Chhaava 4 Week Box Office Collections: ‘ఛావా’ ఇది పేరు కాదు ఓ ఎమోషన్ అని చెప్పాలి. ప్రస్తుతం ఈ చిత్రం బాలీవుడ్ రికార్డుల తుక్కు ఒదలగొడుతోంది. చారిత్రక చిత్రాల్లో సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఈ సినిమా జైత్ర యాత్ర కొనసాగుతోంది. అంతేకాదు ఈ సినిమా హిందీలో విడుదలైన మూడు వారాల తర్వాత తెలుగులో విడుదలైన సంచలన విజయం సాధించింది. అంతేకాదు ఇక్కడ ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం క్రిటిక్స్ ప్రశంసలతో పాటు కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. ఇక హిందీలో బాక్సాఫీస్ పరంగా ఎన్నో రికార్డులను పాతర వేసింది. అంతేకాదు 2025 యేడాది గాను నేషనల్ అవార్డ్స్ లో ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు సహా పలు విభాగాల్లో ఈ సినిమా సత్తా చాటడం పక్కా అని చెబుతున్నారు.
నిన్నటితో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా 4 వారాలు పూర్తి చేసుకుంది. నాల్కో వారంలో కూడా ఈ సినిమా ఎక్స్ లెంట్ గ్రోత్ చూపించింది. నాల్గో వారంలో ఆదివారం భారత్, న్యూజిలాండ్ మ్యాచ్ ఈ సినిమా వసూళ్లపై కాస్త ప్రభావం చూపించింది. ఈ సినిమా నాలుగు వారంలో బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయానికొస్తే.. శుక్రవారం.. రూ. 6.30 కోట్లు.. శనివారం.. రూ. 13.70 కోట్లు.. ఆదివారం.. రూ. 8.43 కోట్ల నెట్ వసూల్లు.. సోమవారం.. రూ. 3.80 కోట్లు.. మంగళవారం రూ. 4.02 కోట్లు.. బుధవారం.. రూ. 3.93 కోట్లు.. గురవారం. రూ. 3.80 కోట్లు.. మొత్తంగా నాల్గో వారం లో రూ. 43.98 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది.
మొత్తంగా నాలుగు వారాలు కలిపితే.. మొదటి వారం.. రూ. 225.28 కోట్లు.. రెండో వారం.. రూ. 186.18 కోట్లు.. మూడో వారం.. రూ. 84.94 కోట్లు.. నాల్గో వారం.. రూ. 43.98 కోట్లు.. మొత్తంగా రూ. 540.38 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. తెలుగులో మొదటి వారంలో ఈ సినిమా రూ. 11.80 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది.
ఫోర్త్ వీక్ లో పుష్ప 2 హిందీ వెర్షన్ మొత్తంగా ₹ 57.95 కోట్ల ను రాబడితే.. ఛావా.. రూ. 43.98 కోట్లు రాబట్టింది. ఆ తర్వాత స్త్రీ 2 మూవీ 37.75 కోట్లు నాల్గో వారంలో రాబట్టింది. మొత్తంగా తెలుగుతో పాటు హిందీలో మన దేశంలో ఈ సినిమా ₹ 552.18 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా కలిపి ఈ సినిమా రూ. 777 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి మంచి దూకుడు మీదుంది.
ఇదీ చదవండి: నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?
ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









