్రే లవ్ కిల్స్‌.. ట్రైలర్ విడుదల సోనీ లైవ్ లో మే 2 నుంచి ప్రసారం ..

Black White And Grey Love Kills Trailer: బ్లాక్ వైట్ అండ్ గ్రే లవ్ కిల్స్‌ వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదల అయింది. సోనీ లైవ్ లో మే 2వ తేదీ నుంచి ఈ డ్రామా ప్రసారం కానుంది. అయితే దీనికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు. 

Written by - Renuka Godugu | Last Updated : Apr 16, 2025, 11:20 AM IST
Trailer: బ్లాక్ వైట్ అండ్ గ్రే లవ్ కిల్స్‌.. ట్రైలర్ విడుదల సోనీ లైవ్ లో మే 2 నుంచి ప్రసారం ..

 Black White And Grey Love Kills Trailer: సోనీ లైవ్ డాక్యుమెంట్ ఆధారంగా నిర్మించిన బ్లాక్ వైట్ గ్రే లవ్‌ క కిల్స్‌ అనే అద్భుతమైన ట్రైలర్ నేడు విడుదల చేశారు. ఈ సిరీస్ ఆర్థికంగా వెనుకబడిన యువకుడి జీవితానికి సంబంధించింది. ప్రధానంగా అతడి జీవితంతో ముడి పడి ఉన్న కొన్ని హత్యలు వాటిని ఛేదించేందుకు ప్రయత్నించే ఓ జర్నలిస్టు చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ సోనీ లైవ్‌లో విడుదల చేశారు. ప్రధానంగా ఇందులో ఉన్న కొన్ని సంక్లిష్టమైన.. ఆలోచింపజేసే సీన్స్ ఉన్నాయి. ఆ యువకుడు చేసే హత్యలు వెనుక ఉన్న రహస్యాలను ఛేదించే దిశగా ఈ సినిమా నడుస్తుంది. 

Add Zee News as a Preferred Source

ఈ వెబ్ సిరీస్ లో జర్నలిస్టుగా నటించిన డానియల్ నటన ఆసక్తికరంగా రక్తి కట్టించారు. ట్రైలర్ మొత్తం అంచనాలను పెంచేస్తుంది. ఉత్కంఠ భరితంగా ప్రేక్షకులను రంజింప చేస్తుంది. ప్రధానంగా ఈ సినిమా ఇన్వెస్ట్ గేషన్‌ ఆధారంగా నిర్మించారని చెప్పవచ్చు. ట్రైలర్ చూస్తేనే కాస్త రొమాంటిక్ యాంగిల్ తో పాటు థ్రిల్లింగ్ సిరీస్‌గా కనిపిస్తోంది. మయూర్ మాట్లాడుతూ బ్లాక్ వైట్ అండ్ గ్రే లవ్‌ కిల్స్ అనే ప్రాజెక్ట్ లో తను భాగం కావడం ఆనందంగా ఉంది అని చెప్పారు. థ్రిల్లింగ్‌ డాక్యుమెంటరీ, బోల్డ్ సీన్స్‌, ఇన్వెస్టిగేటివ్ జానర్ లో ఇది నడుస్తుందని చెప్పుకొచ్చారు. ప్రధానంగా అమాయకత్వం, న్యాయం వంటి అవగాహన కల్పించే దిశగా ఈ పాత్రలు ఉన్నాయని ఇది ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న వెబ్ సిరీస్ అని చెప్పుకొచ్చారు.

 ఇక ఈ వెబ్ సిరీస్ పుష్కర్ సునీల్ మహా బల్మ్‌ దర్శకత్వం వహించగా స్వరూప్ సంపత్, హేమల్ ఠక్కర్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ వెబ్ సిరీస్ లో ప్రధానంగా టిగ్మాన్షు ధూళియాతో పాటు మయూర్ మోర్, పాలక్ జైస్వాల్, దేవేన్ భుజాని, హకీం షాజహాన్, అనంత్ జోగ్ తదితరులు నటించారు.

 

ఇదీ చదవండి:   ఉదయం ఈ 5 అనారోగ్యకరమైన అల్పాహారాలకు దూరంగా ఉండాలని కార్డియాలజిస్టుల హెచ్చరిక..

ఇదీ చదవండి:  ఖుష్బూ న్యూ లుక్స్‌పై దారుణంగా ట్రోల్స్‌.. స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చిపడేసిందిగా..!   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News