Bold concept in Telugu: తెలుగు సినీ పరిశ్రమ ఎప్పుడూ వైవిధ్యమైన కథలకు తెరలేపుతుంది. కానీ కొన్ని సార్లు, కొందరు దర్శకులు సాహసోపేతమైన కాన్సెప్ట్లను ఎంచుకోవడం అరుదు. అలాంటి ఓ బోల్డ్ కథతో తెరపైకి రాబోతున్న సినిమా 'పూర్ణ చంద్రరావు' ఈ సినిమాను తారక రామ దర్శకత్వం వహిస్తున్నారు. ఇండియన్ సినిమాల్లో తొలిసారిగా పోర్న్ అడిక్షన్ అనే సున్నితమైన కాన్సెప్ట్‌ను ప్రదర్శించబోతున్నారు.
ఇంత ఆసక్తికరమైన కథకు హీరోగా విజయ్ రాజ్ కుమార్ నటిస్తున్నారు. ఆయన గతంలో ‘ఏం చేస్తునావ్’ అనే సినిమా చేశారు. ఇప్పుడు ఈ కొత్త ప్రయోగంలో భాగమవుతూ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. కథ రచన కూడా విజయ్ రాజ్ కుమార్ స్వయంగా చేసుకోవడం విశేషం.
ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే ఇది ఓ సాదారణ చిత్రం కాదని స్పష్టమవుతుంది. సోఫా మీద అర్ధనగ్నంగా కూర్చొని ల్యాప్‌టాప్ చూస్తున్న హీరో, వెనుక స్టీవ్ జాబ్స్ మరియు ఎలాన్ మస్క్ ఫోటోలు కనిపించడం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. టెక్నాలజీ, పోర్న్ అడిక్షన్, మానసిక స్థితి వంటి అంశాలను ఈ సినిమా సున్నితంగా చూపించబోతుందని అర్థమవుతోంది.
ఇప్పటి వరకు మద్యం, డ్రగ్స్, సోషల్ మీడియా అడిక్షన్ వంటి అంశాలపై సినిమాలు చూసిన ప్రేక్షకులకు 'పూర్ణ చంద్రరావు' ఓ కొత్త అనుభూతిని అందించబోతుంది. పోర్న్ అడిక్షన్ అనే అంశాన్ని ఎంటర్టైన్మెంట్ మరియు థాట్ప్రొవోకింగ్ స్టైల్‌లో ప్రేక్షకులకు అందించనున్నారు.
‘అనగనగా ఆస్ట్రేలియాలో’ అనే సినిమాతో కొత్త ప్రయోగాన్ని చేసిన తారక రామ ఈసారి మరింత బోల్డ్ కథను ఎంచుకున్నారు. నిజ జీవిత అనుభవాలను ఆధారంగా చేసుకుని తెరకెక్కిస్తున్న ఈ కథలో, ప్రేక్షకులకు నిజమైన అర్థం చెప్పేలా తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైనప్పటి నుండి 'పూర్ణ చంద్రరావు' గురించి సోషల్ మీడియాలో చర్చ జోరుగా సాగుతోంది. చాలామంది "ఇది సమాజానికి అవసరమైన సినిమా" అంటూ అభిప్రాయపడుతున్నారు. "టాలీవుడ్‌లో ఇటువంటి ప్రయోగాలు అరుదు" అని సినీ ప్రేమికులు ప్రశంసిస్తున్నారు.
ఈ ఆసక్తికరమైన ప్రయోగాన్ని సహాన ఆర్ట్ క్రియేషన్స్ మరియు యారీక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నిర్మాతలు మాధవి మంగపతి, యారీక్ లాంటి వ్యక్తులు ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్‌కు మద్దతుగా నిలవడం అభినందనీయం.
ఇలాంటి బోల్డ్ కాన్సెప్ట్‌ను తెరపైకి తీసుకురావడం సులభం కాదు. కానీ 'పూర్ణ చంద్రరావు' మొదటి పోస్టర్‌తోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా ప్రేక్షకులపై ఎంత ప్రభావం చూపుతుందో తెలియాలంటే మూవీ రిలీజ్ వరకూ వెయిట్ చేయాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









