Bollywood Actress Preity Zinta controversy: సాధారణంగా సెలబ్రీటీలు తరచుగా తమ సినిమాల గురించి, తమ పర్సనల్ లైఫ్ గురించి కొన్ని అంశాలను సోషల్ మీడియాలో తరచుగా పోస్ట్ లు చేస్తుంటారు. అయితే.. కొన్నిసార్లు సెలబ్రీటీలు నార్మల్ గా పోస్ట్ లు చేసిన కూడా నెటిజన్లు ఏదో ఒక రచ్చను రాజేస్తుంటారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటి ప్రీతి జింటా తరచుగా తన ఇన్ స్టాలో తన కుటుంబంతో వెళ్లిన ట్రిప్ లు, ఆలయాలను పోస్టు చేస్తు ఉంటుంది. ఇటీవల కుంభమేళకు వెళ్లిన సమయంలో కూడా ఆమె తన ఫ్యామిలీ ఫోటోల్ని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.
ఈ క్రమంలో .. ప్రస్తుతం ఇటీవల ఒక నెటిజన్ ప్రీతిజింటాను.. ఒక క్వశ్చన్ అడిగి చిరాకు తెప్పించాడు. మీరు తరచుగా ఇన్ స్టాలో దేవాలయాలు, ట్రెడిషన్.. మొదలైన పోస్ట్లు పెడుతున్నారు. కొంపదీసి బీజేపీలో చేరతారా.. అంటూ క్వశ్చన్ చేశాడు. దీంతో ఆమె కోపంగా.. అసలు.. నేను పెట్టిన పోస్టుకు పాలిటిక్స్ లో చేరడంపై లింక్ ఏంటని కూడా కాస్త సీరియస్ గా కౌంటర్ ఇచ్చారు .
దీంతో ఆ తర్వాత.. ప్రీతిజింటా.. మళ్లీ కూల్ గా ఆలోచించి.. ఇలా ప్రతిదాంట్లో కాంట్రవర్సీగా చూడటం సరికాదన్నారు. అంతేకాకుండా.. నేను హిందువును.. చిన్నప్పటి నుంచి ట్రెడిషన్ లు, ఆచారాలు పాటిస్తాను . అందుకే నా ఫ్యామిలీ, పిల్లలతో వెళ్లిన ప్రదేశాలు ఇన్ స్టాలో పోస్ట్ చేస్తాను. ఏ రాజకీయ పార్టీలో చేరడం వంటివి లేదని స్పష్టం చేశారు. దీంతో ప్రీతిజింటాకు తలపొగరని, ప్రతి దానికి అతిగా రియాక్ట్ అవుతుందని సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు.
ఈ క్రమంలో ప్రీతిజింటా దొగొచ్చి.. అభిమాని పట్ల రూడ్ గా కౌంటర్ వేసినందుకు సారీ కూడా చెప్పారు. గతంలో కూడా కొంత మంది ఇలాగే తనను వేధించారని.. అందుకే కోపంలో ఇలా అనేశానని ప్రీతిజింటా చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఏకంగా ప్రీతీ జింటా దిగొచ్చి సారీ చెప్పడంతో ఆ నెటిజన్ సైతం.. పండగ చేసుకున్నాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









