Chhaava Telugu Trailer Talk: ‘ఛావా’ ఇది పేరు కాదు ఎమోషన్ అని చెప్పాలి. ప్రస్తుతం ఈ సినిమా బాలీవుడ్ రికార్డుల తుక్కు రేగ్గోడుతుంది. లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. ఇక హిందీలో బాక్సాఫీస్ పరంగా ఎన్నో రికార్డులను సెట్ చేస్తోన్న ఈ సినిమా త్వరలో తెలుగులో రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను విడుదల చేశారు. హిందీ ట్రైలర్ కు తెలుగు డబ్బింగ్ చెప్పి విడుదల చేసారు. ఎవరైనా పెద్ద స్టార్ తో ఈ సినిమాలో కథానాయకుడి పాత్రకు డబ్బింగ్ చెప్పిస్తే ఈ సినిమా రేంజ్ మరో లెవల్లో ఉండదనే చెప్పాలి. మొత్తంగా తెలుగ ట్రైలర్ కూడా ఎంతో ఇంప్రెసివ్ గా ఉంది.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
మరోవైపు నిన్నటితో 17 రోజుల బాక్సాఫీస్ రన్ పూర్తి చేసుకుంది. థర్డ్ వీకెండ్ లో ఈ సినిమా పలు రికార్డులు క్రియేట్ చేస్తోంది. పుష్ప 2, స్త్రీ 2, బాహుబలి 2 పేరిట ఉన్న రికార్డులను తుడిచిపెట్టేసింది. ఈ సినిమా మూడో వీకెండ్ లో మూడు రోజుల్లో రూ. 60.10 కోట్ల నెట్ వసూళ్లను సాధిస్తే.. పుష్ప 2 మూవీ.. 60 కోట్ల నెట్ వసూళ్లనే రాబట్టింది. అటు స్త్రీ 2 - రూ. 48.75 కోట్ల నెట్ వసూళ్లను రాబడితే.. బాహుబలి 2 మూవీ ఫస్ట్ వీకెండ్ లో రూ. 42.55 కోట్ల నెట్ వసూళ్లను సాధించడం విశేషం.
The True Legend #Chhaava Arrives!?
Witness the Immortal Saga of an Epic WARRIOR ❤️?The Greatest & Grandest #ChhaavaTeluguTrailer is Out Now⚔️?
▶️ https://t.co/4AS7osf4AW#ChhaavaTelugu grand release on March 7th by #GeethaArtsDistributions ❤️#ChhaavaInCinemas #ChhaavaRoars… pic.twitter.com/DlD77Frj1n
— Geetha Arts (@GeethaArts) March 3, 2025
#Chhaava sparkles yet again in Weekend 3… Continues its phenomenal run, with Saturday and Sunday delivering outstanding numbers.
What makes this achievement even more remarkable is that these figures have been achieved in the *third weekend* – not during the opening weekend,… pic.twitter.com/ZKKKTWuM1v
— taran adarsh (@taran_adarsh) March 3, 2025
మొత్తంగా ఛావా మొదటి వారం.. రూ. 225.28 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. రెండో వారం.. రూ. 186.18 కోట్ల నెట్ వసూల్లు.. మూడో వీకెండ్ లో రూ. 60.10 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. మొత్తంగా 17 రోజుల్లో ఈ సినిమా రూ. 471.56 కోట్ల నెట్ వసూల్లతో బాక్సాఫీస్ దగ్గర స్ట్రాంగ్ హోల్డ్ తో దూసుకుపోతుంది. ఈ వారంలో ఈ సినిమా చారిత్రకమైన రూ. 500 కోట్ల క్లబ్బులో ప్రవేశించడం పక్కా బాక్సాఫీస్ పండితులు చెబుతున్నారు. ఈ నెల 7న ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు. తెలుగు ఆడియన్స్ కూడా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. మరి టాలీవుడ్ లో శంభాజీ మహారాజ్ మూవీ ఏ మేరకు బాక్సాఫీస్ దగ్గర మాయ చేస్తుందో చూడాలి.
ఇదీ చదవండి: Liquor Rates Hike: మందుబాబుకు భారీ షాక్.. భారీగా పెరిగిన బీర్ల ధరలు..
ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









