Cherasala: డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తోన్న ‘చెరసాల’.. ఏప్రిల్ 11న గ్రాండ్ రిలీజ్..

Cherasala: రామ్ ప్రకాష్ గున్నం హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో  తెరకెక్కిన చిత్రం ‘చెరసాల’.  ఎస్ రాయ్ క్రియేషన్స్ బ్యానర్ మీద కథ్రి అంజమ్మ సమర్పణలో  కథ్రి అంజమ్మ, షికార నిర్మాతలుగా ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించారు. ఈ సినిమా ఏప్రిల్ 11న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా మూవీ యూనిట్ మీడియాతో మాట్లాడారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 8, 2025, 07:15 PM IST
Cherasala: డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తోన్న ‘చెరసాల’.. ఏప్రిల్ 11న గ్రాండ్ రిలీజ్..

Cherasala: రామ్ ప్రకాష్,  శ్రీజిత్, నిష్కల, రమ్య ముఖ్యపాత్రలో నటించిన చిత్రం ‘చెరసాల’. ఏప్రిల్ 11న గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ సోమవారం నాడు మీడియా ముందుకు వచ్చి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో..డైరెక్టర్, హీరో రామ్ ప్రకాష్ గున్నం మాట్లాడుతూ .. ‘మంచి కాన్సెప్ట్‌తో చెరసాల   చిత్రం ఉండబోతుంది.  కథ చెప్పిన వెంటనే నిర్మాతలు ఓకే చేసారు. శ్రీజిత్, నిష్కల అద్భుతంగా నటించిన విషయాన్ని ప్రస్తావించారు.  మంచి టీం ఉంటేనే మంచి సినిమాను తీయగలుగుతాము.  ఓ బంధం ఎలా ఉండాలి? రిలేషన్ షిప్‌లో ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు అనే పాయింట్‌ ను బేస్ చేసుకొని ఈ సినిమాను తెరకెక్కించాము.  మంచి ఎమోషన్స్‌తో పాటుగా చక్కని ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులను నవ్వించడంతో పాటు సందేశం కూడా ఉందన్నారు.  అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా మా చెరసాల చిత్రం ఉంటుంది. ఏప్రిల్ 11న రాబోతోన్న మా సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరారు.

Add Zee News as a Preferred Source

హీరో శ్రీజిత్ మాట్లాడుతూ .. ‘చెరసాల సినిమాను సపోర్ట్ చేసేందుకు వచ్చిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు. నేను తెలుగులోనే డబ్బింగ్ చెప్పాలని ప్రయత్నించాను. కానీ అది కుదరలేదు. సినిమా చాలా బాగా వచ్చింది.  ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు. మా దర్శకుడు ఈ చిత్రం మీద నాలుగేళ్లు నజర్  పెట్టాడు. మధ్యలో ఇతర ఆఫర్లు వచ్చినా కూడా మా సినిమా మీదే దృష్టి పెట్టిన విషయాన్ని ప్రస్తావించారు. నేను కన్నడలో ఇది వరకు సినిమాలు చేశాను. నన్ను నమ్మి మా దర్శకుడు నాకు అవకాశం ఇచ్చారు. ఇలాంటి మంచి చిత్రాలు మరిన్ని రావాలన్నారు. మా సినిమా ఏప్రిల్ 11న రాబోతోంది. ప్రేక్షకులు ఆదరించాలని కోరారు.

ఇదీ చదవండి: Sri Rama Navami 2025: వెండితెరపై సీతమ్మ వారి పాత్రల్లో మెప్పించిన నటీమణులు..

ఇదీ చదవండి:  Sri Rama Navami 2025: వెండితెర శ్రీరాముళ్లు..

హీరోయిన్ నిష్కల మాట్లాడుతూ .. ‘నాకు చెరసాల చిత్రంలో ఛాన్స్ ఇచ్చిన నిర్మాత, దర్శకులకు ప్రత్యేకంగా థాంక్స్.  తెలుగులో  నాకు ఇదే ఫస్ట్ మూవీ. ఇందులో నేను ప్రియ అనే అద్భుతమైన పాత్రను పోషించాను. ఇంత మంచి సినిమాలో పని చేయడం సంతోషంగా ఉందన్నారు. డైరెక్టర్ రామ్ ప్రకాష్ సినిమాను అద్భుతంగా మలిచిన విషయాన్ని ప్రస్తావించారు.  మేం కష్టపడి, ఇష్టపడి సినిమాను చేశామన్నారు. అందరికీ ఈ చిత్రం నచ్చుతుందని భావిస్తున్నాను.

నటి రమ్య మాట్లాడుతూ .. ‘చెరసాల సినిమాలో నటించడం ఆనందంగా ఉందన్నారు. కథా రచయిత ఫణీంద్ర భరద్వాజ్ మాట్లాడుతూ .. ‘చెరసాల చిత్రం అద్భుతంగా వచ్చిందన్నారు. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి ఇవ్వడం గ్యారంటీ అన్నారు. 

READ ALSO:  Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..

READ ALSO:  Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News