Chhaava collections: 2 వారాల్లో ఎంత విధ్వంసం.. రికార్డులను చావు దెబ్బ కొట్టిన ఛావా..!

Chhaava 2 Week Box Office collections: ఛత్రపతి శివాజీ మహారాజ్ పెద్ద కుమారుడు శంభాజీ (ఛావా) జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ఛావా’. విడుదలైనప్పటి నుంచి పలు రికార్డులను బద్దలు కొడుతున్న ఈ చిత్రం నిన్నటితో రెండు వారాల మైలు రాయిని దాటింది. అంతేకాదు ఈ సినిమా పలు రికార్డులను చావు దెబ్బ కొట్టింది.  

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 28, 2025, 01:04 PM IST
Chhaava collections: 2 వారాల్లో  ఎంత విధ్వంసం.. రికార్డులను చావు దెబ్బ కొట్టిన ఛావా..!

Chhaava 2 Week Box Office collections: ఛత్రపతి శివాజీ మహారాజ్ కన్నుమూసిన తర్వాత మరాఠ సామ్రాజ్యాధినేతగా ఛత్రపతిగా పట్టాభిషిక్తుడైన శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మూవీ ‘ఛావా’. రిలీజైన రోజు నుంచి పూటకో రికార్డులను మటాష్ చేస్తోన్న ఈ చిత్రం 2 వారాల్లో సరిగ్గా రూ. 400 కోట్ల నెట్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ను సాధించి పలు రికార్డులను ఉప్పు పాతర వేసింది. ముఖ్యంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ మరణ వార్త  విని ఆనంద పడ్డ  ఔరంగజేబుకు కంట్లో నలుసులా మారతాడు ఛత్రపతి శంభాజీ మహారాజ్. దాదాపు 9 యేళ్లు ఔరంగజేబును ముప్పుతిప్పలు పెడతాడు.  అత్యంత తక్కువ సైన్యంతో అత్యంత క్రూరుడైన ఔరంగజేబును ఎలా ఎదురించాడు.  తనను ధిక్కరించిన మరాఠా యోధుడైన శంభాజీ పట్టుకునేందుకు లక్షలాదికి తన సైన్యంతో దక్కన్ పై దండయాత్రకు బయలు దేరుతాడు.   వారిని  శంభాజీ మహారాజ్ కేవలం 10 వేల మంది సైన్యంతో ఎలా ఫేస్ చేశాడు. ఔరంగజేబు సైన్యాన్ని గెరిల్లా పద్ధతుల్లో ఎలా తుద ముట్టించాడు. చివరకు సొంత బామ్మర్దుల వెన్నుపోటు కారణంగా శంభాజీని ఔరంగజేబు సైన్యం ఎలా పట్టుకుంది. ఈ నేపథ్యంలో శంభాజీ ఎలా చిత్ర హింసలకు గురి చేసి మట్టు పెట్టాడు అనేదే ఈ సినిమా.  

Add Zee News as a Preferred Source

‘ఛావా’ సినిమా చూపించినట్టు శంభాజీని ఔరంగజేబు ఎంత క్రూరంగా హింసించిన విధానం. చేతి పది చేతులకు ఉన్న గోళ్లను అత్యంత కిరాతకంగా పీకి పారేయడం. అటు కళ్లను పొడవడం..చివరకు నాలుకను పీకేయడం. ఇలాంటివి తెరపై చూస్తేనే తట్టుకొని సహించడం కష్టం. అలాంటిది ‘శంభాజీ’ ఎలా ఎదుర్కొన్నడనేది వెండితెరపై చూస్తుంటే రక్తం మరిగిపోవడం ఖాయం అని చెప్పాలి. మొఘలాయిల అరాచకాలు  అప్పట్లో జరిగిన ఈ సంఘటనలను వెండితెరపై ఎంతో హృద్యంగా కళ్లు చెమ్మగిల్లేలా తెరకెక్కించాడు దర్శకుడు లక్ష్మణ్ ఊటెకర్. ఇక శంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ తన నటనతో జీవం పోసాడు.

ఇదీ చదవండి:   అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.

అటు ఔరంగజేబు పాత్రలో అక్షయ్ ఖన్నా అద్భుతంగా ఒదిగిపోయాడనే చెప్పాలి. రష్మిక మందన్న..పాత్రను యశో భాయిగా ఉంటే.. ఏసు బాయిగా చెప్పడమే సినిమా వాళ్లు కరెక్ట్ చేసుకోవాలి.  మొత్తంగా మొదటి వారం  మన దేశంలో రూ. 228.28 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. మొత్తంగా గురువారం రోజు ఈ సినిమా రూ. 13.60 కోట్ల నెట్ వసూల్లతో మంచి హోల్డ్ చూపించింది. ఓ రకంగా సినిమా విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు రూ. 10 కోట్లకు తక్కువగా కాకుండా వసూళ్లను రాబడుతూనే ఉంది. నిన్ననే అతి తక్కువ వసూళ్లు వచ్చాయి. మొత్తంగా రెండు వారాల్లో ఈ సినిమా 411.46 కోట్ల నెట్ వసూల్లతో దూకుడు మీదుంది. అటు ఈ శుక్రవారం.. శని, ఆదివారాల్లో ఈ సినిమా ఊహ కందని వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. మరోవైపు ఈ సినిమా మార్చి 7న తెలుగులో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక ఛావా  పాత్రకు ఎన్టీఆర్ డబ్బింగ్ చెబుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి నిజమా కాదా అనేది చిత్ర యూనిట్ అఫీషియల్ గా ప్రకటిస్తే బాగుంటుంది. మొత్తంగా వచ్చే వారం ఈ సినిమా రూ. 500 కోట్ల క్లబ్బులో ఈ సినిమా చేరడం గ్యారంటీ అని చెప్పాలి. మొత్తంగా బాలీవుడ్ లో మరో పెద్ద సినిమా రిలీజయ్యే వరకు బాక్సాఫీస్ దగ్గర ‘ఛావా’ దూకుడు కొనసాగుతుందనే చెప్పాలి.

ఇదీ చదవండి: Liquor Rates Hike: మందుబాబుకు భారీ షాక్.. భారీగా పెరిగిన బీర్ల ధరలు..

ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News