Bollywood Controversy: ఇటీవల సినిమా రంగంలో దక్షిణాది సినిమాలు ట్రెండ్ సృష్టిస్తున్నాయి. భారీ విజయాలు దక్కించుకుంటూ కలెక్షన్లు వర్షం కురిపిస్తున్నాయి. ప్రపంచస్థాయిలో కలెక్షన్ల వర్షం కురిపించిన బాహుబలి , పుష్ప సినిమాలపై బాలీవుడ్ దర్శకుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ప్రపంచవ్యాప్తంగా భారీ విజయంతో కలెక్షన్ల హోరు సృష్టించిన బాహుబలి, పుష్ప సినిమాలకు అంత సీన్ లేదట. ప్రత్యామ్నాయం లేకనే ఈ సినిమా చూశారట. నేషనల్ అవార్డ్ విన్నర్, బాలీవుడ్ దర్శకుడైన అనంత్ మహాదేవన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలివి. తన దృష్టిలో ఈ సినిమాలు సాధించినవి భారీ విజయాలు కానేకావన్నారు. బాలీవుడ్ లో దక్షిణాది సినిమాలకు లభిస్తున్న ఆదరణపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా బాహుబలి, పుష్ప సినిమాలపై కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇంతకుముందు బాలీవుడ్ లో కామెడీ, రొమాన్స్, యాక్షన్ అంశాల మేళవింపుతో సినిమాలు వస్తుండటంతో చాలామంది ఆదరించేవారని ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. అందుకే ప్రేక్షకులు మరో ప్రత్యామ్నాయం లేక బాహుబలి, పుష్ప వంటి సినిమాలు చూస్తున్నారన్నారు. వసూళ్లు వచ్చినంత మాత్రాన మంచి సినిమా కాదన్నారు.
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప 2 సినిమా వసూళ్ల సునామీ సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్ల వసూళ్లు చేసింది. హిందీలో కూడా 600 కోట్లు దాటి వసూళ్లు సాధించింది. ఇక బాహుబలి గతంలో ప్రపంచవ్యాప్తంగా 1300 కోట్లు వసూళ్లు చేసింది. ఈ సినిమాలతో బాలీవుడ్ లో దక్షిణాది సినిమాల క్రేజ్ ఇంకా పెరిగింది. ఆర్ఆర్ఆర్, దేవర, గేమ్ ఛేంజర్ ఇలా చాలా సినిమాలు పాన్ ఇండియాగా తెరకెక్కి భారీ వసూళ్లు చేస్తున్నాయి. ఈ తరుణంలో అనంత్ మహాదేవన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై అభిమానులు మండిపడుతున్నారు.
అనంత్ మహాదేవన్ చేసిన వ్యాఖ్యలపై ఇంకా టాలీవుడ్ దర్శక నిర్మాతలు స్పందించలేదు. ప్రేక్షకులు దిక్కులేకనే ఈ సినిమాలు చూశారనడంపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
Also read: AP 10th Results 2025: ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాల తేదీ ఫిక్స్, ఎప్పుుడంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









