Chhaava Collections:‘ఛావా’ ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ ముద్దుగా ఛావా అని పిలిచేవారు. ఛావా అంటే సింహం పిల్ల అని అర్ధం.శివాజీని సింహం అయితే.. ఆయన కుమారుడు సింహం పిల్ల ‘ఛావా’ అని పేరు వచ్చింది.మొత్తంగా ఛావా ఓ పేరు కాదు.. ఓ ఎమోషన్ అని చెప్పాలి. ప్రస్తుతం ఈ చిత్రం బాలీవుడ్ రికార్డుల తుక్కు రేగోడుతుంది. ఈ సినిమా చారిత్రక చిత్రాల్లో సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం బాలీవుడ్ లో ‘ఛావా’ జైత్ర యాత్ర కొనసాగుతోంది. అంతేకాదు ఈ సినిమా హిందీలో విడుదలైన మూడు వారాల తర్వాత తెలుగులో విడుదలైన తర్వాత సంచలన విజయం సాధించింది. అంతేకాదు ఇక్కడ ఆడియన్స్ ఈ సినిమాను నెత్తిన పెట్టుకున్నారు.
లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రం క్రిటిక్స్ ప్రశంసలతో పాటు వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇక బాలీవుడ్ లో బాక్సాఫీస్ పరంగా ఎన్నో రికార్డులను పాతర వేసింది. అంతేకాదు 2025 యేడాది గాను నేషనల్ అవార్డ్స్ లో ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు సహా పలు విభాగాల్లో ఈ చిత్రం అవార్డులు కొల్లగొట్టడం ఖాయం అని పలువురు క్రిటిక్స్ చెబుతున్నారు. తాజాగా ఈ సినిమా నిన్నటితో 31 రోజులతో పాటు 5వ వీకెండ్ పూర్తి చేసుకుంది.
5th వీక్ లో ఈ సినిమా పుష్ప 2, స్త్రీ 2 రికార్డులను బద్దలు కొట్టింది. 5వ వీకెండ్ లో పుష్ప 2 రూ. 14 కోట్ల నెట్ వసూళ్లను రాబడితే.. స్త్రీ 2 మూవీ రూ. 16 కోట్ల నెట్ వసూళ్లను మన దేశంలో రాబట్టింది. అదే ఛావా మూవీ 5వ వారంలో తొలి మూడు రోజుల్లో రూ. 22 కోట్ల నెట్ వసూల్లతో చరిత్ర సృష్టించింది.
మొత్తంగా 5వ వీకెండ్ లో రూ. 22 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. ఛావా ఫస్ట్ వారం.. రూ. 225.28 కోట్లు.. రెండో వారం.. రూ. 186.18 కోట్లు.. మూడో వీక్.. రూ. 84.94 కోట్లు.. నాల్గో వారంలో రూ. 43.98 కోట్లు.. రాబట్టింది. ఐదో వీకెండ్ లో రూ. 22 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. మొత్తంగా రూ. 562.38 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టి సంచలనం రేపింది. తెలుగులో ఇప్పటి వరకు రూ. 13.61 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. మొత్తంగా మన దేశంలో తెలుగులో కలిపి ఈ చిత్రం రూ. 575.99 కోట్ల నెట్ వసూల్లను రాబట్టింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా కలిపి ఈ సినిమా రూ.800 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి మంచి ఊపు మీదుంది.
ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..
ఇదీ చదవండి: నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









