Bunny Vas: 'ఏంది పావలా గోల?' అగ్ర హీరోలు, నిర్మాతలపై బన్నీ వాస్‌ ఫైర్‌

Bunny Vas Mass Waring To Star Actors A Head Of Pawan Kalyan Dispute: నీది పావలా.. నాది పావలా అని కొట్టుకోవడమేనా? అని ప్రముఖ నిర్మాత బన్నీ వాసు అసహనం వ్యక్తం చేశాడు. పెద్ద హీరోలు, నిర్మాతలు, ఎగ్జిబిటర్లకు చురకలు అంటిస్తూ బన్నీ వాస్ సంచలన ప్రకటన చేశాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jun 6, 2025, 12:42 PM IST
Bunny Vas: 'ఏంది పావలా గోల?' అగ్ర హీరోలు, నిర్మాతలపై బన్నీ వాస్‌ ఫైర్‌

Single Screens Issue: తన సినిమా విడుదలను అడ్డుకుంటున్నారని ఏపీ డిప్యూటీ సీఎం, సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ చేసిన రచ్చతో తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర వివాదం నడుస్తోంది. నిర్మాతలు, ఎగ్జిబిటర్లు మధ్య ఓ  తీవ్రస్థాయిలో ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మరో నిర్మాత బన్నీ వాసు స్పందించారు. సినీ పరిశ్రమలో జరుగుతున్న వివాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. 'పావలా' అంటూ కొట్టుకోవడం కాదని హితవు పలికారు.

Add Zee News as a Preferred Source

Also Read: Teenagers Fight: 'నా లవర్‌కు ఎందుకు కాల్ చేస్తున్నావు.. అది నా పిల్ల?' అంటూ దాడి.. టీనేజర్‌ మృతి

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో థియేటర్ల మనుగడపై నిర్మాత బన్నీ వాసు‌ 'ఎక్స్‌' వేదికగా శుక్రవారం స్పందించాడు. 'ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ గ్రహించవలసింది.. కరెక్ట్ చేసుకోవాల్సింది పర్సంటేజ్ సిస్టమ్‌ కాదు.. ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించడం ఎలా అని!' అని హితవు పలికారు. 'ఇప్పుడున్న అర్ధ రూపాయి వ్యాపారంలో నీది పావుల.. నాది పావలా అని కొట్టుకోవడం కాదు. మునపటిలా మన వ్యాపారాన్ని రూపాయికి ఎలా తీసుకెళ్లాలి అనేది ఆలోచించాలి తప్ప.. ఇలాగా సినిమా విడుదలైన 28 రోజుల్లోపే ఓటీటీకి ఇవ్వాలనే ట్రెండ్ కొనసాగితే .. రాబోయే నాలుగైదు ఏళ్లలో 90 శాతం సింగిల్ స్క్రీన్స్ మూసుకుపోతాయి' అని బన్నీ వాసు ఆందోళన వ్యక్తం చేశాడు.

Also Read: Thalliki Vandanam: 'తల్లికి వందనం' రూ.15 వేలు రావాలంటే ఏమేం కావాలి? ఏ పత్రాలు ఉండాలి?

'ఈ విషయం పెద్ద హీరోలు కూడా ఆలోచించాలి. మీరు రెండు సంవత్సరాలకు ఒక సినిమా.. మూడు సంవత్సరాలకు ఒక సినిమా చేస్తూ పోతే థియేటర్ల నుంచి ప్రేక్షకులు కూడా దూరమైపోతారు. ఈ రెండు మూడేళ్లలో చాలా మంది థియేటర్ ఓనర్స్ వాటిని మెయింటైన్ చేయలేక మూసేస్తారు' అని అగ్ర హీరోలకు నిర్మాత బన్నీ వాసు సూచనలు చేశాడు. 'సింగిల్ స్క్రీన్స్ మూతపడిపోతే ఓన్లీ మల్టీప్లెక్స్ థియేటర్స్ అయితే పెద్ద హీరోలందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మీ సినిమా థియేటర్స్ ద్వారా వచ్చే ఆదాయం కేవలం 43 శాతంమాత్రమే నిర్మాతలకు వెళుతుంది' అని అగ్ర హీరోలకు బన్నీ వాసు గుర్తుచేశారు.

నేరుగా అగ్ర హీరోలు మహేశ్‌ బాబు, ప్రభాస్‌, విజయ్‌ దేవరకొండ, అల్లు అర్జున్‌ తదితరులకు బన్నీ వాసు తన ట్వీట్‌తో వార్నింగ్‌ ఇచ్చాడు. సినీ పరిశ్రమ భవిష్యత్‌పై ఆలోచనలు చేయాలని సూచించాడు. ఇలా అయితే సినీ పరిశ్రమ బతకడం కష్టమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అగ్ర హీరోలు తమ సినిమాలను ఇష్టారీతిన విడుదల చేసుకోవడం.. అనంతరం సైలెంట్‌గా ఉండడం వంటి వాటితో పరిశ్రమకు ఇబ్బందులు ఎదురవుతాయని బన్నీ వాస్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News