Case filed on Tollywood hero bellamKonda srinivas over traffic violation: టాలీవుడ్ హీరో బెల్లం కొండ శ్రీనివాస్ కు జుబ్లీహిల్స్ పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. ఇటీవల ఆయన జూబ్లిహిల్స్ పరిధిలో రాంగ్ రూట్ లో వెళ్లడమే కాకుండా.. ట్రాఫిక్ కానిస్టేబుల్ పట్ల దురుసుగా ప్రవర్తించాడు.
ఈ క్రమంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల కాలంలో చాలా మంత్రి తప్పతాగి డ్రైవింగ్ చేస్తున్నారు. బైక్ లు నడిపేటప్పుడు హెల్మెట్ లను పెట్టుకొవడం లేదు. కారులో సీట్ బెల్ట్ ను కూడా అవాయిడ్ చేస్తున్నారు.
రాంగ్ రూట్ లో వెళ్తు.. వీరు డెంజర్ లో పడటమే కాకుండా.. ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ట్రాఫిక్ వయోలెషన్ ల వల్ల ఎంతో మంది తమ ప్రాణాలు కోల్పోయారు. కొంత మంది ట్రాఫిక్ రూల్స్ లను అతిక్రమించడమే కాకుండా.. అడ్డొచ్చిన ట్రాఫిక్ పోలీసులపైన దురుసుగా ప్రవర్తిస్తు, దాడులు కూడా చేస్తున్నారు. వీరిలో సెలబ్రీటీలు, బడాబాబుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఈ క్రమంలో తాజాగా.. ఇలాంటి ఘటనలో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ అడ్డంగా బుక్కైయ్యాడు. రాంగ్ రూట్ లో కారు నడిపిస్తు.. అడ్డగించిన ట్రాఫిక్ పోలీస్ పట్ల దురుసుగా ప్రవర్తించాడు.ఈ ఘటన అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఇది వైరల్ కావడంతో పోలీసులు దీనిపై సీరియస్ అయ్యారు. తాజాగా.. జూబ్లిహిల్స్ పోలీసులు కేసును నమోదు చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి