Bromance OTT Streaming: రీసెంట్ గా థియేట్రికల్ విడుదలై ప్రేక్షకాదరణ పొందిన చిత్రం ‘బ్రొమాన్స్’. తాజాగా ఈ చిత్రం ఇప్పుడు ప్రముఖ ఓటీటీ మాధ్యమం సోనీ లివ్‌లో మే 1 నుంచి స్ట్రీమింగ్ కానుంది. లవ్, యాక్షన్, డ్రామా, కామెడీ, స్నేహంపై , హృదయాన్ని హత్తుకునే భావోద్వేగ సన్నివేశాలతో ఈ మలయాళ సినిమా తెరకెక్కింది. టాకీస్ లలో ఈ చిత్రాన్ని చూడలేకపోయినవారు ఇప్పుడు మీ ఇంట్లోనే ఓటీటీ వేదికగా చూసి ఎంజాయ్ చేయవచ్చు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అరుణ్ డి.జోస్ మాట్లాడుతూ.. ‘‘బ్రొమాన్స్’ మూవీని థియేటర్స్‌లో వీక్షించి తమ ప్రేమాభిమానాలను అందించిన ఆడియన్స్ కు కృతజ్ఞతలు. ఈ చిత్రం అందరి హృదయాలను హత్తుకున్న సినిమా ఇది. ఈ సినిమా ఫ్రెండ్ షిప్ తో పాటు చక్కటి డ్రామా కూడిన సస్పెన్స్ డ్రామా ఇపుడు ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తున్నారు. కనిపించకుండా పోయిన ఓ ఫ్రెండ్ ను వెతికే మిత్రుల కథ. మే 1నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కు రావడం సంతోషకంగా ఉందన్నారు. ఈ చిత్రం మరింత మంది పేక్షకుల హృదయాలను ఆకట్టుకుంటుందనటంలో సందేహం లేదన్నారు.
అరుణ్ డి.జోస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బ్రొమాన్స్’ చిత్రం బింటో అనే యువకుడి కోణంలో స్టోరీ రన్ అవుతోంది. అతను తన సోదరుడి స్నేహితులతో కలిసి కనిపించకుండా పోయిన తన సహోదరుడిని వెతకటానికి ప్రయత్నిస్తాడు. కథంతా ఓ రాత్రిలోనే జరుగుతుంది. ఊహించని ట్విస్టులు, మరచిపోలేని జ్ఞాపకాలతో నిండిన ప్రయాణంగా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. అరుణ్ డి.జోస్, రవీష్ నాథ్, థామస్ పి.సెబాస్టియన్ రాసిన ఈ స్టోరీని అషిక్ ఉస్మాన్ నిర్మించారు. ఇందులో అర్జున్ అశోకన్, భరత్ బోపన్న, శ్యామ్ మోహన్, మహిమ నంబియార్, మాథ్యూ థామస్, కలభవన్ షాజోన్ వంటి ప్రతిభావంతులైన నటీనటులు నటించారు.టాకీస్ లలో ప్రేక్షకులను నవ్వులతో ముంచెత్తిన ఈ సినిమా ఇపుడు ఓటీటీ లో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.
ఇదీ చదవండి: ఈ చెట్లు ఉంటే.. పాములకు మీ ఇంట్లోకి రెడ్ కార్పెట్ పరిచినట్టే.. తస్మాత్ జాగ్రత్త..!
ఇదీ చదవండి: బడా స్టార్స్ సహా 900 సినిమాల్లో నటించిన నటి.. భర్త చనిపోవడంతో తాగుడుకు బానిసై జీవితం నాశనం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









