Best OTT Movies: అండర్‌గ్రౌండ్‌లో బాంబులు.. ఏకంగా బ్యాంక్‌కే భారీ కన్నం.. ఇంట్రెస్టింగ్ మూవీ..!

Latest OTT Movies: స్టార్ డైరెక్టర్ త్రినాధరావు నక్కిన నిర్మాణంలో నిఖిల్ గొల్లమారిని దర్శకుడిగా పరిచయం చేస్తూ రూపొందించిన మూవీ చౌర్య పాఠం. దొంగతనం బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది.  

Written by - Ashok Krindinti | Last Updated : Jun 22, 2025, 10:43 AM IST
Best OTT Movies: అండర్‌గ్రౌండ్‌లో బాంబులు.. ఏకంగా బ్యాంక్‌కే భారీ కన్నం.. ఇంట్రెస్టింగ్ మూవీ..!

Latest OTT Movies: పిట్ట కొంచెం.. కూత ఘనం అంటూ కొన్ని చిన్న సినిమాలు సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. అటు థియేటర్.. ఇటు ఓటీటీలో ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోతున్నాయి. ఇలాంటి సినిమాల్లో చౌర్యపాఠం ఒకటి. అమెజాన్‌ ప్రైమ్‌ ఈ మూవీ ప్రస్తుతం దుమ్ములేపుతోంది. థియేటర్‌లో అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీ.. ఇప్పుడు అమెజాన్‌ ప్రైమ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఓటీటీ ఆడియన్స్‌ను మెప్పిస్తూ.. డిజిటల్ స్క్రీన్లను షేక్ చేస్తోంది. ఏకంగా 120 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ మైలురాయిని చాలా తక్కువ సమయంలోనే క్రాస్ చేసిందని మేకర్స్ చెబుతున్నారు. 

డైరెక్టర్ నిఖిల్ గొల్లమారి తొలి సినిమాతో ప్రేక్షకులను కట్టిపడేశాడు. చిన్న కథే అయినా.. ప్రజెంటేషన్‌తో మెప్పించాడు. ఆద్యంతం ఇంట్రెస్టింగ్‌గా.. తరువాత ఏం జరుగుతుందో అనే ఆసక్తిని క్రియేట్ చేశాడు. హీరో ఇంద్ర రామ్‌కు కూడా ఇది తొలి మూవీ అయినా.. తన సూపర్ యాక్టింగ్‌తో అలరించాడు. ప్రముఖ డైరెక్టర్ నక్కిన త్రినాధరావు ప్రొడ్యూసర్‌గా మారి ఈ మూవీని నిర్మించారు. బ్యాంక్ రాబరీ బ్యాక్‌డ్రాప్‌ తీసుకుని.. ఓ గ్రామంలో జరిగే అక్రమాలు ఎలా బయట పడ్డాయనే పాయింట్‌తో మేకర్స్ తెరకెక్కించారు.

కథ ఏంటంటే..?

ఈ మూవీలో హీరోకు సినిమా తీయాలనే కోరిక ఉంటుంది. అయితే సినిమా తీసేందుకు ప్రొడ్యూసర్స్‌ను ప్రయత్నించినా ఎవరు ముందుకురారు. దీంతో తానే దొంగతనం చేసి.. సినిమాను పూర్తి చేయాలని అనుకుంటాడు. ఈ క్రమంలో ఓ ఊర్లో ఉన్న బ్యాంకులో దొంగతనం చేసేందుకు ప్లాన్ చేస్తాడు. అందుకు గ్యాంగ్‌ను సిద్ధం చేసుకుని ఆ ఊరికి వెళతాడు. అయితే ఆ గ్రామంలో ఈ గ్యాంగ్‌కు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి..? బ్యాంక్‌లో పనిచేసే హీరోయిన్ ఈ గ్యాంగ్‌తో ఎలా చేతులు కలిపింది..?  ఆ గ్రామంలో జరుగుతున్న మిస్టరీ మర్డర్‌లు ఎలా కనిపెట్టారు..? అండర్‌గ్రౌండ్‌లో బాంబులు పెట్టి ఎలా కన్నం వేశారు..? చివరికి అనుకున్నది సాధించారా..? అనేది ఈ మూవీ స్టోరీ. ఇందులోని ట్విస్టులు, గ్రామంలో జరిగే సన్నివేశాలు అలరించాయి. థియేటర్‌లో చూడలేకపోయిన వారు అమెజాన్‌ ప్రైమ్‌లో చూడొచ్చు. 

Also Read :  ఇరాన్‌పై అమెరికా బాంబుల వర్షం.. భీకరంగా B2 బాంబర్లతో దాడి, ప్రకటించిన ట్రంప్..

Also Read :  భారత్‌-పాక్‌ మధ్య యుద్ధం ఆపినా.. ఎన్ని శాంతి ఒప్పందాలు చేసినా నాకు నోబెల్‌ ప్రైజ్‌ రాదు: ట్రంప్..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

Trending News