Sushant Singh Rajput: సుశాంత్ రాజ్ పుత్ కేసులో బిగ్ ట్విస్ట్.. అంతా చేసి చివరకు ఇలా చేసారేమిటి..!

Sushant Singh Rajput: ఎగిరెగిరి ఎవరో ఎందులో కాలు పెట్టినట్టు ఉంది సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో. తాజాగా బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‎పుత్ కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. సుశాంత్ మరణానికి సంబంధించి నమోదైన రెండు కేసులను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సీబీఐ  క్లోజ్ చేసింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 23, 2025, 08:54 AM IST
Sushant Singh Rajput: సుశాంత్ రాజ్ పుత్ కేసులో బిగ్ ట్విస్ట్.. అంతా చేసి చివరకు ఇలా చేసారేమిటి..!

Sushant Singh Rajput: సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బాలీవుడ్ లో నెపోటిజానికి బలైపోయాడు. అతను ఆత్మహత్య చేసుకోలేదు. అతన్ని చంపారనే ఆరోపణలపై ఈ కేసును ముంబై సీఐడీ నుంచి సీబీఐకు బదిలీ అయింది. తాజాగా సెంట్రల్ బ్యూర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో తేలింది ఏమిటంటే.. ఈ కేసులో తమకు ఎలాంటి ఆధారాలు దొరకినందున ఈ కేసును క్లోజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.  ఈ మేరకు  ముంబై కోర్టులో సీబీఐ క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేసింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంలో ఎటువంటి కుట్ర కోణం లేదని క్లోజర్ రిపోర్టులో సీబీఐ పేర్కొంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంతో నటి రియా చక్రవర్తికి ఎలాంటి సంబంధం లేదని సీబీఐ ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చింది. సుశాంత్ మరణానికి వెనక కుట్ర ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. అలాగే.. సుశాంత్ కుటుంబ సభ్యులపై రియా చక్రవర్తి దాఖలు చేసిన కేసును కూడా సీబీఐ ఈ సందర్భంగా  క్లోజ్ చేసింది.

Add Zee News as a Preferred Source

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‎పుత్ జూన్ 14, 2020న ముంబై బాంద్రాలోని తన ఇంట్లో  అనుమానస్పద స్థితిలో మరణించాడు. బాలీవుడ్‌ స్టార్ హీరోగా చెలామణి అవుతోన్న సుశాంత్ మరణం బాలీవుడ్‎తో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సుశాంత్ మరణం వెనక కుట్ర కోణం ఉందని పెద్ద ఎత్తున ఆరోపణలు వ్యక్తం అయ్యాయి. సుశాంత్ మరణం వెనక అప్పటి మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే తనయుడు.. ఆదిత్య థాక్రేతో పాటు పలువురు పొలిటిషన్స్‎తో పాటు బాలీవుడ్ మాఫియా ఉందని ప్రచారం జరిగింది.

సుశాంత్  గర్ల ఫ్రెండ్‌, నటి రియా చక్రవర్తి, ఇతరులు కలిసి అతనిని  ఆత్మహత్యకు ప్రేరేపించారంటూ ఆరోపణలు వచ్చాయి. దీంతో  పాటు ఆర్థిక మోసం, మానసిక వేధింపులకు గురి చేశారని హీరో తండ్రి  కెకె సింగ్ బిహార్ రాజధాని పాట్నాలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ  ఫిర్యాదు మేరకు రియా చక్రవర్తితో పాటు పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి కౌంటర్ గా నటి రియా  చక్రవర్తి సుశాంత్ సింగ్ సోదరీమణులపై ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వాళ్లు నకిలీ మెడికల్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వడం వల్లే సుశాంత్ మరణించాడని రియా ఫిర్యాదులో పేర్కొంది.

సుశాంత్ సింగ్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం  సృష్టించడంతో అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. రంగంలోకి దిగిన సీబీఐ సుశాంత్ మరణానికి గల కారణాలపై విచారణ మొదలుపెట్టింది. సుశాంత్ తండ్రి, నటి రియా చక్రవర్తి నమోదు చేసిన కేసులను లోతుగా దర్యాప్తు చేసి కేసుల విచారణ ముగించింది. దాదాపు ఐదేళ్ల పాటు సుశాంత్ కేసును ఇన్విస్టిగేట్ చేసిన సీబీఐ ఈ మేరకు ముంబై కోర్టులో క్లోజర్ రిపోర్టు దాఖలు చేసింది. సుశాంత్ మరణం వెనక ఎలాంటి కుట్ర కోణం బహిర్గతం కాలేదని సీబీఐ తేల్చి చెప్పింది.  ఈ పరిణామంతో సుశాంత్ ఫ్యామిలీ మెంబర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. వాళ్లు దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారా లేదా అనేది చూడాలి.

READ ALSO: Star Heroine: హిందువుగా పుట్టి.. ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకొని.. ప్రస్తుతం క్రైస్తవ మతం అనుసరిస్తున్న స్టార్ హీరోయిన్..

READ ALSO:  Madhuri Dixit: షాకింగ్.. మాధురి దీక్షిత్ అందానికి మై మరిచిపోయి పెదవులను రక్తం కారేలా కొరికేసిన మాజీ ఎంపీ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News