)
JSK - Janaki vs State of Kerala OTT Streming on ZEE5: మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ పొలిటిషన్ గా కేరళ రాష్ట్రం నుంచి తొలిసారి బీజేపీ తరుపున త్రిసూర్ లోక్ సభ స్థానం నుంచి గెలిచి సంచలనం రేపారు. అంతేకాదు ఈయన నరేంద్ర మోడీ క్యాబినేట్ లో సహాయ మంత్రి అయ్యారు. సెంట్రల్ మినిస్టర్ అయిన తర్వాత ఈయన ముఖ్యపాత్రలో ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ సినిమాలో నటించారు. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ టైటిల్ రోల్లో పోషించింది. J.S.K మూవీకి ప్రవీణ్ నారాయణన్ దర్శకత్వం వహించారు. కాస్మోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై J. ఫణీంద్ర కుమార్ నిర్మించారు. ప్రఖ్యాత న్యాయవాది డేవిడ్ అబెల్ డోనోవన్ (సురేష్ గోపి) సాయంతో లైంగిక వేధింపుల నుండి బయటపడిన జానకి విద్యాధరన్ (అనుపమ పరమేశ్వరన్) చుట్టూ తిరిగే కథతో ఈ చిత్రాన్ని రూపొందించారు. న్యాయం కోసం పోరాడుతున్న ఓ యువతి, న్యాయవాది చివరకు గెలిచారా? లేదా? అసలు జానకి లైఫ్ లో ఏం జరిగింది. న్యాయం కోసం చేయాల్సి వచ్చిన పోరాటం ఏమిటనేదే ప్రశ్నల్ని రేకెత్తించేలా ట్రైలర్‌ను కట్ చేశారు.
ఈ చిత్రంలో గిరీష్ నారాయణన్ పాటలు స్వరపరిచారు. గిబ్రాన్ ఆర్ఆర్ అందించారు. రెనదివే సినిమాటోగ్రఫీ అందించారు. ఈ ఆగస్టు 15న ‘J.S.K - జానకి V vs. స్టేట్ ఆఫ్ కేరళ’ ప్రత్యేక డిజిటల్ ప్రీమియర్‌ను ZEE5లో స్ట్రీమింగ్ కు రానుంది. ఈ భారత స్వాతంత్ర్య దినోత్సవం రోజు నుంచి స్ట్రీమింగ్ కు రానుంది.
ZEE5 ఓటీటీ విషయానికొస్తే.. మన దేశంలో పూర్తి స్వదేశీ ఓటీటీ మాధ్యమం. 2025లో మరో సూపర్‌హిట్ ప్రీమియర్‌తో ఆడియెన్స్ ముందుకు వస్తోంది. ఈ యేడాది సంక్రాంతికి వస్తున్నం, రాబిన్‌హుడ్, భైరవం వంటి వరుస తెలుగు చిత్రాలను అందించిన తర్వాత ZEE5 తెలుగు ఇప్పుడు మరో అద్భుతమైన సినిమాతో రాబోతుంది. క్రిటిక్స్ ప్రశంసలు పొందిన మాలీవుడ్ లీగల్ డ్రామా ‘J.S.K - జానకి V v/s స్టేట్ ఆఫ్ కేరళ’ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో స్ట్రీమింగ్ కానుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.