)
మలయాళ చిత్ర పరిశ్రమలో ఫస్ట్ టైమ్ పూర్తి నిడివి గల WWF- జానర్ యాక్షన్ కామెడీ గా ‘చఠా పటా - రింగ్ ఆఫ్ రైడీస్’ తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమాను తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో రిలీజ్ చేస్తున్నారు. జనవరి 2026లో విడుదల కానున్న ఈ మూవీ మలయాళంలో దుల్కర్ సల్మాన్ నేతృత్వంలోని వేఫేరర్ ఫిల్మ్స్ రిలీజ్ చేయనుంది. ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు అద్వైత్ నాయర్ డైరెక్ట్ చేస్తున్నారు. రీల్ వరల్డ్ ఎంటర్టైన్మెంట్ నిర్మించింది. ఈ నిర్మాణ సంస్థను ట్రాన్స్ వరల్డ్ గ్రూప్, లెన్స్‌మన్ గ్రూప్ కలిసి ఏర్పాటు చేశాయి. రమేష్, రితేష్ రామకృష్ణన్, షిహాన్ షౌక్కత్, ఎస్. జార్జ్, సునీల్ సింగ్‌లు ఈ వెంచర్లో కీలక భాగస్వాములుగా ఉన్నారు.
ఈ చిత్రంలో అర్జున్ అశోకన్, రోషన్ మాథ్యూ, ఇషాన్ షౌక్కత్ (“మార్కో” ఫేమ్), విశాఖ్ నాయర్, పూజా మోహన్‌దాస్ లీడ్ రోల్స్ లో నటించారు. .
WWF రెజ్లింగ్, ప్రపంచవ్యాప్తంగా ఆరాధించే పాత్రల నుండి ప్రేరణ పొందిన ఈ చిత్రాన్ని భారీ రెజ్లింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతుంది. గతంలో విడుదలైన ఈ సినిమా టీజర్ సోషల్ మీడియాలో తుఫాను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ టీజర్ ప్రత్యేకమైన పాత్ర గెటప్‌లు, అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఫోర్ట్ కొచ్చిలోని WWE-జానర్ రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో సెట్ చేయబడిన ఈ చిత్రం ప్రేక్షకులకు గొప్ప యాక్షన్-కామెడీ ఎక్స్ పీరియన్స్ అందించడమే లక్ష్యంగా రాబోతుంది.
ఇప్పటికే భారీ ఉత్సాహంతో ఎదురుచూస్తున్న ఈ చిత్రం టీజర్, పోస్టర్లు, రెగ్యులర్ అప్డేట్లతో అంచనాలను పెంచేసింది. ఈ చిత్రంలో ఇతర ముఖ్యపాత్రల్లో సిద్ధిక్, లక్ష్మీ మీనన్, మనోజ్ కె జయన్, ఖలీద్ అల్ అమెరి, రఫీ, టెస్ని ఖాన్, ముత్తుమణి, కార్మెన్ ఎస్ మాథ్యూ, డి'ఆర్టగ్నన్ సాబు, వైష్ణవే బిజు, శ్యామ్ ప్రకాష్, కృష్ణన్ నంబియార్, మినాన్, సరీన్ షిహాబ్, వేదిక శ్రీకుమార్, ఓర్హాన్, ఆల్విన్ ముకుంద్, అర్చిత్ అభిలాష్, తోష్ & తోజ్ క్రిస్టీ, ఆష్లే ఐజాక్ అబ్రహం నటిస్తున్నారు.
పాన్-ఇండియా లెవల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ఉత్తర భారత థియేట్రికల్ హక్కులను ప్రముఖ బాలీవుడ్ బ్యానర్ ధర్మ ప్రొడక్షన్స్ కైవసం చేసుకుంది. PVR ఐనాక్స్ పిక్చర్స్ తమిళనాడు, కర్ణాటకలో రిలీజ్ చేయబోతుంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మలయాళం, తమిళం, తెలుగు, కన్నడతో పాటు హిందీ భాషలలో 115 కంటే ఎక్కువ దేశాలలో విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. ప్రఖ్యాత బాలీవుడ్ త్రయం శంకర్-ఎహ్సాన్-లాయ్ సంగీతం అందించారు. లిరిక్స్ వినాయక్ శశికుమార్ రాశారు. మ్యూజిక్ రైట్స్ T-సిరీస్ సొంతం చేసుకుంది. ఈ సినిమా జనవరిలో మంచి డేట్ లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.