Suzhal Season 2: అమెజాన్ ప్రైమ్‌లో వచ్చిన సుడల్ ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. సస్పెన్స్, థ్రిల్లర్‌తో ప్రేక్షకులను ఆకర్షించింది. ఈ వెబ్ సిరీస్ సామాజిక సందేశాన్ని కల్పించేలా తీసిన ఈ సిరీస్‌కు ఓటీటీ ఆడియెన్స్ కూడా ఫిదా అయ్యారు. దర్శక ద్వయం పుష్కర్-గాయత్రి తీసిన ఈ వెబ్ సిరీస్‌ను వాల్‌వాచర్ ఫిల్మ్స్ నిర్మించింది. తాజాగా సుడల్ రెండో సీజన్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. బ్రహ్మ, సర్జున్ కె.ఎమ్ డైరెక్ట్ చేశారు. సుడల్ సీజన్ 2పై ఇప్పటికే అంచనాలు పీక్స్ కు చేరాయి.
కథిర్, ఐశ్వర్య రాజేష్, గౌరీ కిషన్, కయల్ చంద్రన్, , సంయుక్త, మోనిషా బ్లెస్సీ, లాల్, శరవణన్, మంజిమా మోహన్, చాందిని, అశ్విని వంటి వారు లీడ్ రోల్స్ లో యాక్ట్ చేశారు. సామ్ సిఎస్ అందించిన మ్యూజిక్ అందించారు. ఈ సిరీస్‌కు మరో హైలైట్ గా నిలిచింది. ఇందులో 9 పాటలు, ఆర్ఆర్ సిరీస్‌ను ఎలివేట్ చేసేలా ఉన్నాయి. టి-సిరీస్ ద్వారా మార్కెట్లోకి ఆల్బమ్ వచ్చేసింది. సుడల్ సీజన్ 1 సెటప్, సిరీస్ మేకింగ్, చివర్లో ఇచ్చిన ట్విస్ట్ అందరినీ ఆకట్టుకుంది. ది వెరైటీ మ్యాగజైన్ ద్వారా 2022 టాప్ 10 బెస్ట్ ఇంటర్నేషనల్ వెబ్ సిరీస్‌లలో సుడల్‌కి కూడా చోటు దక్కింది.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
పుష్కర్, గాయత్రి కథను చెప్పడంలో మాస్టర్లుగా మారిపోయారు. వీరు సీజన్ 2 తో మరోసారి అందరినీ మెస్మరైజ్ చేస్తోంది. సస్పెన్స్, భావోద్వేగాలు, సామాజిక సందేశం ఇచ్చేలా ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. ప్రస్తుతం సీజన్ 2 అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఇదీ చదవండి: Liquor Rates Hike: మందుబాబుకు భారీ షాక్.. భారీగా పెరిగిన బీర్ల ధరలు..
ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









