Chhaava 11 days Box office Collecions: వర్కింగ్ డేలో కూడా ఈ హోల్డ్ ఏంది సామి.. సోమవారమైన తగ్గని ‘ఛావా’ జోరు..

Chhaava 11 days Box office Collecions: విక్కీ కౌశల్ టైటిల్ రోల్లో యాక్ట్ చేసిన సినిమా ‘ఛావా’. ఛత్రపతి శివాజీ కుమారుడు ఛత్రపతి శంభాజీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతోంది. అంతేకాదు 2025లో హిందీలో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. ఇక ఈ సినిమా 11వరోజు రెండో సోమవారం డీసెంట్ వసూళ్లనే రాబట్టింది.  

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 25, 2025, 12:25 PM IST
Chhaava 11 days Box office Collecions: వర్కింగ్ డేలో కూడా ఈ హోల్డ్ ఏంది సామి.. సోమవారమైన తగ్గని ‘ఛావా’ జోరు..

Chhaava 11 days Box office Collecions: బాలీవుడ్ లో ప్రస్తుతం చరిత్రలో మన దేశాన్ని అనేక ఏళ్లు పరిపాలించిన పాలకులు మన దేశాన్ని ఆక్రమించిన పరాయి రాజులనే గొప్పగా చూపెట్టారు. అంతేకాదు మన పాఠ్య పుస్తకాల్లో  చూపెట్టిన అసలు సిసలు హీరోల కథలను వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు. ఈ కోవలో వచ్చిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’, ది కేరళ స్టోరీ, ఎమర్జన్సీ, సబర్మతి రిపోర్ట్, బస్తర్ వంటి సినిమాలు వస్తున్నాయి. ఇందులో మెజారిటీ చిత్రాలు ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నాయి. తాజాగా విడుదలైన  ‘ఛావా’ సినిమా కూడ రికార్డుల బెండ్ తీస్తోంది. మనకు శివాజీ గురించి తెలుసు. అది కూడా పూర్తి స్థాయిలో చాలా మందికి తెలియదు.

Add Zee News as a Preferred Source

తాజాగా మరాఠీలో ఓ ప్రసిద్ధ కవి రాసిన ‘ఛావా’ నవలనే అదే పేరుతో వెండితెరపై ఆవిష్కరించారు. ఈ సినిమా విడుదలైన రోజు నుంచి మంచి వసూల్లతో దూసుకుపోతుంది. అంతేకాదు ఈ సినిమా ఫస్ట్ వీక్..  మన దేశంలో హిందీ వెర్షన్ లో రూ. 228.28 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది.

రెండో వారంలో మొదటి రోజుల్లో రూ. 109.23 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. అంతకాదు పుష్ప 2 తర్వాత బాలీవుడ్ లో సెకండ్ వీకెండ్ లో రూ. 100 కోట్ల నెట్ వసూళ్లను  సాధించిన చిత్రంగా నిలిచింది. మొత్తంగా డైరెక్ట్ హిందీ చిత్రం సెకండ్ వీకెండ్ లో రూ. 100 కోట్ల కు పైగా నెట్ వసూళ్లను సాధించడం విశేషం. ఈ సినిమా రెండో సోమవారం ఈ సినిమా రూ. 19.10 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. మొత్తంగా వర్కింగ్ డేలో కూడా డీసెంట్ వసూళ్లను రాబట్టింది. ఇప్పటికీ  మొత్తంగా 11 రోజుల్లో రూ. 353.61 కోట్ల నెట్ వసూల్లతో దూసుకుపోతుంది. మొత్తంగా ఈ రోజు మంగళవారంతో పాటు శివరాత్రి రోజు ఈ సినిమాకు మరిన్ని వసూల్లు పెరిగే అవకాశాలున్నాయి.  

ఇదీ చదవండి:   అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.

ఈ సినిమా త్వరలో రూ. 500 కోట్ల నెట్ వసూళ్లు సాధించినా..పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదనే చెప్పాలి. మొత్తంగా ఈ సినిమా ఇప్పటి వరకు  వరల్డ్ వైడ్ గా రూ. 600 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ముందు ముందు ‘ఛావా’ సినిమా  ఏ మేరకు బాక్సాఫీస్ దగ్గర ఏ మేరకు మాయ చేస్తుందో చూడాలి.

ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..

 

ఇదీ చదవండి: Liquor Rates Hike: మందుబాబుకు భారీ షాక్.. భారీగా పెరిగిన బీర్ల ధరలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News