Hari Hara Veera Mallu Update
పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న భారీ చారిత్రాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను ఏం రత్నం సమర్పణలో ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్నారు. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఒక యోధుడి పాత్రలో కనిపించనున్నారు. ఇది పవన్ కళ్యాణ్ తొలి పాన్ ఇండియా సినిమా కావడం విశేషం.
ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో నటిస్తున్నారు. మొదట ఈ పాత్రకు సంబంధించిన కొన్ని సీన్లు షూట్ చేశారు. కానీ ‘యానిమల్’ సినిమా విడుదలైన తర్వాత బాబీ డియోల్ పెర్‌ఫార్మెన్స్ చూసి దర్శకుడు జ్యోతి కృష్ణ ఆశ్చర్యపోయారు. ఆయన నటనలో ఉన్న తీవ్రత, హావభావాలు చూసి ఈ సినిమాలోని ఔరంగజేబు పాత్రను మరింత బలంగా మార్చాలని నిర్ణయించారంట.
అందులో భాగంగా స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేశారు. పాత్రకు కొత్త నేపథ్యం ఇచ్చారు. బాబీ డియోల్ స్టార్‌డమ్‌కు సరిపడేలా, ఆయన నటనలోని గొప్పతనాన్ని చూపించేలా ఈ పాత్రను తీర్చిదిద్దారంట. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు తెలిపారు. "యానిమల్‌లో బాబీ గారు మాటలు లేకపోయినా, ఆయన చూపులతోనే భావోద్వేగాన్ని ప్రదర్శించారు. అలాంటి నటుడితో పనిచేయడం గొప్ప అనుభవం" అని జ్యోతి కృష్ణ అన్నారు.
ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. జ్ఞానశేఖర్ వి.ఎస్., మనోజ్ పరమహంస ఛాయాగ్రాహకులుగా, తోట తరణి కళా దర్శకుడిగా పని చేస్తున్నారు. జూలై 24న ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో భారీగా విడుదల కానుంది.
ఎన్నో రోజుల తరువాత పవన్ కళ్యాణ్ హీరోగా విడుదలవుతున్న సినిమా కావడంతో.. అలానే ఆయన డిప్యూటీ సీఎం అయిన తరువాత విడుదలవుతున్న మొదటి సినిమా కూడా కావడంతో.. ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరి ఇన్ని వాయిదాలు పడి ఇప్పుడు విడుదల అవుతున్న ఈ చిత్రం ఎంతవరకు కలెక్షన్ సాధిస్తుందో అని టాలీవుడ్ మొత్తం ఎదురుచూస్తోంది. ముఖ్యంగా ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, బాబి మధ్య వచ్చే సన్నివేశాల కోసం పవర్ స్టార్ అభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా రిజల్ట్ తెలియాలి అంటే మరి కొద్ది రోజులు వేచి చూడాలి.
Also Read : చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ కలిసి నటించిన ఏకైన సినిమా తెలుసా.. !
Also Read : 16 ఏళ్ల వయసులో పెళ్లి..ఆ తర్వాత పిల్లలు..25 ఏళ్ల వయసులో విడాకులు.. ఆ తర్వాత మూవీ ఇండస్ట్రీని ఏలిన హీరోయిన్..
You May Like
బరువు తగ్గడానికి సులభమైన మార్గం - రాత్రికి కేవలం ఒక చెంచా!ONE TWO SLIM
మీరు వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? దీన్ని చదువుONE TWO SLIM
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









