Chhaava 2 Week Box Office collections: ఛత్రపతి శివాజీ మహారాజ్ తర్వాత మరాఠ సామ్రాజ్యాధినేతగా ఛత్రపతిగా పట్టాభిషిక్తుడైన శంభాజీ మహారాజ్ కథతో తెరకెక్కిన చారిత్రక చిత్రం ‘ఛావా’. విడుదలైన రోజు నుంచి ఈ సినిమా రికార్డులకు పాతర వేస్తూ పోతుంది. ముఖ్యంగా మహారాష్ట్రలో ఈ సినిమాకు ఎక్కువ వసూళ్లు దక్కుతున్నాయి. 2025లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అంతేకాదు ఈ సినిమా మూడో వారంలో కూడా పలు రికార్డులను బద్దలు కొడుతుంది. తాజాగా మూడో శనివారం ఈ సినిమా భారతీయ బాక్సాఫీస్ దగ్గర రూ. 22.50 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది.
మరోవైపు పుష్ప మూడో శనివారం బాక్సాఫీస్ దగ్గర రూ. 20.50 కోట్లు.. స్త్రీ 2 మూవీ.. రూ. 17.40 కోట్లు నెట్ వసూల్లతో మూడో స్థానంలో నిలిచింది. అటు బాహుబలి 2 హిందీ వెర్షన్ మూడో శనివారం రూ 14.75 కోట్ల నెట్ వసూళ్లనే రాబట్టింది. మొత్తంగా ఛావా మూవీ మూడో శనివారం మన దేశంలోనే హైయ్యెస్ట్ నెట్ వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది.ఓవరాల్ గా 16వ రోజు సాధించిన వసూల్లతో ఛావా మూవీ భారతీయ బాక్సాఫీస్ దగ్గర రూ.447.26 కోట్ల నెట్ వసూళ్ల మార్క్ ను చేరుకుంది. 17వ రోజు ఆదివారంతో ఈ సినిమా రూ. 450 కోట్ల నెట్ వసూళ్ల మార్క్ ను దాటనుంది. నెక్ట్స్ వీక్ లో ఈ చిత్రం రూ. 500 కోట్ల క్లబ్బులో ప్రవేశించనుంది.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
ముఖ్యంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ చావు కబురు సంతోష పడ్డ ఔరంగజేబుకు కంట్లో నలుసులా మారతాడు ఆయన తనయుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్. దాదాపు 9 యేళ్లు ఔరంగజేబును ముప్పుతిప్పలు పెడతాడు. అత్యంత తక్కువ సైన్యంతో అత్యంత క్రూరుడైన మొఘలాయి షెహెన్ షా అయిన ఔరంగజేబును ఎలా ఎదురించాడు. తనను ధిక్కరించిన మరాఠా యోధుడైన శంభాజీ పట్టుకునేందుకు లక్షలాదికి తన సైన్యంతో దక్కన్ పై దండయాత్రకు బయలు దేరుతాడు. వారిని శంభాజీ మహారాజ్ కేవలం 10 వేల మంది సైన్యంతో ఎలా ఫేస్ చేసాడనేది సినిమా చూస్తే తెలుస్తోంది. ఔరంగజేబు సైన్యాన్ని గెరిల్లా పద్ధతుల్లో ఛావా ఎలా చావు దెబ్బ కొట్టాడు. చివరకు సొంత బామ్మర్దుల వెన్నుపోటు కారణంగా శంభాజీని ఔరంగజేబు సైన్యం ఎలా పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో శంభాజీ ఎలా చిత్ర హింసలకు గురి చేసి మట్టు పెట్టాడు అనేదే ఈ సినిమా.
మొత్తంగా ఈ సినిమా ‘ఛావా’ పాత్రలో విక్కీ కౌశల్ ను కాకుండా.. ఆ పాత్రే సజీవంగా మన ముందు కదలాడినట్టు ఉంటుంది. తన ఆహార్యంతో నటనతో ఈ సినిమాకు ప్రాణం పోసాడు. ఇక ఎవరు ఔనన్నా.. కాదన్న 2025 యేడాది జాతీయ ఉత్తమ నటుడు అవార్డు విక్కీ కౌశల్ కు ఇవ్వాల్సిందే అని దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ముక్తకంఠంతో చెబుతున్నారు. అంతేకాదు పలు ప్రైవేటు సంస్థలు ఇచ్చే అవార్డులు కూడా విక్కీ కే ఇవ్వకపోతే.. వాటి క్రెడిబిలిటీ పెద్ద దెబ్బ అని చెప్పాలి. కేవలం హిందీలోనే విడుదలైన ఈ సినిమా త్వరలో తెలుగులో ఈ నెల 7న విడుదల కానుంది. మరి తెలుగులో ఈ సినిమా ఏ మేరకు వసూళ్లను రాబడుతుందనది చూడాలి.
ఇదీ చదవండి: Liquor Rates Hike: మందుబాబుకు భారీ షాక్.. భారీగా పెరిగిన బీర్ల ధరలు..
ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









