Lata Mangeshkar: కరోనా మహమ్మారి సినీ ప్రముఖుల్ని వెంటాడుతూనే ఉంది. దురదృష్ఠవశాత్తూ లెజండరీ సింగర్ లతా మంగేష్కర్ కోవిడ్ బారిన పడ్డారు. 92 ఏళ్ల లతా మంగేష్కర్‌‌కు ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా థర్డ్‌వేవ్ దేశాన్ని కుదపడం ప్రారంభమైంది. సినీ ప్రముఖుల్ని టార్గెట్ చేస్తోంది. ఇప్పుడు బాలీవుడ్ లెజంజరీ సింగర్ లతా మంగేష్కర్ కోవిడ్ బారిన పడటం విచారకరం. స్వల్ప లక్షణాలున్నాయని ఆమె మేనకోడలు రిచా ధృవీకరించింది. 92 ఏళ్ల లతా మంగేష్కర్‌ను ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలోని (Breach Candy Hospital) ఐసీయూ విభాగంలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని రిచా తెలిపారు. ఆమె వయస్సును దృష్టిలో పెట్టుకుని ఐసీయూలో చేర్చామన్నారు. ఆమె ఆరోగ్యం కోసం ప్రార్ధించాల్సిందిగా అభిమానుల్ని కోరారు. 


ఇంతకుముందు అంటే 2019 నవంబర్‌లో శ్వాస సంబంధిత సమస్య కారణంగా ఆసుపత్రిలో చేరారు లతా మంగేష్కర్. ఆ తరువాత కోలుకుని ఇంటికి చేరారు. ఇప్పుడు కోవిడ్ బారిన పడటంతో వయస్సు దృష్ట్యా ఆసుపత్రిలో చేర్చారు. 2021 సెప్టెంబర్ నెలలో తన 92వ జన్మదినోత్సవాన్ని జరుపుకున్నారు లతా మంగేష్కర్. తన పాటలతో లక్షలాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న లతా మంగేష్కర్ ఆరోగ్యం మెరుగుపడాలని అభిమానులు కోరుకుంటున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే లతా మంగేష్కర్ (Lata Mangeshkar) తన కెరీర్, వ్యక్తిగత జీవితపు ఫోటోల్ని షేర్ చేస్తుంటారు. ఇప్పటికే ప్రభుత్వం ఆమెను పద్మ భూషణ్, పద్మ విభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే వంటి పలు జాతీయ పురస్కారాలతో సత్కరించింది. 2001లో భారత ప్రభుత్వ అత్యున్నత పురస్కారం భారత రత్నతో ( Bharat Ratna)సత్కారం జరగడం విశేషం.


Also read: Renu Desai Corona: పవన్ కల్యాణ్ కుమారుడు అకిరాకు కరోనా- రేణు దేశాయ్ కి కూడా..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook