Ameesha patel video viral: సాధారణంగా సెలబ్రీటీలు, రాజకీయ నేతలను చాలా మంది కలవాలని అనుకుంటారు. ఒకవేళ వారు ఎక్కడైన కన్పిస్తే ఫోటొలు, సెల్ఫీల కోసం తెగ తాపత్రయ పడుతుంటారు. అంతేకాకుండా.. ఒక్కసారైన వారితో మాట్లాడాలని ప్రయత్నిస్తుంటారు. తమ ఫెవరేట్ సెలబ్రీటీలు, పొలిటిషియన్స్ లను కలిసి వారి మీద తమకున్న ప్రేమను చాటుకొవాలని ఎంతటి పనైన చేసేందుకు అభిమానులు వెనుకాడరు.
ఈ నేపథ్యంలో కొన్నిసార్లు అభిమానులు హద్దులు దాటి ప్రవర్తిస్తుంటారు. వీరి ప్రవర్తనలు చాలా సందర్బరాలలో కాంట్రవర్సీగా కూడా మారాయి.ఈ క్రమంలో మహా శివరాత్రివేళ గుడికి వెళ్లిన ఒక నటికి షాకింగ్ అనుభవం ఎదురైంది.
హీరోయిన్ అమీషా పటేల్‌తో ఫోటోల కోసం ఎగబడ్డ బాబాలు
మహాశివరాత్రి సందర్భంగా ముంబై - జుహూలో ఓ శివాలయానికి వెళ్లిన హీరోయిన్ అమీషా పటేల్‌ను చుట్టుముట్టి ఫోటోల కోసం ఎగబడ్డ బాబాలు pic.twitter.com/iLeZJd9OfE
— Telugu Scribe (@TeluguScribe) February 27, 2025
ముంబై జుహూలోని ఫెమస్ శివాలయంలో ఈ విచిత్రం చోటు చేసుకుంది. మహాశివరాత్రిని పురస్కరించుకుని బాలీవుడ్ నటి స్టార్ హీరోయిన్ అమీషా పటేల్ గుడికి వెళ్లింది. శివుడ్ని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంది. అయితే.. అక్కడున్న భక్తులు ఆమెను చూడగానే... గుడిలోనే సెల్పీలు దిగేందుకు పోటీ పడ్డారు. తమఫోన్ లను తీసుకుని ఆమె చుట్టు చేరిపోయారు.
ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. నటిని సెల్పీల కోసం అక్కడున్న బాబాలు ఎక్కువగా వేధించారు. బాబాలు.. తమఫోన్ లను పట్టుకుని నటి దగ్గరకు వెళ్లి ఆమెను తాకుతూ.. సెల్పీల కోసం ప్రయత్నించారు. సాధారణ అభిమానుల కంటే.. ఎక్కువ మంది బాబాలు నటిని చుట్టుముట్టడంతో అక్కడున్న వారు సైతం విస్తుపోయారు. మొత్తంగా వారి నుంచి ఎలాగోలా తప్పించుకుని నటి తన కారులో ఎక్కి వెళ్లిపోయింది.
ఈ వీడియో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. ఏంటీ భయ్యా..ఈ బాబాలు ఇలా ఉన్నారంటూ కొంత మంది షాక్ అవుతున్నారు. బాబాలు సెలబ్రీటీలతో ఫోటోలు దిగడమేంటని మరికొందరు ముక్కున వేలేసుకుంటున్నారు. మరికొందరు వీరంతా దొంగ బాబాలు.. అంటూ సెటైర్ లు వేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో మాత్రం ప్రస్తుతం వైరల్ గా మారింది. అమీశా పటేల్ తెలుగు పవన్ కళ్యాణ్ తో బద్రిలో నటించింది. అదే విధంగా బాలయ్యతో పరమవీరచక్ర, మహేష్ బాబుతో నాని, ఎన్టీఆర్ తో నరసింహుడులో నటించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









