LYF: అపుడుపుడు కొన్ని చిత్రాలు ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటాయి. అలాంటి సినిమాల్లో ‘లవ్ యువర్ ఫాదర్’ సినిమా ఒకటి. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ విడుదల తర్వాత సినిమాలపై ఎక్స్ పెక్టేషన్స్ భారీగా పెరిగాయి. ముఖ్యంగా తండ్రి-కొడుకుల అనుబంధాన్ని భావోద్వేగపూరితంగా చిత్రీకరించినట్లు ఈ ట్రైలర్ కనిపిస్తుంది. ఈ సినిమా SP చరణ్, శ్రీ హర్ష తండ్రీ కొడుకులుగా కనిపించనున్నారు. కషిక కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని పవన్ కేతరాజు దర్శకత్వంలో మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా, అన్నపరెడ్డి స్టూడియోస్ నిర్మించాయి. ఏప్రిల్ 4న విడుదల కానుంది.
ఆడియన్స్ నుంచి భారీ స్పందన రాబట్టిన LYF ట్రైలర్ రాజకీయ నాయకులని కూడా ప్రభావితం చేస్తోంది. తాజాగా LYF సినిమా ట్రైలర్ ని ఫేమస్ పొలిటికల్ లీడర్, BJP నేత తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కేంద్ర క్యాబినేట్ మంత్రి కిషన్ రెడ్డి చూసి ఇంప్రెస్ అయ్యారు. ఈ ట్రైలర్ ని చూసి ఆయన చాలా ఆశ్చర్యపోయినట్టు చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా ఇలాంటి చిత్రాన్ని అందించిన మూవీ టీమ్ ను అభినందించారు. ట్రైలర్ చాలా బాగుందని ముఖ్యంగా అందులోని కాశీ విజువల్స్ తనని ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు. ట్రైలర్ చూసిన కిషన్ రెడ్డి కచ్చితంగా ఈ సినిమా చరిత్రలో గుర్తుండిపోయే సినిమాల్లో ఒకటిగా నిలుస్తుందని కొనియాడారు. LYF ట్రైలర్ కి ఎంతగానో ఆకర్షితులైన కిషన్ రెడ్డి ఈ సినిమా ఫస్ట్ టికెట్ ని కొని సినిమాపై అంచనాలు పెంచారు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ మూవీ టీం అందరికీ తన ప్రత్యేక అభినందనలు తెలిపారు.
READ ALSO: Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..
READ ALSO: Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









