Dhurandhar Movie: తెలుగులోకి లేటెస్ట్ సెన్సేషన్ బ్లాక్ బస్టర్ ‘దురంధర్’ సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే..?

Dhurandhar: బాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది దురంధర్ సినిమా. URI మూవీ దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించాడు. అయితే, తాజాగా దురంధర్ సినిమా గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. త్వరలోనే ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేయబోతున్నారట మేకర్స్.  

Written by - Aruna Maharaju | Last Updated : Dec 15, 2025, 08:03 AM IST
Dhurandhar Movie: తెలుగులోకి లేటెస్ట్ సెన్సేషన్ బ్లాక్ బస్టర్ ‘దురంధర్’ సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే..?

Dhurandhar Movie Telugu Release: బాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'దురంధర్' సినిమా బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ మూవీ రిలీజ్ అయిన మొదటిరోజు నుంచే ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. విడుదలైన పది రోజుల్లోనే ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి.. సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. 

Add Zee News as a Preferred Source

ఈ సినిమాకు వస్తున్న ఆదరణతో కలెక్షన్స్ రోజురోజుకి పెరుగుతున్నాయి. ఇక ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం రానున్న రోజుల్లో ఈ సినిమా కలెక్షన్స్ మరింతగా పెరిగే అవకాశం ఉంది. URI మూవీ దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ సినిమాలో.. బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించాడు.

అయితే తాజాగా దురంధర్ సినిమా గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమా చూడాలని అనుకుంటున్నారు. దురంధర్ సినిమా పాన్ ఇండియా అప్పీల్ ఉన్న సబ్జెక్టు అయినప్పటికీ.. మేకర్స్ తెలుగులో మాత్రం రిలీజ్ చేయలేదు. కానీ ఇప్పుడు తెలుగులో కూడా విడుదల చేయడానికి ప్లాన్ వేస్తున్నారట. ప్రస్తుతం తెలుగు డబ్బింగ్ పనులు కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే తెలుగు విడుదలపై అధికారిక ప్రకటన చేయనున్నారట మేకర్స్.

ఇక ఈ విషయం తెలిసి తెలుగు ఆడియన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక దురంధర్ సినిమా విషయానికి వస్తే, ఈ సినిమాపై స్టార్ సెలబ్రెటీలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇటీవలే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈ సినిమాను చూసి.. తన ఎక్స్ ఖాతాలో సినిమాపై, దర్శకుడు, హీరో పై ప్రశంసలు కురిపించాడు. తనకు సినిమా బాగా నచ్చిందని, తప్పకుండా ఈ సినిమాను అందరు చూడాలని సూచించాడు. మరి తెలుగులో రిలీజ్ అయ్యాక ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

Also Read: Railway Offer: ఇండియన్ రైల్వే మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. అతి తక్కువ ఖర్చుతో దేశమంతా చుట్టేయండిలా..!  

Also Read: Cold Waves In Telangana: తెలంగాణలో చలిపులి పంజా.. గజగజ వణుకుతున్న ప్రజలు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

About the Author

Aruna Maharaju

అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. లైఫ్‌స్టైల్‌, హెల్త్‌,  స్పోర్ట్స్, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో ఆరేళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News