Brahmamudi: రాజ్‌పైకి ధాన్యలక్ష్మి ఉసిగొల్పిన రుద్రాణికి దిమ్మదిరిగే షాక్‌.. ఆస్తి మొత్తం కావ్యకు రాసేసిన తాతయ్య..! 

Brahmamudi Today December 10 Th Episode: నేటి ఎపిసోడ్‌లో కావ్య వంటగదిలో పడుకుని ఉందని అపర్ణ రాజ్‌ను నిలదీస్తుంది. అంత మానవత్వం లేకుండా ఉన్నామా? అని కావ్యను వ్యతకారంగా అడుగుతాడు రాజ్‌. ఎవరైనా చూస్తే ఎంత అవమానం, మీ తాతయ్య నానమ్మ తీసుకువచ్చారు. నీ భార్య నీ ఇంటికి తిరిగివస్తే అలా చేస్తావా? అంటుంది అపర్ణ. రాకూడదని అని చెప్పానా? అంటాడు రాజ్‌. రమ్మను తలుపు తెరిచే ఉంది కదా అని వెళ్లిపోతాడు. అయినా కావ్య సంకోచిస్తుంది. అపర్ణ ఒప్పించి పంపిస్తుంది.

Written by - Renuka Godugu | Last Updated : Dec 10, 2024, 09:37 AM IST
Brahmamudi: రాజ్‌పైకి ధాన్యలక్ష్మి ఉసిగొల్పిన రుద్రాణికి దిమ్మదిరిగే షాక్‌.. ఆస్తి మొత్తం కావ్యకు రాసేసిన తాతయ్య..! 

Brahmamudi Today December 10 Th Episode: ఇక గదిలోకి వస్తుంది కావ్య ఆ సమయంలో రాజ్‌ బెడ్‌పై ప్లాస్టర్‌తో అడ్డుగీత వేస్తుంటాడు. దాన్ని చూసి ఏంటండి అది? అని అడుగుతుంది. ఇది ఓ గీత, రాజ్‌ రేఖ. ఈ గీత దాటి నువ్వు ఇటు పడుకోకూడదు అంటాడు. మీరు ఇటు జరిగితే, నేను నిద్రలో అటు జరిగితే అంటుంది కావ్య. జరగకూడదు.. మా మమ్మి చెప్పింది గదిలోకి రానివ్వమని ఆ సగం నీకు, ఈ సగం నాకు రావద్దు అని తెగేసి చెబుతాడు.

ఏవండి.. ప్రపంచంలో ఎవరైనా ఇలా చేస్తారా? భార్యాభర్తలు సగం సగం పంచుకోమని చెప్పారు ఇలా పడకగది కూడా పంచుకునే ఘనత మీదే అంటుంది కావ్య. ఎస్‌ నాదే అని పడుకుంటాడు రాజ్‌. ఇక కావ్య కావాలని రాజ్‌ను సతాయించడం మొదలు పెడుతుంది. దీంతో రాజ్‌కు చిరాకు వస్తుంది. ఇంత దాక వచ్చింది కదా చెబుతున్నా మీరు ఇంత కష్టపడాల్సిన పనిలేదు. మీరు మనస్ఫూర్తిగా నన్ను భార్యగా ఒప్పుకున్న తర్వాతే నేను ఈ బెడ్‌పై పడుకుంటా అంటుంది కావ్య. అప్పుడు హమ్మయ్య.. నీ సెల్ప్‌రెస్పెక్ట్ నన్ను కాపాడింది. నేను పిలిచే వరకు బెడ్‌పైకి రాకు, ఏదో తాతయ్య పిలిచాడు కదా అని నిన్ను ఇక్కడి వరకు రానిచ్చాను అంటాడు. నాకు తెలుసులే మీరు ఇలాగే మాట్లాడతారు అని కింద పడుకుంటుంది కావ్య.

మరోవైపు రుద్రాణీ ఏవో కన్నింగ్‌ ప్లాన్స్‌ వేస్తుంది. రాహుల్‌ వచ్చి ఏంటి మమ్మి ఇంకా పడుకోలేదా? అంటాడు. ఎందుకు మమ్మి ఆస్తిలోమనకు కూడా వాటా ఇస్తా అన్నారు కదా అంటాడు. తాతయ్య కోమాలో ఉన్నాడు కదా.. ప్లాన్‌ ఏ అమలు కాకపోతే ప్లాన్‌ బీ వేస్తా.. కోమాలో నుంచి రాకపోతే కష్టం కదా అంటుంది. రేపు చెక్‌ తీసుకుని రాజ్‌ వద్దకు వెళ్లి రూ.2 కోట్లు కావాలి అని అడుగు ఉంటుంది రుద్రాణీ. దీనికి వాడు నన్ను కుక్క కంటే హీనంగా చూస్తాడు. నీకు నేనే ఇవ్వను రాజ్‌ ఎలా ఇస్తాడు. కావాలని ఇవ్వను అని అనిపించాలి కదా.. ధాన్యలక్ష్మిని రెచ్చగొడదాం.. ఆస్తి కోసం గొడవ చేస్తుంది. ఒక్కసారి ఉసిగొలిపితే చాలు గొడవ చేస్తుంది అంటాడు.

మరుసటి రోజు ఆ ప్లాన్‌ అమలుకు సోఫాలో ఉన్న రాజ్‌ వద్దకు రాహుల్‌ చెక్‌ తీసుకుని వస్తాడు. రాజ్‌.. నీతో మాట్లాడాలి అంటాడు. ఏంట్రా..? చెప్పు ఒక చెక్‌ మీద సంతకం చేయాలి అంటాడు. ఎంత రూ.లక్ష అంటాడు. కాదు రెండు కోట్లు అంటాడు. షాక్‌ అయి ఎందుకు అంటాడు. ఇక నుంచి జూలైగా తిరగకుండా ఉండటానికి, బిజినెస్‌ పెట్టడానికి అంటాడు రాహుల్‌.

చూడు రాహుల్‌ నీకు రెండు కోట్లు చేతిలో పెడితే ఏం చేస్తావో అందరికీ తెలుసు అంటాడు ప్రకాశం. కష్టపడి బిజినెస్ పెట్టుకో.. అంటాడు దీంతో రుద్రాణీ వాడు రాజ్ అని అడిగితే నువ్వు ఎందుకు జోక్యం చేసుకుంటున్నావ్ అంటాడు. నువ్వు తిన్నింటి వాసాలు లెక్కపెడతావ్‌. వీడు నీ పుత్రరత్నం కొన్నాళ్లు కంపెనీకి పంపిస్తే కోట్ల ఆస్తి నష్టం,రాజ్‌ను పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాడు అంటాడు. నీకు రెండు కోట్లు కాదు రెండు లక్షలు కూడా దుగ్గిరాల కుటుంబం నుంచి రావు రాజ్‌ ఇస్తానన్న నేను ఇవ్వనివ్వను.

ఇదీ చదవండి: విద్యార్థులకు బంపర్‌ గుడ్‌న్యూస్‌.. వరుసగా 3 రోజులు సెలవు ప్రకటించిన ప్రభుత్వం..!  

సరే ఈ విషయాన్ని నేను ఇంతటితో వదిలిపెట్టను. ఎలా ఇవ్వరో నేను చూస్తాను అని వెళ్లిపోతుంది రుద్రాణీ. రాజ్‌ ఎందుకు బాబాయ్‌ ఇలా హర్ట్‌ చేశావ్ అంటాడు. ఇంతటితో వదిలే రకం కాదు అంటాడు ప్రకాశం. అప్పుడు రుద్రాణీ రాహుల్‌ ఇద్దరూ ధాన్యలక్ష్మి దగ్గరకు చెక్‌పెట్టుకుని వెళ్తారు.. రోజు రోజుకు విలువ లేకుండా పోతుంది. అరే.. కనీసం మనుషులుగా చూడట్లేదు అంటుంది.. ఏమైందో చెప్పు అంటుంది ధాన్యలక్ష్మి. బిజినెస్‌ చేయడం మంచి విషయమే కదా అంటుంది ధాన్యం. వాళ్ల ఆస్తులు కరిగిపోతాయని వారి ఫిలింగ్‌ అంటుంది రుద్రాణీ.

అత్తయ్య నువ్వు ఒక్కదానివే ఇప్పుడు నాకు సహాయం చేయగలవు అంటాడు రాహుల్‌. ఇప్పుడు నువ్వు నాకు హెల్ప్‌ చేస్తే ఫ్యూచర్‌లో కల్యాణ్‌తో కలిసి డైమండ్‌ బిజినెస్‌ చేస్తా అంటాడు రాహుల్‌. దీంతో ఆలోచనలో పడుతుంది ధాన్యం. నీ ఆలోచన బానే ఉంది కానీ, అనబోతుంది. ఏంటత్తయ్య నీకు అనుమానమా? అంటుంది. అనుమానం కాదు రాహుల్ రాజ్‌ వద్దకు వెళ్లి అడిగితే మనల్ని ఛీ కొట్టినట్లే తనను కూడా ఛీకోడతారని భయపడుతుంది. నన్నేందుకు ఛీ కొడతాడు కుటుంబంలో ఇప్పుడే గొడవలు జరుగుతున్నాయి అంతేకానీ రాజ్‌కు భయపడి కాదు అంటుంది. 

ఇదీ చదవండి: Brahmamudi Kavya: బిగ్‌ బాస్‌ హౌస్‌లోకి కావ్య..? బిగ్‌ సర్‌ప్రైజ్‌ అంటూ వైరల్‌ పోస్ట్‌..!

పిల్లల పేరు మీద ఆస్తి పంచుతా అని లాయర్‌తో మాట్లాడతాడు తదుపరి ఎపిసోడ్‌ లో రాజ్‌ తండ్రి సుభాష్‌ మాట్లాడతాడు. లాయర్‌ సారీ, గత వారమే తన యావదాస్తీని తన మనవరాలు కావ్యకు రాసేశాడు మీకు ఆ ఛాన్స్‌ లేదు అంటాడు. తదుపరి ఎపిసోడ్‌లో ఇల్లు ధాన్యం, రుద్రాణీల రుద్ర తాండవంతో ఏం జరుగుతుందో చూడాలి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News