Brahmamudi: ముసలోడి తిరుగులేని అస్త్రం..రుద్రాణీకి హార్ట్‌అటాక్‌, ధాన్యలక్ష్మి చిందులు మరి రాజ్‌ ఏంటి ఇలా మారిపోయాడు?

Brahmamudi Today December 12th Episode: ఎపిసోడ్‌ కొనసాగుతుంది. బెడ్‌రూంలో రాజ్‌, కావ్యలు ఆస్తి పంపకాలపై గొడవలు పడుతుంటారు. ఆస్తి పంచకూడదు అని కావ్య, ఏంచేయమంటావ్‌ ఎవ్వరూ వినకుంటే అని రాజ్‌ వాగ్వాదం చేస్తుంటారు.  తాతయ్య అతనికి నచ్చిన నిర్ణయాలు తీసుకున్నారు. నేడు ఆస్తుల విషయంలో ఇదే జరుగుతుంది. ఈ ఇంటి వారసుడిని అని నువ్వు గుర్త చేసేవరకు నాకు తెలియడం లేదు అంటాడు.

Written by - Renuka Godugu | Last Updated : Dec 12, 2024, 09:46 AM IST
Brahmamudi: ముసలోడి తిరుగులేని అస్త్రం..రుద్రాణీకి హార్ట్‌అటాక్‌, ధాన్యలక్ష్మి చిందులు మరి రాజ్‌ ఏంటి ఇలా మారిపోయాడు?

Brahmamudi Today December 12th Episode: పరిస్థితులు అన్ని నా చేయి దాటి వెళ్లిపోయాయి. ఆస్తి పంపకాల విషయం నా చేతుల్లో ఏమి లేదు అని చేతులెత్తస్తాడు రాజ్‌. మరోవైపు రుద్రాణీ, ధాన్యలక్ష్మిలు బెడ్‌రూంలో మాట‌లాడుకుంటారు. నీకొడుకు నా కొడుకుకు అన్యాయం జరగదు అనుకుంటారు. అప్పుడే రంగంలోకి ఎంటర్‌ అయిన ప్రకాశం నోర్ముయండి, పల్లు రాలతాయి అని రుద్రాణీపై విరుచుకుపడతాడు. ఒక్క విషయం గుర్తుంచుకో నేడు ఆస్తులు నీకు రావచ్చు.కానీ, ఆస్తులు బంధాలు ఎంతో ముఖ్యం అని తెలుస్తుంది దీని మాటలు నమ్మ తప్పున దారిలో పడుతున్నావు. ఏదో ఒక రోజు ఇదే నిన్న ముంచేస్తుంది చూడు అని ధాన్యలక్ష్మిని తిట్టి వెళలిపోతాడు ప్రకాశం.

మరుసటి రోజు అందరూ హాల్‌లో ఉంటారు. అప్పుడే రాజ్‌ కిందకు వచ్చి వెళ్లిపోతుంటాడు. ఎక్కడికి వెళ్తున్నావ్‌ రాజ్‌ లాయర్‌ వస్తాడు అంటుంది ధాన్యం. వచ్చి ఆస్తులు ముక్కలు చేసి పోతాడు అనుబంధాలు కూడా ముక్కలు అవుతాయి. మనం నుంచి నేను నాభార్య అనే వరకు వెళ్తుంది. ఈ సామ్రాజ్యాన్ని కూల్చివేసి ఆ శకలాలు ఏరుకోవడానికి నేను సిద్ధంగా లేను అంటాడు. ఇందులో నీకు వాటా వస్తుంది రాజ్‌ అంటుంది రుద్రాణీ. ఒక మహావృక్షాన్ని కూకటి వేళ్లతో కూల్చి కొమ్మలు రెమ్మలు పంచుకోవడానికి సిద్ధమయ్యారు అంటాడు.

మరోసారి ధాన్యానికి ప్రకాశం సర్ది చెబుతుంటాడు. రుద్రాణీని సర్వనాశనమైపోతారు.నువ్వు మట్టికొట్టుకుపోతావు అంటాడు. అప్పుడు రాజ్‌ నేను వెళ్తున్న అంటాడు. ఏ నాకు ఏమైన అన్యాయం జరుగుతుందా? అంటాడు. అప్పుడే లాయర్‌ వస్తాడు. రాజ్‌ నాన్న పిల్లల పేరుపై ఆస్తి పంచాలని పిలిపించాను అంటాడు. ఈ నిర్ణయం ఎవరు తీసుకున్నారు? అంటాడు లాయర్. పెద్దాయనను కాదని మీరు ఎలా నిర్ణయం తీసుకుంటారు. ఆ హక్కు మీకు లేదు.. మీకే కాదు ఈ ఇంట్లో ఎవరికీ లేదు అంటాడు. ఆ మాట చెప్పడానికి మీరెవరు. మేం చెప్పింది చేయండి అంటుంది రుద్రాణీ.

మీ నాన్నగారు వారం క్రితమే ఓ వీలునామా రాశారు అంటాడు. ఆ వీలునామా మీ వద్ద ఉందా? అంటుంది ఇందిరాదేవి. ఉంది తీసుకువచ్చా అంటాడు లాయర్‌. ఏది తీయండి అందులో ఏముందో చదవండి అని కంగారు పడుతుంది రుద్రాణీ. ఏం పేలుస్తాడో ఈ ముసలోడు అంటుంది మనస్సులో రుద్రాణి. బయట పెట్టండి అని ధాన్యలక్ష్మి కూడా తొందర పెడుతుంది. అప్పుడు కాగితాలు తీసి చదువుతాడు లాయర్‌..

'దుగ్గిరాల సీతారామయ్య అనే నేను పూర్తి స్పృహలో ఉండి ఎవరి బలవంతం లేకుండా ఈ వీలునామా రాస్తున్నాను. అందరూ సంయమనం పాటించండి గౌరవించండి. నా దృష్టిలో కుటుంబం అంటే ఒకరికి ఒకరు అండగా ఉండాలి.. కుటుంబం విచ్చిన్నం అయితే గూడు చెరిగిన పక్షిలా అవుతుంది. దుగ్గిరాల కుటుంబం అంటే తరతరాలుగా ఉమ్మడి కుటుంబం. ఎప్పటికీ కలిసే ఉండాలి. అందుకే ఆస్తి ముక్కలు చేయడంలేదు ఎవ్వరికీ వాట పంచడం లేదు. ఇది నా స్వర్జితమైన ఉమ్మడి ఆస్తి. అందుకు పూర్తి అర్హురాలైన నా మనవరాలు కావ్య పేరుపై నా యావదాస్తి రాస్తున్నా ఇది ఎవరూ ఆమోదించినా.. ఆమోదించకపోయినా సర్వ హక్కులు కావ్యకే ఉంటాయి. ఎవరూ అమ్ముకోవడానికి లేదు పగడ్భందిగా కావ్యకు రాస్తున్నా' అని వీలునామా పెద్దాయన రాసిస్తాడు.

శభాష్‌ బావ అంటుంది ఇందిరా దేవి. ఒక్కసారిగా రుద్రాణీ, ధాన్యలక్ష్మి, రాహల్‌లకు భూమి కంపించనట్లు అవుతుంది. ఏంటి అత్తయ్య మా నోట్లో మట్టికొట్టారు అంటుంది ధాన్యం. లాయర్‌ ముందు చిందులు ఎందుకు కాస్త ఆగు అంటాడు ప్రకాశం. థ్యాంక్స్‌ లాయర్‌ గారు నాన్ను సంక్షోభంనుంచి బయటవేశారు అంటాడు రాజ్‌ నాన్న లాయర్‌ వెళ్లిపోతాడు.

కరివేపాకు కరివేపాకు ఎందుకు పనికోస్తావు అంటే పోపులోకి పనికొస్తా తినడానికి కాదు చెత్తబుట్టలోకి పనికొస్తా అంటుంది అంతేనా కరివేపాకు అత్తయ్య అని హేళన చేస్తుంది స్వప్న. ఇదేం వీలునామా బయట నుంచి వచ్చినదానికి ఇంత ఆస్తి రాస్తారా? అని చిందులు వేస్తుంది ధాన్యలక్ష్మి.  ఆ మాటకు వస్తే నేను నువ్వు కూడా బయట నుంచే వచ్చాం. కావ్య కూడా వచ్చింది. ఈ ఇంటి కోడలు అంటుంది. అక్క నీ కోడలు మీద రాసేసరికి పొంగిపోతున్నావ్‌. ఆఖరికి ఇంటి పెద్ద వారసుడు అయినా రాజ్‌కు కూడా రాయకుండా కావ్యకు రాయడం ఏంటి? అంటుంది. 

ఇంకా అర్థం కాలేదా? మావయ్య ఈ ఇల్లు వాటాలుగా విడిపోవడానికి వీలు లేదు కుటుంబం అంతా కలిసి ఉండాలని ఆయన అలా రాశాడు అంటుంది అపర్ణ. నేను ఒప్పుకోను అంటుంది ధాన్యం. అత్తయ్య ఏంటిది మావయ్య తప్పుడు నిర్ణయం తీసుకున్నారు అంటుంది. పళ్లు రాలగొడతా ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా సరిగ్గానే తీసుకుంటాడు.నా భర్త రాసిన వీలునామా నేను నూటికి నూరు శాతం ఒప్పుకుంటా ఏ కరివేపాకు ఆమోదింకపోతే ఏం అంటుంది ఇందిరాదేవి.

ఇదీ చదవండి:  చీర అందాలతో ఖుషీ చేస్తోన్న శ్రీదేవి చిన్న కూతురు.. స్టన్నింగ్‌ ఫోటోలు..

న్యాయంగా తాతగారి ఆస్తి మనవళ్లకే చెందుతుంది వారి భార్యలకు కాదు అంటుంది. కోర్టులో గెలవడానికి ఈ ఒక్క పాయింట్‌ చాలు. ఇళ్లు ముక్కలు కాకుండా ఇలా చేశారు మా నాన్న. ఇన్నాళ్లు ఆడపడుచులా బతికాను ఇప్పుడు ఈ మహాతల్లి మోచేతి నీరు తాగాలా? అంటుంది రుద్రాణీ. అప్పుడు ఇన్నాళ్లు మీరు చేసింది ఏంది? ఈ కుటుంబం మోచేతి నీరు తాగేకా మీరు మీ కొడుకు బతికారు అని మండిపడుతుంది స్వప్న. నా కొడలిని తక్కువ అంచనా వేయకు రుద్రాణీ అని అపర్ణ కలుగజేసుకుంటుంది.

నీకంటే ఎక్కువ హక్కు నా కోడలికే ఉంది. అయితే నాకంటే ఎక్కువ కాదు కదా అంటుంది ధాన్యం. కోర్టుకు ఎక్కి నా కొడుకు వాటా ఎలా రాబట్టుకోవాలో అలాగే రాబట్టుకుంటాను అని తెగేసి చెప్పి వెళ్తుంది. ఎందుకైనా మంచిది రాహుల్‌ మీ అమ్మ పక్కనే ఉండు ఆమెకు హార్ట్‌ అటాక్‌ వచ్చే ప్రమాదం ఉంది అంటుంది స్వప్న.

ఇదీ చదవండి: రుద్రాణీ నోట్లో మట్టికొట్టిన పెద్దాయన.. కోర్టుకు ఈడుస్తానని రెచ్చిపోయిన ధాన్యలక్ష్మి..

మరోవైపు కావ్య కృష్ణయ్యతో మాట్లాడుతుంది. ఏం చేశావ్‌? సౌభాగ్యం అడిగితే అంతా ఆస్తి రాయించావు అని మాట్లాడుతుంది. ఇంటి బాధ్యతకు నువ్వే కరెక్ట్‌ ఆ తాళాలు నీవద్ద ఉంటేనే కరెక్ట్‌ అంటాడు రాజ్‌ దీంతో కావ్య ఆశ్చర్యంగా చూస్తుంది రాజ్‌ను మరుసటిరోజు ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూడాలి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News